జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ లోని రూర్కీ జిల్లాలో జబ్రేడా ప్రాంతంలో ఏడేళ్ల బాలుడిపై ఓ మసీదు ఇమాం లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తా కథనాలను సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ


రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో నివేదిక అందించాలని రూర్కీ డీఎం, పోలీసు సూరింటెండెంట్‌కు నోటీసులు

Posted On: 28 AUG 2025 2:32PM by PIB Hyderabad

2025 ఆగస్టు 20న ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లాలోజబ్రేడా ప్రాంతంలో ఓ మసీదులో ఏడేళ్ల బాలుడిపై ఇమాం లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తా కథనాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీసుమోటోగా స్వీకరించిందిబాధిత బాలుడు మసీదుకు చదువుకోవడానికి వెళ్లాడని కథనంలో పేర్కొన్నారు.

 

మీడియాలో వచ్చిన కథనాన్ని గమనించిన కమిషన్అదే నిజమని తేలితే బాధితుని మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశంగా దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందికాబట్టిఈ ఘటనపై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రూర్కీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్పోలీస్ సూపరిండెంట్‌కు నోటీసులు జారీ చేసింది.

 

ఆగస్టు 22న ప్రచురితమైన వార్తా కథనం ప్రకారం బాలుడిని నిందితుడు తన గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడుజరిగిన సంఘటన గురించి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడుఇంటికి చేరుకున్న తర్వాత బాలుడు ఈ సంఘటన గురించి కుటుంబానికి చెప్పాడు.

 

***


(Release ID: 2161536) Visitor Counter : 12
Read this release in: English , Urdu , Hindi , Tamil