విద్యుత్తు మంత్రిత్వ శాఖ
విద్యుత్ రంగానికి డిజిటల్ వెన్నెముక... ఇండియా ఎనర్జీ స్టాక్ (ఐఈఎస్)ను నిర్మించటానికి వాటాదారుల సర్వేను ప్రారంభించిన విద్యుత్ మంత్రిత్వశాఖ
Posted On:
09 SEP 2025 5:54PM by PIB Hyderabad
భారత విద్యుత్ రంగం గ్రిడ్ డిజిటలైజేషన్, పునరుత్పాదక ఇంధన వనరుల ఏకీకరణ, వికేంద్రీకృత విద్యుదుత్పత్తి, వినియోగదారుల-కేంద్రీకృత సంస్కరణల ద్వారా మార్పును సంతరించుకుంటోంది. ఈ మార్పునకు మద్దతిచ్చేందుకు విద్యుత్ మంత్రిత్వశాఖ ఇండియా ఎనర్జీ స్టాక్ (ఐఈఎస్), విద్యుత్ రంగం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)ను రూపొందించింది.
అనుసంధానించగల, వివేకంతో కూడిన, సమన్వయంతో పనిచేసే వ్యవస్థను ప్రారంభించటమే ఐఈఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా, ఎంపిక చేసిన విద్యుత్ పంపిణీ సంస్థల సాయంతో ప్రామాణిక, ఓపెన్ ఏఐ ఏపీఎస్ లు, ప్రోటోకాల్స్ ను ఉపయోగించి ఒక యుటిలిటీ ఇంటెలిజెన్స్ వేదికను అభివృద్ధి చేయనుంది.
సమగ్ర, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఐఈఎస్, అనుబంధ పరిష్కారాలను రూపొందించటానికి , విద్యుత్ మంత్రిత్వ శాఖ వాటాదారుల మ్యాపింగ్ సర్వేను నిర్వహిస్తోంది. ఈ సర్వే కింది అంశాలపై వివరాలు సేకరిస్తుంది:
-
సంస్థాగత వివరాలు
-
అందించగల పరిష్కారాలు, ఆవిష్కరణలు
-
ఐఈఎస్ వ్యవస్థలో పాల్గొనేందుకు సంసిద్ధత
ఐఈఎస్...మార్చుకోవడానికి వీలున్న ప్రమాణాలు, అనుసంధాన వ్యవస్థను నిర్వచిస్తుంది. దీనివల్ల వాటాదారులు- వినియోగదారులు, సాంకేతిక నిపుణులు, ఆవిష్కరణకర్తలు ఈ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని వారి ఉత్పత్తులు, డిజిటల్ వేదికలనూ రూపొందించుకోవచ్చు. వీటిని ముందుగానే అందిపుచ్చుకోవటం వల్ల సంస్థలు భవిష్యత్ అవసరాలకు సిద్ధం కాగలవు. రెట్రోఫిట్ ఖర్చులూ తగ్గుతాయి. విద్యుత్ రంగంలో ఏకీకృత, ఆవిష్కరణ-ఆధారిత ప్రోత్సాహం ఇచ్చేందుకు సహాయపడుతుంది.
కింద ఇచ్చిన లింక్ ద్వారా వాటాదారులందరూ సంస్థకు సంబంధించిన ఖచ్చితమైన, పూర్తి సమాచారాన్ని అందించి, సర్వేను పూర్తి చేయాలి. సర్వే లింక్: https://forms.office.com/r/Wm0sewTTrC లేదా ఈ కమ్యూనికేషన్/ప్రకటన వెలువడిన నాటి నుంచి రెండు వారాల్లోగా జత చేసిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి. ఈ సర్వే విద్యుత్ పంపిణీ సంస్థలు, పరిష్కారాలు అందించే వారికి సహకరిస్తుంది.
***
(Release ID: 2165238)
Visitor Counter : 7