ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్థిక సమ్మిళిత్వమే ప్రభుత్వానికి కీలక ప్రాధాన్యత... ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలతో సహా పౌరులందరికీ


వివిధ పథకాల ద్వారా సురక్షిత బీమా, ఆరోగ్య భద్రత అందజేత

2.7 లక్షల పంచాయతీలు, యుఎల్‌బీలకు చేరిన ఆర్థిక సమ్మిళిత పరిపూర్ణ ప్రచారం

పీఎంజేజేబీవై, పీఎంఎస్ బీవై పథకాల పూర్తి సమాచారాన్ని అందించే డిజిటల్ వేదిక... జన్ సురక్షా పోర్టల్

Posted On: 18 AUG 2025 5:04PM by PIB Hyderabad

భారత బీమా కంపెనీలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతున్నట్లు 2025 ఫిబ్రవరి 1నాటి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు.

పేదలు, వెనుకబడిన వర్గాల కోసం అందరికీ అందుబాటులో ఉండే సామాజిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం ఈ కింది బీమా పథకాలను ప్రారంభించింది.

1. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై): 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి, బీమా తీసుకున్న వారు ఏ కారణంతోనైనా మరణిస్తే రూ.436 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల బీమా కవరేజీని అందిస్తుంది.

2. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎమ్‌ఎస్‌బీవై): 18నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సున్న వ్యక్తులు ప్రమాదవశాత్తు మరణించినా లేకపోతే శాశ్వత వైకల్యం పొందినా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. అదే విధంగా ప్రమాదం కారణంగా పాక్షిక వైకల్యానికి గురైతే రూ. 1 లక్ష బీమా అందిస్తుంది. కేవలం రూ. 20 ప్రీమియంతోనే ఈ బీమా కవరేజీని అందిస్తోంది.

3. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై): ద్వితీయ, తృతీయ సంరక్షణ ఆసుపత్రుల్లో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల ఆరోగ్య భద్రతను అందిస్తుంది.

4. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎమ్‌ఎఫ్‌బీవై): అనుకోని ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుంచి రైతులకు రక్షణ కల్పిస్తుంది. ఈ పథకం కింద రైతులు ఖరీఫ్‌కు 2 శాతం, రబీకి 1.5 శాతం..వాణిజ్య/ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో సహా దేశంలోని అర్హత కలిగిన పౌరులందరికీ వర్తిస్తాయి.


పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై కింద కవరేజ్‌, పాలసీల వ్యాప్తిని పెంచేందుకు బ్యాంకులు, స్థానిక పరిపాలన భాగస్వామ్యంతో కింది స్థాయి నుంచి నిరంతరం ప్రచారాలు చేయడంతో సహా అనేక చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు 2025 జూలై 1 నుంచి 2 లక్షల 70 వేల గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు కలిసి ఆర్థిక సమ్మిళిత పరిపూర్ణ ప్రచారం నిర్వహిస్తున్నారు. పౌరులకు బీమా పథకాలపై పూర్తి సమాచారం, వివరాలు, నమోదు ప్రక్రియను అందించేందుకే జన్‌ సురక్ష పోర్టల్‌ను (www.jansuraksha.gov.in) ఏర్పాటు చేశారు.

బ్యాంకింగ్ సేవల డెలివరీ వ్యవస్థలో చివరి మైలు కనెక్షన్‌ను సూచించే దాదాపు 16 లక్షల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్ల బలమైన నెట్‌వర్క్.. పైన పేర్కొన్న పథకాల కింద అర్హతగల పౌరులందరినీ చేర్చేందుకు అమలులో ఉంది. అంతేకాకుండా ఈ పథకాల కవరేజీని పెంచడానికి అన్ని బ్యాంకులు లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని క్రమం తప్పకుండా వాటిపై సమీక్షలు నిర్వహిస్తుంటాయి. సమష్టిగా చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ అర్హత కలిగిన ప్రతి పౌరుడిని, ముఖ్యంగా బలహీన వర్గాల వారిని ఈ పథకాల పరిధిలోకి తీసుకు రావాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.


ఈ సమాచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈరోజు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.

 

***


(Release ID: 2157760) Visitor Counter : 4