బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అత్యుత్తమ బొగ్గు, లిగ్నైట్ గనులను సత్కరించే స్టార్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ముంబయిలో నిర్వహించిన బొగ్గు మంత్రిత్వ శాఖ


శ్రేష్ఠత కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ దార్శనికతకు

సహకరించాలని బొగ్గు రంగానికి సంబంధించిన భాగస్వాములను కోరిన బొగ్గు, గనుల శాఖ మంత్రి

బొగ్గు గనులున్న ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు,

జీవన నాణ్యతను మెరుగుపరచడానికి గనుల తవ్వకం ఉత్ప్రేరకంగా పనిచేయాలి: కిషన్ రెడ్డి

ఉత్పత్తి సామర్థ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా గనులను మూసివేయటం,

సమాజ సంక్షేమానికి బాధ్యతాయుతంగా గనుల తవ్వకం సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: సతీష్ చంద్ర దూబే, సహాయ మంత్రి, బొగ్గు-గనుల శాఖ

బొగ్గు రంగంలో పారదర్శకత, సామర్థ్యాన్ని మెరుగుపరించేందుకు.. అందరికీ సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు కొత్తగా రూపొందించిన ఇంటరాక్టివ్ డ్యాష్‌బోర్డ్‌తో కూడిన సీసీఓ వెబ్‌సైట్ ఆవిష్కరణ

Posted On: 04 SEP 2025 5:07PM by PIB Hyderabad

భద్రతపర్యావరణ సుస్థిరతనిర్వహణ తీరులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బొగ్గులిగ్నైట్ గనులను గుర్తించేందుకు స్టార్ రేటింగ్ అవార్డు ప్రదానోత్సవాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ రోజు ముంబయిలో నిర్వహించిందికేంద్ర బొగ్గుగనుల మంత్రి శ్రీ జీకిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారుబొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబేబొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్‌లు సమక్షంలో ఆయన.. భద్రతపర్యావరణ పరిరక్షణశాస్త్రీయమైన గనుల తవ్వకంఉత్పాదకతసమాజ సంక్షేమం వంటి విభాగాల్లో రాణించిన గనులకు అవార్డులను అందించారుఈ సందర్భంగా ఇంటరాక్టీవ్‌ డ్యాష్‌బోర్డ్‌తో కూడిన కొత్త సీసీఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారుఈ రంగంలో పారదర్శకతసామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు.. సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు దీన్ని తీసుకొచ్చారు

భద్రతపర్యావరణపరమైన చర్యలుఉత్పాదకత విషయంలో అసాధారణ పనితీరును కనబరిచిన గనులను స్టార్ రేటింగ్ అవార్డుల ద్వారా బొగ్గు మంత్రిత్వ శాఖ గుర్తిస్తోందిఈ రంగంలో ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించాలన్న మంత్రిత్వ శాఖ నిబద్ధతను బలోపేతం చేస్తూ అధిక పనితీరు కనబరిచిన ఇతర గనులకు ధ్రువీకరణ పత్రాలనుఅవార్డులను కూడా అందించారుబొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జీ.కిషన్ రెడ్డి అత్యుత్తమ పనితీరు కనబరిచిన గనులకు ఫైవ్స్టార్ అవార్డులను ప్రదానం చేశారుభద్రతసుస్థిరత విషయంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ భారతదేశ ఇంధన భద్రతను నిర్ధారించడంలో ఇవి పోషిస్తోన్న పాత్రను ఆయన ప్రశంసించారుస్టార్ రేటింగ్ కార్యక్రమం కేవలం అవార్డులకు సంబంధించినది మాత్రమే కాదని.. బాధ్యతాయుతమైన గనుల తవ్వకానికి ఇవి ఒక ప్రమాణమనిఅన్ని గనులు ఫైవ్-స్టార్ హోదా కోసం కృషి చేయాలని ఆయన కోరారు

ఈ కార్యక్రమంలో కార్బన్ సంగ్రహణవినియోగంనిల్వ (సీసీయూఎస్), పరిశోధనఅభివృద్ధి‌పై నిర్వహించిన హ్యాకథాన్ ‌విజేతలకు కూడా అవార్డులను అందించారుఇది సుస్థిర సాంకేతిక పరిజ్ఞానాలలో ఆవిష్కరణలను పెంపొందించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ నిబద్ధతను తెలియజేస్తోందిరెండు ముఖ్యమైన విధివిధానాలను కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారుఇందులో మొదటిది లైవ్స్ (ఎల్..వీ..ఎస్కాగా.. రెండోది ఆర్థప్రపంచ స్థాయి ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా బాధ్యతాయుతమైనసుస్థిరమైన గనుల మూసివేతలకు ప్రామాణికంగా పనిచేసేందుకు రూపొందించిన అభ్యాసన గైడ్.. లైవ్స్గనులకు సంబంధించిన ప్రాంతాలను పునరుద్ధరించిన అనంతరం ఉత్పాదకపర్యావరణ అనుకూల ఆస్తులుగా మార్చే దిశగా పెట్టుబడులను రాబట్టే లక్ష్యంతో రూపొందించిన హరిత ఫైనాన్సింగ్ విధానం ఆర్థ

కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీకిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేశారుఅత్యున్నత భద్రతపర్యావరణ ప్రమాణాలకు కట్టుబడి.. నిర్వహణ తీరు మెరుగ్గా ఉండేలా చూసుకుంటూ అసాధారణ పనితీరు కనబరిచినందుకు అవార్డు గ్రహీతలందరినీ ఆయన అభినందించారుబొగ్గును గ్యాస్‌గా మార్చటాన్ని వేగవంతం చేయడంతో పాటు విలువను జోడించటంఉద్గారాలను తగ్గించటంకొత్త పారిశ్రామిక అవకాశాల ద్వారాలను తెరిచేందుకు స్వచ్ఛ బొగ్గు సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించాలని ప్రధానంగా పేర్కొన్నారుదిగుమతులపై ఆధారపడటం నుంచి బొగ్గు ఎగుమతుల కోసం సామర్థ్యాలను పెంపొందించే దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారుదీనితో పాటు వాషరీలను మెరుగ్గా ఉపయోగించటం ద్వారా బొగ్గు నాణ్యతను మెరుగుపరచాలని తెలిపారు

సమాజ కేంద్రీకృతప్రగతిశీల గనుల మూసివేత కార్యకలాపాలుపెద్ద ఎత్తున అడవుల పెంపకంకార్మికుల భద్రత సంక్షేమం… గనుల తవ్వకాలకు సంబంధించిన ప్రధాన అంశాల్లో ఆవిష్కరణలుపర్యావరణ బాధ్యతసుస్థిరతపోటీతత్వాన్ని పొందుపరిచే అంశానికి ఉన్న ప్రాముఖ్యతను కేంద్ర మంత్రి జీకిషన్ రెడ్డి ప్రధానంగా పేర్కొన్నారుఆవిష్కరణలను ఉపయోగించటం ద్వారా దేశ బొగ్గు రంగం వనరులను మెరుగ్గా వినియోగించుకుంటూ ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండగలదని అన్నారు. ‘సంస్కరణప్రదర్శనపరివర్తన’ అనేది కేవలం నినాదం కాదని.. ఇదొక విధి అని పేర్కొన్నారుభాగస్వాములంతా శ్రేష్ఠత కోసం నిరంతరం కృషి చేయాలని… ప్రధానమంత్రి ఆత్మనిర్భర్వికసిత్ భారత్ దార్శనికతకు క్రియాశీలకంగా సహకరించాలని కోరారు.

బొగ్గులిగ్నైట్ గనులకు 2023-24 సంవత్సరానికి సంబంధించిన ఈ స్టార్ రేటింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ... ఉత్పత్తి సామర్థ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణశాస్త్రీయపరమైన గనుల మూసివేతసమాజ సంక్షేమానికి గనుల తవ్వకం బాధ్యతాయుతంగా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానంగా చెప్పారుస్టార్ రేటింగ్ విధానం సామర్థ్యానికి సంబంధించిన ప్రామాణికతగానే కాకుండా భూమి పునరుద్ధరణజీవవైవిధ్య పరిరక్షణకార్మికుల భద్రతప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల సంక్షేమాన్ని నిర్ధారించడానికి కూడా ఒక ప్రమాణంగా పనిచేస్తుందని ప్రధానంగా చెప్పారుసామర్థ్యంభద్రతపర్యావరణ పరిరక్షణ‌ ప్రయోజనాలను దేశవ్యాప్తంగా సాకారం చేసుకునేలా ఉత్తమ పద్ధతులను అన్ని గనులలో అవలంభించే అంశానికి ఉన్న ప్రాముఖ్యతను ఆయన పునరుద్ఘాటించారుఅవార్డు గెలుచుకున్న గనుల కంపెనీలను ఆయన అభినందించారుబొగ్గు ఉన్న ప్రాంతాలలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికిఉపాధి అవకాశాలను సృష్టించేందుకుజీవన నాణ్యతను మెరుగుపరచడానికి గనుల తవ్వకం అనేది ఒక ఉత్ప్రేరకంగా పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు.

పనితీరుపారదర్శకత విషయంలో ప్రపంచ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా కొత్త ప్రమాణాలను నిర్దేశించినందుకు అవార్డు గెలుచుకున్న గనులను బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్ ప్రశంసించారుస్టార్ రేటింగ్ విధానం నిరంతరం మెరుగురుచుకునేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని.. ప్రతి గని చట్టపరమైన అంశాలను పాటించే స్థాయిని దాటి అన్ని రకాల కార్యకలాపాలలో శ్రేష్ఠతను తీసుకొచ్చేలా ప్రేరేపిస్తుందని ప్రధానంగా పేర్కొన్నారుగత సంవత్సరంలో భారత్ ఒక బిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తిసరఫరా చేసి చారిత్రాత్మక విజయాన్ని సాధించిందనదని.. ఇది ఈ రంగంలోని స్థిరమైన వృద్ధిధృడత్వాన్ని తెలియజేస్తోందని అన్నారుఇంధన భద్రతను పర్యావరణపరమైన చర్యలతో సమతుల్యం చేస్తూ నేటి గనుల తవ్వకం బాధ్యతాయుతంగాసుస్థిరతతోపోటీతత్వంతో ఉండాలని పేర్కొన్నారుప్రతి గని బాధ్యతాయుతమైన తవ్వకంతో మరింత ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేయాలని.. తద్వారా స్వావలంబన కలిగిన వికసిత్ భారత్‌ను నిర్మించేందుకు సహాయపడాలని అన్నారు

అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులుప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగ గనుల తవ్వకం కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వేడుకలో ప్రతిభసృజనాత్మకతదృఢ సంకల్పాన్ని తెలియజేస్తూ దివ్యాంగులైన పిల్లలు సాంస్కృతిక ప్రదర్శన చేశారుఈ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణను నిలిచిందిసమాజంలోని అందరి సామర్థ్యాలువిజయాలను వేడుక చేసుకోవటం.. అందరినీ కలుపుకొని వెళ్లటానికి ఉన్న ప్రాముఖ్యతను ఇది ప్రధానంగా తెలియజేసింది


(Release ID: 2164307) Visitor Counter : 2
Read this release in: English , Urdu , Hindi , Marathi