ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ పై తాజా సమాచారం


ఎస్ సీడీ పరీక్షలకు దేశవ్యాప్తంగా 30 పాయింట్ కేర్ టెస్టులు,

5 నాన్-రాపిడ్ వైద్య పరీక్షలకు ఐసీఎంఆర్ ఆమోదం

జూలై 2025 నాటికి 17 గిరిజన రాష్ట్రాల్లో 6 కోట్లకు పైగా పరీక్షలు పూర్తి

సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్ వ్యయం రూ.100

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధుల సహాయంతో 14 రాష్ట్రాల్లో 15 ఎక్సలెన్స్ కేంద్రాలకు ఆమోదం

Posted On: 19 AUG 2025 3:04PM by PIB Hyderabad

జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ (ఎన్ఎస్ సీఏఈఎంకింద సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణకు దేశవ్యాప్తంగా జిల్లా ఆస్పత్రుల నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఏఏఎంస్థాయి వరకు అన్ని ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తారుఇప్పటి వరకు మొత్తం 30 పాయింట్ కేర్ టెస్టులు (పీఓసీటీ), 5 నాన్ రాపిడ్ వైద్య పరీక్షల (ఆర్ డీటీకేంద్రాలకు ఐసీఎంఆర్ నుంచి ఆమోదం లభించిందిరాష్ట్రాల్లో ఆయా పరీక్షలను ఇప్పటికే నిర్వహిస్తున్నారు.

31.07.2025 వరకు 17 గిరిజన ప్రాధాన్య రాష్ట్రాల్లో 6,07,30,111 పరీక్షలు నిర్వహించారుసికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్ కి రూ.100 ప్రామాణిక వ్యయంగా నిర్ణయించారుఇందులో స్క్రీనింగ్ ఖర్చురికార్డుల నమోదుసంబంధిత ఖర్చులుంటాయి.

ఎస్ సీడీతో బాధపడుతున్న రోగుల ఆరోగ్య స్థితి మెరుగుపడేందుకు ఏఏఎం-ఉప ఆరోగ్య కేంద్రాలు (ఎస్ హెచ్ సీ), ఏఏఎంప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీ హెచ్ సీద్వారా ఈ కింది సేవలు/సౌకర్యాలు అందిస్తారు:

  • వ్యాధిగ్రస్తులను తరచూ పరీక్షిస్తారు.

  • జీవనశైలిని మెరుగుపరచుకునేందుకువివాహానికి ముందుగర్భధారణకు ముందు తీసుకునే నిర్ణయాలపై సలహాలు అందిస్తారు.

  • ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీతో పోషకాహార మద్దతును అందించడం.

  • యోగాఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం.

  • వ్యాధి లక్షణాల నిర్ధారణమెరుగైన సౌకర్యాలున్న ఆసుపత్రులకు పంపించడం.

వ్యాధి అవగాహనకౌన్సెలింగ్ సమాచారాన్ని రూపొందించి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు అందిస్తుందిప్రతి నెలా నిర్వహించే ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరాల ద్వారాఎస్ సీడీతో సహా వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు.

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓటీఏనిధులు సమకూరుస్తున్న ఎస్ సీడీకి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈలను ఏర్పాటు వ్యయానికి సంబంధించి ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసిందిఇప్పటివరకుఎంఓటీఏ ద్వారా 14 రాష్ట్రాల్లో 15 సీఓఈలు ఆమోదం పొందాయి.

ఆరోగ్య పరిశోధనా విభాగం కిందఐసీఎంఆర్-జాతీయ గిరిజన ఆరోగ్య పరిశోధనా సంస్థ (ఎన్ఐఆర్ టీహెచ్), జబల్ పుర్మధ్యప్రదేశ్.. హిమోగ్లోబినోపతిస్ నియంత్రణకు పరిశోధనా కేంద్రాన్ని మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో ఏర్పాటు చేశారుఈ కేంద్రాలు సికిల్ సెల్ వ్యాధితో సహా జాతీయ కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయి.

కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ రాజ్యసభలో రాతపూర్వకంగా ఈ సమాధానం ఇచ్చారు.

 

***


(Release ID: 2158129)
Read this release in: English , Urdu , Hindi