ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ పురస్కారాలందుకున్న ఉపాధ్యాయుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 04 SEP 2025 9:58PM by PIB Hyderabad

మన సంప్రదాయంలో ఉపాధ్యాయులపై సహజమైన గౌరవం ఉంది. వారు సమాజానికి గొప్ప బలం కూడాఉపాధ్యాయులను ఆశీర్వాదాల కోసం నిలబడేలా చేయడం తప్పునేను అలాంటి పాపం చేయాలనుకోనునేను మీతో మాట్లాడాలనుకుంటున్నానుమీ అందరినీ కలవడం నాకు అద్భుతమైన అనుభవంమీలో ప్రతి ఒక్కరికి మీ సొంత కథ ఉండి ఉంటుంది. ఎందుకంటే అది లేకుండా మీరు ఈ స్థాయికి చేరుకునేవారు కాదుఆ కథలన్నింటినీ తెలుసుకోవడానికి తగినంత సమయం దొరకడం కష్టం. కానీ మీ నుంచి నేను నేర్చుకోగలిగినది నిజంగా స్ఫూర్తిదాయకం.. దాని కోసం నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నానుఈ జాతీయ పురస్కారం అందుకోవడం ముగింపు కాదుఈ పురస్కారం అందుకున్న తర్వాత అందరి దృష్టి మీపైనే ఉంటుందిదీని అర్థం మీ పరిధి గణనీయంగా విస్తరించిందిగతంలో మీ ప్రభావంఆదేశం పరిధి పరిమితమే. ఇప్పుడు ఈ గుర్తింపు తర్వాత అది చాలా విస్తృతంగా పెరుగుతుందిఇది ప్రారంభం అని నేను నమ్ముతున్నానుఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలిమీలో ఉన్న ప్రతిభను మీరు వీలైనంత వరకు అందరితో పంచుకోవాలిమీరు అలా చేస్తే మీలో సంతృప్తి పెరుగుతుందిమీరు ఆ దిశలో కృషి చేస్తూనే ఉండాలిఈ పురస్కారానికి మీరు ఎంపిక కావడం మీ కృషికినిరంతర అంకితభావానికి నిదర్శనంఅందుకే ఇది సాధ్యమైందిఒక ఉపాధ్యాయుడు వర్తమానానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు.. దేశ భవిష్యత్తు తరాలను కూడా రూపొందిస్తాడు.. భవిష్యత్తును మెరుగుపరుస్తాడుఇది దేశానికి చేసే సేవ కంటే తక్కువ కాదని నేను నమ్ముతున్నానునేడు మీవంటి కోట్లాది మంది ఉపాధ్యాయులు అదే దేశభక్తినిజాయితీఅంకితభావంతో దేశ సేవలో నిమగ్నమై ఉన్నారుఅందరికీ ఇక్కడికి వచ్చే అవకాశం లభించకపోవచ్చుబహుశా చాలామంది ప్రయత్నించి ఉండకపోవచ్చు.. కొందరు గమనించి ఉండకపోవచ్చుఅలాంటి సామర్థ్యాలు గల ఉపాధ్యాయులు అనేకమంది ఉన్నారువారందరి సమిష్టి కృషి వల్లే దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.. భావి తరాలూ అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. దేశం కోసం జీవించే అందరి సహకారం దీనిలో ఉంటుంది.

మిత్రులారా,

మన దేశం ఎల్లప్పుడూ గురు-శిష్య సంప్రదాయాన్ని గౌరవిస్తుందిభారతదేశంలో గురువును జ్ఞానాన్ని అందించే వ్యక్తిగా మాత్రమే కాకుండా జీవితానికి మార్గదర్శిగా గౌరవిస్తారునేను తరచుగా చెబుతుంటాను.. తల్లి జన్మనిస్తుందికానీ గురువు జీవితాన్ని ఇస్తాడు అనిమనం వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రస్తుత సమయంలో ఈ గురుశిష్య సంప్రదాయం మనకు తోడుగా ఉండే గొప్ప బలాల్లో ఒకటిమీలాంటి ఉపాధ్యాయులు ఈ గొప్ప సంప్రదాయానికి చిహ్నాలుమీరు యువతరానికి అక్షరాస్యతను అందించడమే కాకుండాదేశం కోసం జీవించడం కూడా నేర్పుతున్నారుమీరు మీ సమయాన్ని వెచ్చిస్తున్న బిడ్డ ఒక రోజు ఈ దేశానికి సేవ చేయగలడనే ఆలోచన మీ మనసులో ఉంటుందిఅంకితభావంతో మీరు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

బలమైన దేశానికిసాధికారత కలిగిన సమాజానికి ఉపాధ్యాయులే పునాదికాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలుపాఠ్యప్రణాళికను స్వీకరించాల్సిన ప్రాముఖ్యాన్ని ఉపాధ్యాయులు అర్థం చేసుకుంటారువారు పాత పద్ధతుల నుంచి విముక్తి పొందాలని కోరుకుంటారుదేశం కోసం అమలు చేస్తున్న సంస్కరణల్లో కూడా ఇదే స్ఫూర్తి ప్రతిబింబిస్తుందిఇప్పుడే ధర్మేంద్ర జీ ప్రస్తావించిన ఈ విషయాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నానుసంస్కరణలు నిరంతరం కొనసాగాలిఅవి ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉండాలి.. దీర్ఘకాలిక దృష్టి కూడా ఉండాలిఅవి అర్థం చేసుకునేవిగాఅంగీకరించేవిగాభవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలిఈ విషయంలో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ఉందిసకాలంలో సంస్కరణలు చేపట్టకపోతే భారత్ నేటి ప్రపంచంలో చేరుకోవాల్సిన స్థానాన్ని చేరుకోలేదన్నది మా నమ్మిక.

మిత్రులారా,

భారత్ స్వయం-సమృద్ధి సాధించడం కోసం తదుపరి తరం సంస్కరణలు తప్పనిసరని ఆగస్టు 15న ఎర్రకోట నుంచి నేను చెప్పానుదీపావళిఛఠ్ పూజకు ముందే పండుగలను రెట్టింపు ఆనందంతో నిర్వహించుకుంటామని నేను దేశ ప్రజలకు హామీ ఇచ్చానుఇప్పుడు మీరంతా రెండు రోజులుగా ఇక్కడే తీరిక లేకుండా ఉన్నారుబహుశా మీకు వార్తాపత్రికలను చూసేందుకుటెలివిజన్ చూసేందుకు అవకాశం లభించి ఉండకపోవచ్చుఇంట్లో ఎవరైనా మీతో, “ఓయ్మీ ఫోటో పేపర్లో వచ్చింది!” అని చెప్పి ఉండవచ్చుఏది ఏమైనప్పటికీ మనం ముందుకు సాగుతున్న స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నిన్న భారత ప్రభుత్వం చాలా పెద్ద నిర్ణయం తీసుకుందిఇది చాలా ముఖ్యమైన నిర్ణయంజీఎస్టీ ఇప్పుడు మరింత సరళంగాసులభంగా మారిందిఇప్పుడు జీఎస్టీలో రెండు ప్రధాన స్లాబులు మాత్రమే ఉన్నాయిఅవి శాతం, 18 శాతంసెప్టెంబర్ 22.. సోమవారం.. నవరాత్రి మొదటి రోజునవరాత్రి మాతృత్వపు శక్తితో లోతుగా ముడిపడి ఉందిసంస్కరించిన జీఎస్టీ విధానం.. ఈ తదుపరి తరం సంస్కరణ ఈ పవిత్రమైన రోజునుంచే అమలులోకి వస్తుందినవరాత్రి నుంచే దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు అవసరమైన వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయిఈ సంవత్సరం ధంతేరాస్ పండుగ సందడి కూడా ఎక్కువగానే ఉంటుందిఎందుకంటే డజన్ల కొద్దీ వస్తువులపై పన్నులు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి.

మిత్రులారా,

ఎనిమిదేళ్ల కిందట జీఎస్టీ అమలులోకి వచ్చినప్పుడు దశాబ్దాల నాటి కల నెరవేరిందిఇది మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రారంభమైన విషయం కాదుఅంతకు చాలాకాలం ముందు నుంచే దీని గురించి చర్చలు జరుగుతున్నాయిసమస్య ఏమిటంటే.. కేవలం చర్చలు మాత్రమే ఉన్నాయిచర్యలు లేవుస్వతంత్ర భారతదేశంలో జీఎస్టీ అతిపెద్ద ఆర్థిక సంస్కరణల్లో ఒకటిఆ సమయంలో దేశం బహుళ పన్నుల వల నుంచి విముక్తి పొందిందిఇదే ఒక పెద్ద విజయంఇప్పుడు 21వ శతాబ్దంలో భారత్ పురోగమిస్తున్న కొద్దీ.. జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణల అవసరం ఏర్పడింది.. అది సాకారమైందిమీడియాలోని కొంతమంది మిత్రులు దీనిని జీఎస్టీ 2.0 అంటున్నారువాస్తవానికి ఇది దేశం కోసం మద్దతువృద్ధి... డబుల్ డోస్డబుల్ డోస్ అంటే ఒక వైపు సాధారణ కుటుంబాలకు పొదుపు.. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపుఈ కొత్త జీఎస్టీ సంస్కరణలతో దేశంలోని ప్రతి కుటుంబం ఎంతో ప్రయోజనం పొందుతుందిపేదలునవ-మధ్యతరగతిమధ్యతరగతిరైతులుమహిళలువిద్యార్థులుయువత సహా ప్రతి ఒక్కరూ పన్ను తగ్గింపు నుంచి ప్రయోజనం పొందుతారుపనీర్ నుంచి షాంపూసబ్బుల వరకు ప్రతిదీ ఇప్పుడు మునుపటి కంటే చౌకగా లభిస్తాయిఇది మీ నెలవారీ ఇంటి ఖర్చులువంటగది ఖర్చులను బాగా తగ్గిస్తుందిస్కూటర్లుకార్లపై కూడా పన్నులు తగ్గించాంఇది ముఖ్యంగా తమ కెరీర్‌లను ప్రారంభించే యువతకు సహాయపడుతుందిజీఎస్టీ తగ్గించడం ద్వారా ఇంటి బడ్జెట్‌ నిర్వహణనుజీవనశైలినీ మెరుగుపరచడం కూడా సులభం అవుతుంది.

మిత్రులారా,

నిన్న తీసుకున్న నిర్ణయం నిజంగా సంతోషకరమైనదిజీఎస్టీకి ముందు పన్ను రేట్లను గుర్తుచేసుకుంటేనే దాని నిజమైన ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చుకొన్నిసార్లు పరిస్థితులు ఎంత మారిపోయాయో మనకు తెలియదుఉదాహరణకుమీ కుటుంబంలో ఒక పిల్లవాడు 70 మార్కులు సాధించిఆపై 71, 72, 75కి మెరుగుపడితే ఎవరూ పెద్దగా పట్టించుకోరుకానీ అదే పిల్లవాడు 99 మార్కులు సాధిస్తే అకస్మాత్తుగా అందరూ గమనిస్తారుఅదే నేను చెప్పాలనుకుంటున్నది.

మిత్రులారా,

2014కి ముందు గత ప్రభుత్వ హాయాంలో దాదాపు ప్రతి వస్తువుపై భారీగా పన్నుల భారం ఉండేదిగృహోపకరణాలువ్యవసాయ సామాగ్రిమందులుజీవితబీమా ఇలా అన్నింటిపైనా ధరల బాదుడు ఉండేదికాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై ప్రత్యేక పన్నులు విధించిందిఆ వ్యవస్థ కొనసాగి ఉంటే.. నేటికీ మనం 2014 నాటి పన్ను విధానంలోనే ఉంటే.. ప్రతి 100 రూపాయల కొనుగోలు కోసం మీరు 20–25 రూపాయల పన్ను చెల్లించేవారుమీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించడంతో.. బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వం పొదుపును పెంచడం.. కుటుంబ ఖర్చులను తగ్గించడంపైనే దృష్టి సారించిందిఅందుకే ఇప్పుడు జీఎస్టీలో చాలా తగ్గింపులు జరిగాయినేను ఏ ప్రభుత్వాన్నీ విమర్శించడానికి ఇక్కడ లేను.. మీరు ఉపాధ్యాయులు కాబట్టి మీరు సులభంగా పోల్చి చూడగలరు.. మీరు మీ విద్యార్థులకు కూడా దీనిని గురించి వివరించవచ్చు.

మిత్రులారా,

కాంగ్రెస్ ప్రభుత్వం మీ నెలవారీ ఇంటి బడ్జెట్‌ను ఎలా పెంచిందో ఎవరూ మర్చిపోలేరుటూత్‌పేస్టుసబ్బుతలకు రాసుకునే నూనెలుఅన్నింటిపైనా 27 శాతం పన్ను వేశారుఈ రోజు మీకు గుర్తుండకపోవచ్చు.. కానీ మీరు దానికి చెల్లించేవారుప్లేట్లుకప్పులుస్పూన్లు వంటి రోజువారీ వస్తువులన్నింటికీ 18 నుంచి 28 శాతం వరకు పన్నులు ఉండేవిపళ్లపొడి మీద 17 శాతం పన్ను విధించారుకాంగ్రెస్ కాలంలో రోజువారీ ఉపయోగించే దాదాపు ప్రతి ముఖ్యమైన వస్తువుపై భారీగా పన్ను విధించారుఆఖరికిపిల్లలు తినే చాక్లెట్లపై కూడా కాంగ్రెస్ 21 శాతం పన్ను విధించిందిబహుశా మీరు అప్పట్లో వార్తాపత్రికల్లో గమనించి ఉండవచ్చు లేదా గమనించకపోవచ్చుమోదీ అలా చేసి ఉంటే.. ప్రజల ఆగ్రహం కట్టలుతెంచుకునేదిఈ దేశంలో కోట్లాది మందికి రోజువారీ అవసరమైన సైకిళ్లపై కూడా 17 శాతం పన్ను వారు విధించారులక్షలాది మంది తల్లులుసోదరీమణుల గౌరవం.. స్వయం ఉపాధికి మూలమైన కుట్టు యంత్రాలపైనా 16 శాతం పన్ను విధించారుమధ్యతరగతికి విశ్రాంతిప్రయాణం కూడా భారమయ్యాయికాంగ్రెస్ పాలనలో హోటల్ గదుల బుకింగ్‌పై 14 శాతం పన్ను విధించేవారుదానికి తోడు అనేక రాష్ట్రాలు లగ్జరీ పన్ను కూడా విధించాయిఇప్పుడు అటువంటి వస్తువులుసేవలపై కేవలం శాతం పన్ను మాత్రమేకొంతమంది విమర్శకులు "మోదీ ఇప్పటికీ శాతం వసూలు చేస్తున్నారుఅని రాస్తారుకానీ మార్పును మీరే గమనించండిఇక నుంచీ 7,500 రూపాయల ఖరీదు చేసే హోటల్ గదులపై కూడా శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తుందిమీరు సేవలందించే ప్రభుత్వాన్ని ఎంచుకున్నందునే ఇది సాధ్యమైంది.. అదే బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వం.

మిత్రులారా,

గతంలో మన దేశంలో వైద్యం చాలా ఖరీదనే ఫిర్యాదు ఉండేదిపేదలుమధ్యతరగతి వారికి సాధారణ పరీక్షలు కూడా అందుబాటులో లేవుకారణం కాంగ్రెస్ ప్రభుత్వం రోగనిర్ధారణ కిట్లపై 16 శాతం పన్ను విధించిందిమా ప్రభుత్వం అటువంటి వస్తువులపై పన్నును ఏకంగా శాతానికి తగ్గించింది.

మిత్రులారా,

కాంగ్రెస్ పాలనలో ఇల్లు కట్టుకోవడం చాలా ఖరీదైన వ్యవహారంఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం సిమెంటుపై 29 శాతం పన్ను విధించిందిఏదోవిధంగా ఇల్లు కట్టుకున్నా.. ఏసీటీవీఫ్యాన్ వంటి ప్రాథమిక గృహోపకరణాలు కొనడం చాలా ఖరీదైనదిఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి వస్తువులపై 31 శాతం పన్ను విధించింది. 31 శాతంఇప్పుడు మన ప్రభుత్వం అలాంటి వస్తువులపై పన్నును 18 శాతానికి తగ్గించింది.. అంటే దాదాపు సగానికి తగ్గించింది.

మిత్రులారా,

కాంగ్రెస్ పాలనలో రైతులూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 2014కి ముందు సాగు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటే.. లాభాలు చాలా తక్కువకారణం వ్యవసాయ పరికరాలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా పన్నులు విధించిందిట్రాక్టర్లునీటిపారుదల పరికరాలుచేతి పనిముట్లుపంపుసెట్ల వంటి వస్తువులపై 12 నుంచి 14 శాతం వరకు పన్ను వేశారుఇప్పుడు అలాంటి అనేక వస్తువులపై జీఎస్టీ సున్నామరికొన్ని వ్యవసాయ సంబంధిత వస్తువులపై పన్ను కేవలం నేడు అయిదు శాతం మాత్రమే.

మిత్రులారా,

'వికసిత్ భారత్మరో మూలస్తంభం 'యువ శక్తి'. మన యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.. చిరు వ్యాపారుల ఇబ్బందులు తొలగిపోయాయిఅత్యధికంగా సిబ్బందిని నియమించుకునే రంగాలు తక్కువ జీఎస్టీ రేట్ల ద్వారా భారీ ఉపశమనం పొందుతున్నాయివస్త్రాలుహస్తకళలుతోలు వంటి రంగాల్లోని కార్మికులువ్యాపార యజమానులూ బాగా ప్రయోజనం పొందారుదీంతో పాటు దుస్తులుపాదరక్షల ధరలు కూడా గణనీయంగా తగ్గనున్నాయిమన అంకురసంస్థలుఎమ్ఎస్ఎమ్ఈలుచిరు వ్యాపారుల కోసం పన్నులు తగ్గడమే కాకుండా.. కొన్ని విధానాలు కూడా సరళంగా మారాయిఇది వారి వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతుంది.

మిత్రులారా,

యువతకు మరొక రంగంలో కూడా లాభం కలుగుతుందిఅది ఫిట్నెస్ రంగంజిమ్‌లుసెలూన్లుయోగా వంటి సేవలపై పన్నుల్ని తగ్గించారుఅంటే మన యువత ఆరోగ్యంగా ఉండటమే కాకుండా విజయాలు సాధిస్తారుప్రభుత్వం మీ ఆరోగ్యానికి ఇంత చేస్తున్న సందర్భంలోనేను పదే పదే చెప్పే ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా.  మీరు రోజూ సుమారు 200 మందిని కలుస్తారు కాబట్టిదయచేసి నా సందేశాన్ని వాళ్లకు చేరవేయండి.  ఊబకాయం మన దేశానికి ఒక పెద్ద సమస్యఅందుకే నేను చెబుతున్నాతక్షణం మీ నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించండిమహమ్మద్‌జీమీరు దీని కోసం నా రాయబారిగా మారండిఊబకాయంపై పోరాటం ఎప్పటికీ బలహీనపడకూడదు.

మిత్రులారా,

జీఎస్టీలో చేసిన సంస్కరణలను సంక్షిప్తంగా చెప్పాలంటేఅవి భారత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థకు అయిదు ఆభరణాలను జోడించాయని నేను చెప్పగలనుమొదటిదిపన్ను వ్యవస్థ చాలా సరళంగా మారిందిరెండోది భారత ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయిమూడోది... వినియోగంఅభివృద్ధిరెండింటికీ మరింత ప్రోత్సాహంనాలుగోదివ్యాపారం సులభతరం కావడం వల్ల  పెట్టుబడులు పెరుగుతాయిఉద్యోగాలు పెరుగుతాయిఅయిదుసహకార సమాఖ్య విధానం అంటే రాష్ట్రాలుకేంద్రం మధ్య భాగస్వామ్యం. “వికసిత భారత్” కోసం మరింత బలపడుతుంది.

మిత్రులారా,

ప్రజలు దైవంతో సమానం అన్నది మన మంత్రంఈ సంవత్సరం జీఎస్టీని మాత్రమే కాకుండా ఆదాయపు పన్నును కూడా గణనీయంగా తగ్గించారు. 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఇప్పుడు పూర్తిగా పన్ను రహితంఇందువల్ల ఇప్పుడు మీరు మీ ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్దాఖలు చేస్తున్నప్పుడు మరింత ఆనందం లభిస్తోంది కదాఅంటే ఆదాయంలోనూఖర్చులోనూ పొదుపుఇది “డబుల్  బొనాంజా” కాక మరేం అవుతుంది!

మిత్రులారా,

ఈ మధ్య ద్రవ్యోల్బణం రేటు కూడా చాలా తక్కువ స్థాయిలోఅదుపులో ఉందిదీనినే ప్రజానుకూల పాలన అని మనం అంటాంప్రజా ప్రయోజనాల కోసందేశ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నప్పుడు  దేశం ముందుకు సాగుతుందిఅందుకే ఈ రోజు భారతదేశ వృద్ధి దాదాపు శాతంగా ఉందిమనం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాం.  ఇది 140 కోట్లమంది భారతీయుల బలం. 140 కోట్లమంది భారతీయుల సంకల్పంనా దేశ ప్రజలకు నేను మళ్ళీ చెబుతున్నాదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ గా మార్చేందుకు సంస్కరణల  ప్రయాణం కొనసాగుతూనే ఉంటుందిఅదిఎంతమాత్రం ఆగదు

మిత్రులారా,

స్వావలంబన... భారతదేశానికి కేవలం ఒక నినాదం కాదుఈ దిశగా స్థిరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయిమీరందరూదేశంలోని ఉపాధ్యాయులందరూ 'ఆత్మనిర్భర్ భారత్గురించిన ఆలోచనా బీజాలను ప్రతి విద్యార్థిలోనూ నాటాలనిదాని ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని నేను ఆశిస్తున్నాభారతదేశానికి స్వావలంబన ఎందుకు అంత ముఖ్యమో పిల్లలకు వారి సొంత సులభమైన భాషలోమాండలికంలో మీరే వివరించగలరువారు మిమ్మల్ని నమ్ముతారుఇతరులపై ఆధారపడే ఒక దేశంతన నిజమైన సామర్థ్యానికి తగ్గట్టుగా అంత వేగంగా ఎప్పటికీ అభివృద్ధి చెందలేదని మీరు వారికి చెప్పవచ్చు.

మిత్రులారా,

ఈ రోజు విద్యార్థులలోనూరాబోయే తరాలలోనూ ఒక ప్రశ్నను నిరంతరం ప్రోత్సహించాలిప్రజల్లోకి తీసుకుపోవాలిఅది మన కర్తవ్యంఈ ప్రశ్న పాఠశాల అసెంబ్లీలో కూడా చర్చకు రావాలని కోరుకుంటున్నాఅప్పుడప్పుడుఈ ప్రయోగాన్ని చేసి చూడండిమీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎన్ని విదేశీ వస్తువులు వచ్చి చేరాయో మీరు గుర్తించలేరుమీరు కావాలని విదేశీ వస్తువులను కొనుగోలు చేయకపోయినాఅవి తెలియకుండానే మీ ఇంటిలో ఉంటాయిపిల్లలువారి కుటుంబాలతో కలిసి కూర్చునిఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు... ఉపయోగించిన అన్ని వస్తువుల జాబితాను తయారు చేయాలిఒక హెయిర్ పిన్ కూడా విదేశీదేఒక దువ్వెన కూడా విదేశీదే అని తెలిసినప్పుడు వారు ఆశ్చర్యపోతారుపిల్లలకు అది అర్థం కాదుఒకసారి అవగాహన వచ్చిన తర్వాతఆ పిల్లవాడు "అయ్యోదీనివల్ల నా దేశానికి ఏం లాభం?"  అంటాడుఅందుకేమీరు ఈ మొత్తం కొత్త తరానికి స్ఫూర్తినివ్వగలరని నేను నమ్ముతున్నామహాత్మాగాంధీ ఒకప్పుడు మన కోసం వదిలిపెట్టిన పనిని పూర్తి చేసే భాగ్యం నేడు మనకు లభించిందిమనమంతా దాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నేను కోరుకుంటున్నాపిల్లలను ప్రోత్సహిస్తూ నేను వారికి ఎప్పుడూ ఇలా ఆలోచించమని చెబుతాను. ’’నా దేశానికి చెందిన ఒక్క అవసరాన్ని అయినా నేను ఎలా తీర్చగలనుఒకవేళ ఏదైనా నా దేశంలో అందుబాటులో లేకపోతేనేను దాన్ని తయారు చేస్తానుఅందుకోసం నేను ప్రయత్నిస్తానునేను దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను’’ అన్న ఆలోచనను వారికి ఇవ్వండి.

ఒక్కసారి ఊహించండిమన దేశం నేటికీ లక్ష కోట్ల రూపాయల విలువైన వంట నూనెను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందివంట నూనెమనది వ్యవసాయ ఆధారిత దేశంఇది మన జీవనశైలిఅవసరాలు లేదా పరిస్థితులు కావచ్చుఇలాంటివి చాలా ఉన్నాయికానీ దేశం ఈ విషయంలో స్వావలంబన సాధించాలిఇప్పుడులక్ష కోట్ల రూపాయలు బయటికి వెళ్లిపోతున్నాయిఆ డబ్బు ఇక్కడే ఉంటేఎన్ని పాఠశాలలు వచ్చేవి ఎంతమంది పిల్లల జీవితాలు మెరుగయ్యేవిఅందుకే మనం ఆత్మనిర్భర్ భారత్‌ను మన జీవన మంత్రంగా చేసుకోవాలిదీని కోసం మనం కొత్త తరానికి స్ఫూర్తినివ్వాలి.  దేశ అవసరాలతో మనల్ని మనం అనుసంధానం చేసుకోవాలిఇది చాలా ముఖ్యంమనం ఉన్న చోటు నుంచి మనం వెళ్లగలిగిన చోటుకు తీసుకెళ్లేది దేశమేమనకు ఎంతో ఇచ్చేది దేశమేకాబట్టి మనం ఎల్లప్పుడూ ఇలా ఆలోచించాలి మనం దేశానికి ఏమి ఇవ్వగలందేశం అవసరాలలో వేటిని మనం తీర్చగలంఇది ప్రతి విద్యార్థిప్రతి కొత్త తరం వారి ఆలోచనల్లో ఉండాలి.

మిత్రులారా,

దేశంలోని విద్యార్థులలో నేడు నూతన ఆవిష్కరణలుసైన్స్సాంకేతికత పట్ల ఒక కొత్త అభిరుచి మేల్కొందిచంద్రయాన్ విజయం దీనిలో చాలా పెద్ద పాత్ర పోషించిందిచంద్రయాన్ దేశంలోని ప్రతి బిడ్డలోనూ శాస్త్రవేత్త కావాలనిఆవిష్కరణలు చేయాలని కలలు కనేలా స్ఫూర్తినిచ్చిందిఈ మధ్య మనం చూశాంఅంతరిక్ష యానం నుంచి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తాను చదువుకున్న పాఠశాలకు వెళ్ళినప్పుడుఅక్కడి వాతావరణమంతా పూర్తిగా మారిపోయిందిశుభాంశు సాధించిన విజయం వెనుక కచ్చితంగా అతని ఉపాధ్యాయుల పాత్ర ఉందిలేకపోతే అది సాధ్యమయ్యేది కాదుదీని ద్వారా ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాదువారు యువతను తీర్చిదిద్దుతారనివారికి సరైన మార్గాన్ని చూపిస్తారని తెలుస్తుంది.

మిత్రులారా,

మీ ప్రయత్నాలకు ఇప్పుడు అటల్ ఇన్నోవేషన్ మిషన్అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కూడా తోడవుతున్నాయిఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటయ్యాయిమరో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని కూడా  దేశం నిర్ణయించుకుందివీటి  పనులు వేగంగా సాగుతున్నాయిమీలాంటి ఉపాధ్యాయుల కృషి ద్వారా  ఈ ల్యాబ్‌లలో భారతదేశ యువతకు ఆవిష్కరణలు చేసే అవకాశాలను ఇవ్వడం సాద్యమే

మిత్రులారా,

మా ప్రభుత్వం ఒకవైపు ఆవిష్కరణలపైనయువతను డిజిటల్‌గా శక్తిమంతం చేయడంపైన దృష్టి పెడుతోందిమరోవైపుమనం మన కొత్త తరాన్నిమన పాఠశాల విద్యార్థులనుమన విద్యార్థులను,  ఇంట్లోని మన పిల్లలను డిజిటల్ ప్రపంచ ప్రతికూల ప్రభావాల నుంచి కూడా రక్షించుకోవాలిదీనితోపాటు వారి ఆరోగ్యంఉత్పాదక సామర్ధ్యంపై దృష్టి పెట్టడం కూడా మనందరి సమష్టి బాధ్యతఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడుఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన ఒక చట్టాన్ని ఆమోదించడం గురించి మీకు తెలుసుఉపాధ్యాయులు దీని గురించి తెలుసుకోవాలిఇది గేమింగ్,  జూదం గురించిదురదృష్టవశాత్తుఆటగా మొదలయ్యేది తరచుగా జూదంగా మారుతోందిఅందుకే ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుందిదేశంలో ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే చట్టం రాకూడదని కోరుకునే బలమైన శక్తులు ఉన్నాయికానీ నేడు మన దేశానికితన పిల్లల ఉజ్వల భవిష్యత్తుపై శ్రద్ధ వహించే రాజకీయ సంకల్పం ఉన్న ప్రభుత్వం ఉందిఅందుకేఎలాంటి ఒత్తిడికి లొంగకుండావిమర్శల గురించి పట్టించుకోకుండాఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించి ఒక చట్టాన్ని మేం తీసుకు వచ్చాంమన విద్యార్థులను ప్రభావితం చేస్తున్న అలాంటి ఆన్‌లైన్ గేమ్‌లు చాలా ఉన్నాయిఇది డబ్బుతో  ముడిపడి ఉందిమరింత సంపాదించాలనే ఉద్దేశంతో ప్రజలు ఇందులో పెట్టుబడి పెడుతున్నారుకుటుంబాలలో మహిళలతో సహా మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ పగటిపూట కుటుంబ సభ్యులు పనికి వెళ్ళిన తర్వాత ఈ ఆటలు ఆడుతున్నట్లు నాకు కొన్ని నివేదికలు అందాయిఅలాగే కొన్ని ఆత్మహత్య కేసులు కూడా నమోదయ్యాయిప్రజలు అప్పుల పాలయ్యారుకుటుంబాలు నాశనం అవుతున్నాయిఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయిఒక వ్యసనంలాఈ సమస్య మాదకద్రవ్యాల సమస్యను  మించిపోయిందిఈ ఆటలు ఆకర్షణీయమైన కంటెంట్‌తో మిమ్మల్ని ఉచ్చులోకి లాగుతాయిఎవరైనా సులభంగా చిక్కుకుపోవచ్చుఇది కుటుంబాలకు ఆందోళన కలిగించే అంశంఅందుకే నేను చెబుతున్నాచట్టం తెచ్చినప్పటికీపిల్లల్లో అవగాహన కల్పించడం ముఖ్యంతల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు.. కానీ ఇంట్లో అది ఉద్రిక్తతకు దారితీసే వాతావరణాన్ని సృష్టిస్తుంది కాబట్టి వారు పరిస్థితిని మార్చలేరుఅయితే ఉపాధ్యాయులు మాత్రం ఈ విషయంలో చాలా పెద్ద పాత్ర పోషించగలరుమేం చట్టాన్ని ఆమోదించాంఇంకా మొదటిసారిగాఅలాంటి హానికరమైన కంటెంట్ పిల్లలకు చేరకుండా చూసుకున్నాంమీ ఉపాధ్యాయులు అందరూ దీని గురించి మీ విద్యార్థులలో అవగాహన పెంచాలని నేను కోరుతున్నాకానీ ఇక్కడ రెండు అంశాలుగేమింగ్ స్వతహాగా చెడ్డది కాదుజూదం చెడ్డదిడబ్బు ప్రమేయం లేనప్పుడుఅది వేరే విషయంమీకు తెలుసుఒలింపిక్స్ కూడా కొన్ని రకాల గేమింగ్‌లను ఒక క్రీడగా గుర్తించాయిఅది ప్రతిభనునైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంరాణించిన వారికి శిక్షణ ఇవ్వడం గురించిఅది పూర్తిగా వేరే  విషయంకానీ అది వ్యసనంగా మారినప్పుడుపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నపుడుఅది దేశానికి తీవ్రమైన ఆందోళన కలిగించే పరిస్థితి.

మిత్రులారా,

మన యువత గేమింగ్ రంగంలో ప్రపంచ స్థాయిలో తమ ఉనికిని విస్తరించుకునేందుకు మా ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తోందిభారత్ లో కూడాసృజనాత్మక కార్యకలాపాల్లో నిమగ్నమైన వారు మన కథలుఇతివృత్తాలుసంప్రదాయాల ద్వారా కొత్త గేమ్‌లను ఎంతో అభివృద్ధి చేయవచ్చుమనం అంతర్జాతీయ గేమింగ్ మార్కెట్‌ను ఆకర్షించవచ్చుభారతదేశంలో కూడా చాలా ప్రాచీన ఆటలుగొప్ప సాంస్కృతిక ఇతివృత్తాలు ఉన్నాయిఅవి ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తాయినిజానికివాటిలో కొన్ని ఇప్పటికే అలా చేస్తున్నాయిఇంకా మనం చాలా ఎక్కువ సాధించగలంఈ రంగంలో అనేక అంకుర సంస్థలు అసాధారణమైన కృషి చేస్తున్నాయిపాఠశాలలు,  కళాశాలలు కూడా విద్యార్థులకు ఈ అవకాశాల గురించి సమాచారాన్ని అందిస్తేఅది వారికి మంచి కెరీర్ అవకాశాలను అందించగలదని నాకు నమ్మకం ఉంది.

మిత్రులారా,

మీలో చాలామంది అడిగిన ఒక అంశాన్ని నేను ఎర్రకోట నుంచి ప్రస్తావించానుస్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత (వోకల్ ఫర్ లోకల్ఇవ్వాలనిస్వదేశీ ఉత్పత్తులను స్వీకరించాలని నేను బలంగా పిలుపునిచ్చానుస్వదేశీ అంటే మన దేశంలో ఉత్పత్తి అయినవిఇక్కడే తయారైనవిమన దేశప్రజల శ్రమతో కూడినవిమన మట్టి సువాసన కలిగిన వస్తువులుఅదే నాకు స్వదేశీదాని గురించి మనం గర్వపడాలిమనం "హర్ ఘర్ తిరంగాఅని అంటున్నట్లే, "హర్ ఘర్ స్వదేశీ"  అని కూడా ప్రతి ఇంట్లోనూ ఒక బోర్డు పెట్టమని పిల్లలకు చెప్పాలిప్రతి దుకాణదారుడు కూడా గర్వంగా, 'ఇది స్వదేశీఅని చెప్పే ఒక బోర్డును పెట్టాలి. 'ఇది నా దేశానికి చెందిందిఇది నా దేశంలో తయారైందిఅని చెప్పడంలో మనం గర్వపడాలిమనం అలాంటి వాతావరణాన్ని సృష్టించాలి. 'వోకల్ ఫర్ లోకల్ప్రచారంలో ఉపాధ్యాయులు చాలా పెద్ద పాత్ర పోషించగలరు

పాఠశాలల్లో ప్రాజెక్టులుకార్యకలాపాల ద్వారా "మేక్ ఇన్ ఇండియాఉత్పత్తులను గుర్తించడం పిల్లలకు నేర్పవచ్చుమీరు దీన్ని సరదాగా నేర్పవచ్చుఉదాహరణకుఒక అసైన్‌మెంట్‌గాపిల్లల చేత వారి ఇంట్లో ఎన్ని వస్తువులు స్వదేశీవో ఒక జాబితాను తయారు చేయవచ్చునేను ఇంతకుముందు చెప్పినట్లుగావారు దాన్ని మరుసటి రోజు తరగతిలో సమర్పించవచ్చుఆ తర్వాత కుటుంబాలు ఈ నెలలో స్వదేశీ కాని వస్తువులను ఇంతవరకు తగ్గిస్తాం... వచ్చే నెలలో అంతవరకు తగ్గిస్తాం అని నిర్ణయించుకోవచ్చుఅలా క్రమంగామొత్తం కుటుంబం స్వదేశీ వస్తువుల వైపు మళ్లుతుందిఒక పాఠశాలలో పది తరగతులు ఉంటేఒక్కో తరగతి  విద్యార్థులు వంతుల వారీగా గ్రామంలో ఉదయం పూట స్వదేశీని ప్రోత్సహిస్తూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించవచ్చని కూడా నేను సూచిస్తానుఒకరోజు 1వ తరగతిమరుసటి రోజు 2వ తరగతిమూడో రోజు 3వ తరగతిఇలా వంతుల వారీగా చేయవచ్చుఈ విధంగాస్వదేశీస్వదేశీస్వదేశీ అనే వాతావరణం గ్రామంలో నిరంతరం సజీవంగా ఉంటుందిఇది దేశ ఆర్థిక శక్తిని చాలా బలోపేతం చేస్తుందని నేను నమ్ముతున్నానుప్రతి వ్యక్తి కొద్దిగా సహకరించినామనం ఊహించిన కలఅంటే 2047 నాటికి దేశాన్ని 'వికసిత భారత్గా మార్చడం సాధ్యమవుతుందిమరి చెప్పండిదేశం అభివృద్ధి చెందాలని ఎవరు కోరుకోరుప్రతి ఒక్కరూ కోరుకుంటారుకానీ దాని కోసంమనం ఎక్కడో ఒక చోట ప్రారంభించాలిఆ దిశగా మనం కృషి చేయాలి.

మిత్రులారా,

పాఠశాలల్లో మనం వివిధ రకాల పండుగలుకార్యక్రమాలను నిర్వహించుకుంటాంఈ వేడుకల్లోకి మనం స్వదేశీ సందేశాన్ని కూడా తీసుకురావచ్చుభారతీయ ఉత్పత్తులను అలంకరణకు ఎలా ఉపయోగించవచ్చోలేదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తరగతులలో స్వదేశీ వస్తువులను ఎలా వాడవచ్చో మనం చూడాలిఇటువంటి పద్ధతులు చిన్నతనం నుంచే పిల్లలలో స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించే వాతావరణాన్ని సృష్టిస్తాయి.

మిత్రులారా,

పాఠశాలల్లో మనం ఎన్నో ప్రత్యేక దినోత్సవాలను నిర్వహించుకుంటాం. అలాంటప్పుడుఒక "స్వదేశీ దినోత్సవం", "స్వదేశీ వారంలేదా "స్థానిక ఉత్పత్తుల దినోత్సవంఎందుకు జరుపుకోకూడదుమీలాంటి ఉపాధ్యాయులు దీనిని ఒక ఉద్యమంలా నడిపిస్తే మీరు సమాజానికి కొత్త గుర్తింపుదిశను అందించగలరుపిల్లలు తమ ఇళ్ల నుంచి ఒక స్థానిక వస్తువును తీసుకొచ్చిదాని కథనుఅది ఎక్కడ తయారైందిఎవరు తయారు చేశారుదేశానికి దాని ప్రాముఖ్యత ఏమిటో పంచుకునే వాతావరణాన్ని సృష్టించవచ్చుస్థానిక తయారీదారులనుచేతివృత్తుల వారినితరతరాలుగా హస్తకళలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను కూడా పిల్లలు కలవవచ్చుపాఠశాలలు అలాంటి వారిని విద్యార్థులతో మాట్లాడటానికీఅనుభవాలను పంచుకోవడానికి ఆహ్వానించవచ్చుపుట్టినరోజు వేడుకల సందర్భాలలో బహుమతులు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కూడా పిల్లలు'మేడ్ ఇన్ ఇండియా వస్తువులను ఇస్తూగర్వంగా “చూడుఇది మేడ్ ఇన్ ఇండియానేను ప్రత్యేకంగా నీ కోసం తీసుకువచ్చాను'”అని చెప్పేలా ప్రోత్సహించవచ్చుసంక్షిప్తంగా చెప్పాలంటేమనం 'మేడ్ ఇన్ ఇండియా'ను మన జీవితాలకు ఆధారంగా చేసుకోవాలిదీనిని మనం మన బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలిఅలా చేయడం ద్వారాదేశభక్తిఆత్మవిశ్వాసంశ్రమ గౌరవం వంటి విలువలు సహజంగానే మన సామాజిక జీవితంలో ఒక భాగంగా మారతాయిఇది మన యువతను తమ వ్యక్తిగత విజయాన్ని దేశ ప్రగతితో అనుసంధానం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. 'వికసిత భారత్సాధనకు ఇది అతి గొప్ప సూత్రం అని నా నమ్మకంమీరందరూఉపాధ్యాయులుగాఈ గొప్ప దేశ నిర్మాణ ఉద్యమంలో కర్తవ్యంలో భాగమవుతారని నేను నమ్ముతున్నానుఇంకా మీరు మన దేశాన్ని మరింత బలోపేతం చేసే ఈ బాధ్యతను భుజాలపై వేసుకున్నప్పుడుమనం ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా సాధిస్తాంఈ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం అందుకున్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక అభినందనలుఇంకా ఈ రోజుమీరు సాధారణంగా చేసే పనిని నేను చేశానుఅది నేను మీకు హోంవర్క్ ఇచ్చానుమీరు దాన్ని పూర్తి చేస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉందిచాలా ధన్యవాదాలు

 

***


(Release ID: 2164426) Visitor Counter : 4