పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీ జూలో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా సంఘటన... ఈ వ్యాధిని కట్టడి చేయడానికి చర్య తీసుకున్న నేషనల్ జూలాజికల్ పార్క్

Posted On: 02 SEP 2025 9:19PM by PIB Hyderabad

ఢిల్లీ జూలోని జలాశ్రిత పక్షిశాలలోగానీవలస పక్షులకు ఉద్దేశించిన కొలనులోగానీ కొత్తగా ఏ ప్రాణీ చనిపోయిన ఆధారాలు లేవని నేషనల్ జూ పార్క్ (ఎన్‌జడ్‌పీడైరెక్టరు తెలిపారుఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఇదిజూలో పక్షులుపశువులతో పాటు జూలో విధులు నిర్వహించే సిబ్బందిని కూడా సురక్షితంగా ఉంచేందుకు పారిశుధ్యంజీవ సంరక్షక ప్రధాన చర్యలను క్రమం తప్పక అమలు చేస్తున్నారు.

పక్షుల గూళ్లను కనిపెట్టుకొని ఉండేచనిపోయిన పక్షులను తొలగించి తగిన చర్యలను తీసుకొనేక్రిమి సంహారక ప్రక్రియలను చేపట్టే విధులను నిర్వహించే జూ సిబ్బందికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీబృందం అవసరమైన పరీక్షలు పూర్తి చేసిందిఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా సంక్రమణ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు వ్యక్తిగత ఆరోగ్య రక్షణకు పాటించాల్సిన జాగ్రత్తలను కూడా విధుల్లో ఉన్న ఇంచార్జులకుసెక్షన్ సూపర్‌వైజర్లకు వివరించారు.

ఈ వ్యాధిని సాధ్యమైనంత త్వరగా కట్టడి చేయడానికి ప్రామాణిక మార్గదర్శక సూత్రాలను అనుసరించి అవసరమైన అన్ని చర్యలను నేషనల్ జూలాజికల్ పార్క్ తీసుకుంది.

 

***


(Release ID: 2163524) Visitor Counter : 2
Read this release in: English , Urdu , Hindi