ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు గ్రంథ సాహెబ్ జీ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
24 AUG 2025 1:02PM by PIB Hyderabad
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ అందించిన కాలాతీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయన్నారు. ఈ బోధనలు మనకు కరుణ, వినయం, సేవకు సంబంధించిన విలువలను గుర్తు చేస్తాయని పేర్కొన్నారు. ఐక్యత, సామరస్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు మనవాళికి స్ఫూర్తిని అందిస్తున్నాయని అన్నారు.
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ చూపిన జ్ఞాన మార్గంలో ఎల్లప్పుడూ నడుస్తూ, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
“శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పవిత్ర పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ అందించిన కాలాతీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను ప్రకాశవంతం చేస్తూనే ఉంటాయి. కరుణ, వినయం, సేవకు సంబంధించిన విలువలను మనకు గుర్తు చేస్తుంటాయి. ఈ బోధనలు ఐక్యత, సామరస్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు మానవాళికి స్ఫూర్తిని అందిస్తాయి.
శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ చూపిన జ్ఞాన మార్గంలో మనం ఎల్లప్పుడూ నడుస్తూ, మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం. ”
***
(Release ID: 2160343)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam