సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన 14వ పెన్షన్ అదాలత్‌కు అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


* పరిష్కరానికై దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న 894 వృద్దాప్య, కుటుంబ పింఛన్ల ఫిర్యాదుల స్వీకరణ

* 13 పెన్షన్ అదాలత్‌ల ద్వారా స్వీకరించిన 25,800కు పైగా పెన్షన్ ఫిర్యాదుల్లో 18,481 ఫిర్యాదులను పరిష్కరించాం - డాక్టర్ జితేంద్ర సింగ్

* దేశ నిర్మాణంలో విలువైన భాగస్వాములైన పింఛనుదారుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్న డాక్టర్ జితేంద్ర సింగ్

* పింఛనుదారులు, వారి కుటుంబాలకు గౌరవం, సకాలంలో న్యాయం, ఆర్థిక భద్రత అందించేందుకు హామీ

Posted On: 10 SEP 2025 4:47PM by PIB Hyderabad

కేంద్ర సిబ్బందిప్రజా ఫిర్యాదులుపింఛన్లుపీఎంవోఅణుశక్తిఅంతరిక్ష శాఖల సహాయ మంత్రిసైన్స్ అండ్ టెక్నాలజీభూభౌతిక శాస్త్ర సహాయం మంత్రి (స్వతంత్రడాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన పెన్షన్ అదాలత్‌కు అధ్యక్షత వహించారు.

‘‘కుటుంబ పింఛనుదారులుసూపర్ సీనియర్ పింఛనుదారులు’’ ఇతివృత్తంతో పింఛనుపింఛనుదారుల సంక్షేమ విభాగం (డీవోపీపీడబ్ల్యూఈ అదాలత్‌ను చేపట్టింది. 21 విభాగాలుమంత్రిత్వశాఖలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న మొత్తం 894 ఫిర్యాదులను పరిష్కారం కోసం స్వీకరించారు.

14వ పెన్షన్ అదాలత్‌ను ప్రారంభిస్తూ.. సంబంధిత విభాగాలుమంత్రిత్వ శాఖలుసంస్థలను ఒకే వేదికకు తీసుకువచ్చిన ప్రత్యేకమైన ఏకోన్ముఖ ప్రభుత్వ విధానాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు.

ఫిర్యాదుల పరిష్కారాన్ని ఈ అదాలత్ వేగవంతం చేసిందనివిధానపరమైన జాప్యాలను తగ్గించిందని డాక్టర్ సింగ్ తెలియజేశారుతమకు న్యాయంగా దక్కాల్సిన బకాయిల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పెన్షనర్లకు ఇది సకాలంలో న్యాయం అందించిందిఅలాగే పింఛనుదారులను లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా.. సమాజానికి చురుకైన భాగస్వామ్యం అందిస్తున్నవారిగా గుర్తిస్తూవృద్ధాప్యంలో గౌరవానికిఆర్థిక భద్రతకు అర్హులని తెలియజేస్తూ వారి పట్ల ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటింటింది.
వందల మంది పింఛనుదారులువారి కుటుంబాలకు ఈ అదాలత్ ఉపశమనాన్ని అందించిందివారిలో చాలా మంది ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారుపరిష్కరించిన వాటిలో కొన్ని ముఖ్యమైన కేసులు

  1. హానరరీ లెఫ్టినెంట్ బల్వీర్ సింగ్ (పంజాబ్ రెజిమెంట్) - 2024, ఏప్రిల్ 30న జమ్మూ నుంచి పదవీ విరమణ చేశారుప్రక్రియలో జాప్యాల అనంతరంచివరకు రూ46,04,537 సొమ్మును దివ్యాంగకమ్యూటేషన్ పెన్షన్‌గా స్వీకరించారు.

  2. లెఫ్టినెంట్ కల్నల్ ప్రతాప్ చంద్ సూద్ - 1994, ఆగస్టు 31న పదవీ విరమణ చేశారుఆయనకు 2006 జనవరి నుంచి పింఛను బకాయిలను చెల్లించలేదుఈ కేసును పరిష్కరించడం వల్ల ఆయనకు రూ.18,89,331 అందాయి.

  3. శ్రీమతి చంపా రౌతేలా, 84 ఏళ్ల వయసున్న ఈమె మాజీ కానిస్టేబుల్ నారాయణ్ సింగ్ (బీఎస్ఎఫ్భార్యఆయన 2014, ఫిబ్రవరి 26న మరణించారుఅప్పటి నుంచి ఆమెకు కుటుంబ పింఛను అందలేదుఆమె కేసు చివరకు పరిష్కారమైందిరూ. 15 లక్షల కుటుంబ పెన్షన్ బకాయి ఆమెకు అందాయి.

ఈ విజయ గాథలు ఆర్థిక పరిష్కారాలుగా మాత్రమే పరిమితం కాకుండా.. పింఛనుదారులువారి కుటుంబాలకు గౌరవాన్నిన్యాయాన్నిఉపశమనాన్ని అందించాయి.

వివిధ విభాగాలుమంత్రిత్వ శాఖలకు సంబంధించిన 894 ఫిర్యాదులను స్వీకరించారువాటిలో ఎక్కువ భాగం రక్షణరైల్వేలుహోం వ్యవహారాలు నుంచే ఉన్నాయివిభాగాల వారీగా వివరాలు:

 

S. No.

Ministry/Department

No. of Cases

1.

Central Board of Direct Taxes (Income Tax)

5

2.

Department of Animal Husbandry, Dairying

1

3.

Department of Commerce

2

4.

Department of Defence Finance

76

5.

Department of Defence Production

5

6.

Department of Defence Research and Development

3

7.

Department of Ex-Servicemen Welfare

250

8.

Department of Financial Services (Banking Division)

128

9.

Department of Health & Family Welfare

2

10.

Department of Military Affairs

3

11.

Department of Personnel & Training

1

12.

Department of Posts

1

13.

Employees Provident Fund Organisation

10

14.

Ministry of Civil Aviation

1

15.

Ministry of Coal

1

16.

Ministry of External Affairs

1

17.

Ministry of Home Affairs (including Assam Rifles, BSF, CRPF, Delhi Police, CISF, ITBP, SSB, Census, Freedom Fighter Division)

78

18.

Ministry of Housing & Urban Affairs

1

19.

Ministry of Petroleum & Natural Gas

1

20.

Ministry of Railways

11

21.

PCDA(P), Prayagraj

313

 

Total Cases Taken Up

894


 

ఇప్పటి వరకు జరిగిన పెన్షన్ అదాలత్‌లను సమీక్షిస్తూ.. 2025 జూన్లో జరిగిన 13వ పెన్షన్ అదాలత్ వరకు మొత్తం 25,831 కేసులు చేపట్టామనివాటిలో 18,481 కేసులను వివిధ మంత్రిత్వ శాఖలువిభాగాలు విజయవంతంగా పరిష్కరించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.

పెన్షన్ అదాలత్‌లు కేవలం ఫిర్యాదుల పరిష్కార వేదికలు మాత్రమే కాదనిముఖ్యంగా వితంతువులుసూపర్ సీనియర్ సిటిజన్లుకుటుంబ పింఛనుదారులకు న్యాయాన్ని అందించే వ్యవస్థ అని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

ఆరంభ దశలోనే తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుంటున్నారనే హామీని పెన్షనర్లకు అందించడానికిభవిష్యత్తులో జాప్యాలను నివారించడానికి డిజిటల్ ఫిర్యాదు పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రతి విభాగం/మంత్రిత్వ శాఖలో ఫిర్యాదుల సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేశారు.

పాతవైనసంక్లిష్టమైన కేసులను పరిష్కరించాలనే ప్రభుత్వం చిత్తశుద్ధిని 14వ పెన్షన్ అదాలత్ ప్రతిబింబించిందిలక్షల రూపాయల విలువైన బకాయిలను చెల్లించిఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నవారికి న్యాయం అందించి వ్యవస్థపై నమ్మకాన్ని ఈ అదాలత్ తిరిగి నిలబెట్టిందిఅలాగే పింఛనుదారుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న సున్నిత విధానాన్ని స్పష్టం చేసింది.

ప్రతి కేసు డబ్బు కోసం మాత్రమే కాదనిదేశానికి సేవలు అందించిన వారికి లేదా దేశ సేవ చేయడంలో కుటుంబాలకు తోడ్పడిన వారికి గౌరవంమర్యాదన్యాయం గురించి’’ అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

***


(Release ID: 2165546) Visitor Counter : 4