నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

నీతి ఆయోగ్ 'వికసిత్ భారత్ ఏఐ రోడ్ మ్యాప్' , 'ఫ్రాంటియర్ టెక్ రిపోజిటరీ' ని ప్రారంభించిన శ్రీమతి నిర్మలా సీతారామన్, శ్రీ అశ్వినీ వైష్ణవ్


2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ కార్యక్రమాన్ని వేగిరం చేసే దిశగా ఫ్రాంటియర్ టెక్ హబ్

Posted On: 15 SEP 2025 6:26PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ ఇవాళ రెండు వినూత్న కార్యక్రమాలను ప్రారంభించిందివికసిత్ భారత్ ఏఐ రోడ్ మ్యాప్వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి అవకాశంఫ్రాంటియర్ టెక్ హబ్ కింద నీతి ఫ్రాంటియర్ టెక్ రిపోజిటరీఆర్థికకార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్రైల్వేసమాచారప్రసారఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్నీతి ఆయోగ్ వైస్ ఛైర్ పర్సన్ శ్రీ సుమన్ బెరీనీతి ఆయోగ్ సీఈఓ శ్రీ బి.వి.ఆర్సుబ్రహ్మణ్యంఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్ ఈ రోడ్ మ్యాప్ ను ప్రారంభించారు.

ప్రారంభ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూదేశవ్యాప్తంగా అన్ని జిల్లాల అభివృద్ధికి ఏఐ సాంకేతికతను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారుసాంకేతికత ఆవిష్కరణలో సహకార వ్యవస్థల ప్రాధాన్యతను వివరించారునీతి ఆయోగ్ ఫ్రాంటియర్ టెక్ హబ్ తేనెతుట్టె నిర్మాణం వంటిదనిప్రభుత్వంపరిశ్రమలుఆవిష్కర్తలను ఒకే వ్యవస్థలోకి తీసుకువచ్చి ఆలోచనలను ఆచరణలో పెడుతుందన్నారుఫ్రాంటియర్ టెక్నాలజీ రంగంలో భారత్ వెనుకబడకూడదనిప్రపంచానికి నాయకత్వం వహించేలా భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని తెలిపారు.

మన జీవన విధానాన్నిపనితీరుని ఏఐ పూర్తిగా మార్చబోతుందని రైల్వేసమాచార ప్రసారఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారువికసిత్ భారత్ కోసం కలలు కనే ఆత్మవిశ్వాసం యువతలో పెరగటమే ఇవాళ్టి అతిపెద్ద మార్పు అని చెప్పారునేటి అభివృద్ధి బలంగాసమ్మిళితంగాసాంకేతికతతో కూడినదని స్పష్టం చేశారు.

ఏఐ నుంచి ఆచరణాత్మక ఫలితాలను పొందేందుకు ఈ రోడ్ మ్యాప్ కార్యాచరణను రూపొందించిందిఇందులో రెండు ప్రధాన అంశాలను కీలకంగా ప్రస్తావించింది: (i) ఉత్పాదకతసామర్థాన్ని పెంచేందుకు పరిశ్రమల్లో ఏఐ వినియోగాన్ని పెంచటం; (ii) జనరేటివ్ ఏఐతో ఆర్ అండ్ డీలో మార్పులు తీసుకువచ్చిభారత్ ను ఆవిష్కరణ ఆధారిత అవకాశాల్లో ముందుంజలో ఉంచటంఈ రోడ్ మ్యాప్ ను ఇక్కడ చూడవచ్చు https://niti.gov.in/sites/default/files/2025-09/AI-for-Viksit-Bharat-the-opportunity-for-accelerated-economic-growth.pdf


 

నాలుగు రంగాలువ్యవసాయంఆరోగ్యంవిద్యజాతీయ భద్రతలో దేశవ్యాప్తంగా ప్రభావవంతమైన 200కి పైగా కథనాలను రోడ్ మ్యాప్ కు మద్దతుగాఫ్రాంటియర్ టెక్ రిపోజిటరీ ప్రదర్శిస్తుందిరాష్ట్రాలుఅంకురసంస్థలు టెక్నాలజీని ఉపయోగించిప్రజల జీవన విధానాలను ఎలా మారుస్తున్నదీ ఇది చూపిస్తుందిదీన్ని ఇక్కడ చూడవచ్చు https://frontiertech.niti.gov.in/

భారత్ శాతం వృద్ధి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఉత్పాదకతఆవిష్కరణల్లో విప్లవాత్మక మార్పు అవసరమని నీతి ఆయోగ్ సీఈఓ శ్రీ బి.వి.ఆర్సుబ్రహ్మణ్యం అన్నారుఈ లక్ష్యాన్ని చేరుకోటానికి ఏఐ కీలకమని చెప్పారువికసిత్ భారత్ కోసం ఏఐ రోడ్ మ్యాప్ ప్రతి రంగానికి ప్రత్యేకమైనస్పష్టమైన కార్యాచరణను అందిస్తుందనిరాష్ట్రాలుజిల్లాల్లో టెక్నాలజీని విస్తరించిప్రజల జీవనశైలిపై ప్రభావం చూపటానికి ఫ్రాంటియర్ టెక్ రిపోజిటరీ ప్రేరేపిస్తుందని తెలిపారుసాంకేతికతను విస్తృతంగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకుదాని ప్రభావాన్ని పెంచేందుకు రెండు కార్యక్రమాలను ఆయన ప్రకటించారుఅవి:

  • నీతి ఆయోగ్ లో 'ఫ్రాంటియర్ 50 ఇనిషియేటివ్ద్వారా వెనుకబడిన 50 జిల్లాలు లేదా బ్లాకుల్లో తమ వద్ద ఉన్న రిపోజిటరీ నుంచి ఉపయోగకరమైన సాంకేతికను ఎంచుకునిఆయా ప్రాంతాల్లో సేవలను వేగంగా అందించటం.

  • నీతి ఫ్రాంటియర్ టెక్ ఇంపాక్ట్ అవార్డ్స్ ఫర్ స్టేట్స్ ద్వారా పాలనవిద్యఆరోగ్యంజీవనోపాధి మొదలైన రంగాల్లో టెక్నాలజీ వినియోగంలో ప్రతిభ చూపిన మూడు రాష్ట్రాలను గుర్తించి సత్కరించటమే కాకగణనీయమైన మార్పులు సాధించటానికి వాటికి సహకరించటం.

భవిష్యత్తులో ఏఐ కన్నా విధ్వంసకర సాంకేతిక మార్పులు చోటుచేసుకుంటాయని నీతి ఆయోగ్ ప్రత్యేక సభ్యురాలు, ఫ్రాంటియర్ టెక్ హబ్ ముఖ్య రూపకర్త శ్రీమతి దేవయాని ఘోష్ అన్నారువాటిని ఎదుర్కొని ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారత్ నిలవాలంటే.. భవిష్యత్ పోకడలను ముందుగానే గుర్తించాలనిసరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలనిప్రపంచ ప్రమాణాలను రూపొందించుకోవాలనిబలమైన భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని చెప్పారు.

ప్రాథమిక స్థాయిలో సాంకేతికతను ఉపయోగించి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన స్టార్టప్ వ్యవస్థాపకులు, జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుదేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల ప్రముఖులుప్రభుత్వాధికారులు వర్చువల్ గా హాజరయ్యారు.

 

***


(Release ID: 2167348) Visitor Counter : 2