కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
పెట్టుబడిదారులను చైతన్యపరచటానికి, క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేయటానికి హైదరాబాద్‌లో "నివేశక్ శిబిర్" నిర్వహించనున్న పెట్టుబడిదారుల విద్యా, పరిరక్షణ నిధి అథారిటీ (ఐఈపీఎఫ్ఏ)
నివేశక్ శిబిర్: క్లెయిమ్ చేయని డివిడెండ్, షేర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటానికి, ఆర్థిక అక్షరాస్యతను పెంచటానికి, పెట్టుబడిదారులకు నేరుగా సేవలను అందించటానికి రూపొందించిన ఒక ఏకైక పరిష్కార కార్యక్రమం
Posted On:
22 AUG 2025 7:12PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెట్టుబడిదారుల విద్యా, పరిరక్షణ నిధి అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)తో కలిసి హైదరాబాద్‌లో 'నివేశక్ శిబిర్'ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ శిబిరం ఆగస్టు 30, 2025న ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సికింద్రాబాద్‌లోని హర్యానా భవన్, 1-8-179, సరోజినీ దేవి రోడ్డు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సమీపంలో, జోగాని, రామ్‌గోపాల్‌పేట, హైదరాబాద్, తెలంగాణ-500003లో నిర్వహించనుంది.
ఈ ఏడాది ప్రారంభంలో పూణేలో విజయవంతంగా నిర్వహించిన ప్రయోగాత్మక సమావేశం తరువాత, పెట్టుబడిదారులను మరింత చైతన్యపరచడానికి, క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేయటానికి ఐఈపీఎఫ్‌ఏ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు విస్తరిస్తున్నది. క్లెయిమ్ చేయని డివిడెండ్ షేర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, ఆర్థిక అక్షరాస్యతను పెంచటానికి, పెట్టుబడిదారుల సేవలను నేరుగా అందించటానికి ఈ కార్యక్రమం ఏకైక పరిష్కారం కానుంది.
ఈ కార్యక్రమం కింద ఐఈపీఎఫ్ఏ ఈ క్రింది సేవలను అందిస్తుంది:
-
ఆరు నుంచి ఏడేళ్లుగా క్లెయిమ్ చేయని డివిడెండ్లను నేరుగా అందించటం.
-
అప్పటికప్పుడే కేవైసీ, నామినేషన్ అప్‌డేట్ చేయటం.
-
పెండింగ్‌లో ఉన్న ఐఈపీఎఫ్ఏ క్లెయిమ్ సమస్యలను పరిష్కరించటం.
పెట్టుబడిదారులు, కంపెనీలు, రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్ల (ఆర్టీఏలు) మధ్య ప్రత్యక్ష చర్చలను ప్రోత్సహించడం ద్వారా మధ్యవర్తులను తొలగించడానికి, పెట్టుబడిదారుల ఫిర్యాదులకు తక్షణ పరిష్కార యంత్రాంగాన్ని అందించటానికి 'నివేశక్ శిబిర్' రూపొందించారు. ఈ కార్యక్రమంలో క్లెయిమ్ చేయని డివిడెండ్ ఖాతాలు అధిక సంఖ్యలో ఉన్న వాటాదారుల కంపెనీలు ప్రత్యేక్షంగా పాల్గొంటాయి.
హైదరాబాద్‌లో జరిగే నివేశక్ శిబిర్, క్లెయిమ్ చేయని పెట్టుబడులు ఎక్కువగా ఉన్న నగరాల్లో నిర్వహిస్తున్న విస్తృత కార్యక్రమాల్లో భాగం. ఈ ప్రయత్నాలు పెట్టుబడిదారుల కోసం సురక్షితమైన, పారదర్శకమైన, పెట్టుబడిదారు కేంద్రంగా పనిచేసే ఆర్థిక వ్యవస్థను రూపొందించాలనే ఐఈపీఎఫ్‌ఏ నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.
ఐఈపీఎఫ్‌ఏ గురించి
పెట్టుబడిదారుల విద్యా, పరిరక్షణ నిధి అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) అనేది భారతదేశంలో విద్యా కార్యక్రమాలు, వ్యూహాత్మక సహకారాల ద్వారా పెట్టుబడిదారుల అవగాహన, పరిరక్షణను ప్రోత్సహించడానికి కృషి చేస్తోంది.
ఆసక్తిగల క్లెయిమ్ దారులు ఈ క్రింది లింక్ ద్వారా ఈ కార్యక్రమం కోసం నమోదు చేసుకోవచ్చు:
https://docs.google.com/forms/d/e/1FAIpQLScKRHhSxDZGAY55-PIL4-PSO1ymU-yMpNZw3b3rdNa5mdHtmw/viewform?usp=sharing&ouid=113654155076509084582
మరిన్ని వివరాలకు, ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించండి: www.iepf.gov.in
***
(Release ID: 2160349)