గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

లక్నో మెట్రో రైల్‌ ప్రాజెక్టు కింద రూ.5,801 కోట్లతో 12 స్టేషన్లు గల 11.165 కి.మీ. ‘ఫేజ్‌-1బి’ పనులకు మంత్రిమండలి ఆమోదం

Posted On: 12 AUG 2025 3:32PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ న్యూఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మెట్రో రైల్‌ ప్రాజెక్టు ఫేజ్-1బి’ పనులకు ఆమోదం తెలిపిందిఇది 11.165 మీటర్ల పొడవైన మార్గం కాగాఇందులో 7 భూగర్భ, 5 ఎలివేటెడ్- మొత్తం 12 స్టేషన్లు ఉంటాయిఇది పూర్తయితేలక్నో నగరంలో 34 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్‌వర్క్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది.

వృద్ధికి ఊతం సహా పలు ప్రయోజనాలు:

ఫేజ్-1బి’ పనులు లక్నో నగర మెట్రో రైలు నెట్‌వర్క్ కీలక విస్తరణలో భాగం కావడంతో నగరమంతటా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గణనీయ పురోగమనానికి ప్రతీకగా నిలుస్తాయి.

అనుసంధానంలో మెరుగుదల:

ఈ పనులతో సుమారు 11.165 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాలు అందుబాటులోకి వస్తాయిదీంతో లక్నో నగరంలోని అత్యంత పురాతనఅధిక జనసాంద్రతచౌకైన ప్రజా రవాణా కొరతగల ప్రాంతాలకు సంధాన సౌలభ్యం గణనీయంగా మెరుగుపడుతుంది.

ఈ దశ పాత లక్నోలోని కీలక మండలాలను సజావుగా అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుందివీటిలో ఇవి ఉన్నాయి:

పాత లక్నోలోని కీలక ప్రదేశాలను సజావుగా అనుసంధానించడం ఫేజ్-1బి’ ప్రధాన లక్ష్యంఇది పూర్తయితే కింది ప్రాంతాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి:

·         అమీనాబాద్యాహియాగంజ్పాండేగంజ్చౌక్ వంటి వాణిజ్య కేంద్రాలు.

·         ముఖ్యంగా కింగ్ జార్జ్ వైద్య విశ్వవిద్యాలయం (వైద్య కళాశాల ఆస్పత్రి) వంటి ప్రాణాంతక వ్యాధులఅత్యవసర చికిత్స కేంద్రాలు.

·         బడా ఇమాంబచోటా ఇమాంబభూల్ భులయ్యాక్లాక్ టవర్రూమీ దర్వాజా వగైరా ప్రధాన పర్యాటక ఆకర్షక ప్రదేశాలు

·         నగరంలో పాక ప్రావీణ్యం చాటేసుసంపన్న-చారిత్రక ఆహార సంస్కృతికి ప్రతీకలైన ప్రదేశాలు

ఈ కీలక ప్రాంతాలను మెట్రో నెట్‌వర్క్‌తో జోడించే ‘ఫేజ్-1బి’తో అనుసంధానం మరింత మెరుగవుతుందిదాంతోపాటు ఆర్థిక కార్యకలాపాలకు ఉత్తేజంపర్యాటక రంగానికి ప్రేరణ లభిస్తాయిస్థానిక ప్రజలకుసందర్శకులకు పట్టణ రవాణా సౌలభ్యం ఇనుమడిస్తుంది.

వాహన రద్దీ తగ్గుదల: రోడ్డు రవాణాతో పోలిస్తే మెట్రో రైల్‌ నెట్‌వర్క్‌ సహజంగానే చౌకైన ప్రత్యామ్నాయంఈ నేపథ్యంలో ‘ఫేజ్‌-1బి’ ద్వారా లక్నో నగరంలో మెట్రో రైలు నెట్‌వర్క్‌ పొడిగింపుతో రహదారులపై వాహన రద్దీ గ్గుతుందని అంచనాముఖ్యంగా అమిత రద్దీగా కనిపించే పాత లక్నో మార్గాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందిదీనివల్ల వాహన రాకపోకలు సజావుగా సాగిప్రయాణ సమయం కలిసిరావడమేగాక రహదారి భద్రతకూ భరోసా లభిస్తుంది.

పర్యావరణ ప్రయోజనాలు: లక్నో నగరంలో ఫేజ్-1బి’ మెట్రో రైలు ప్రాజెక్ట్ అదనంగా అందుబాటులోకి వస్తే పర్యావరణానికీ మేలు కలుగుతుందిఈ మేరకు సంప్రదాయ శిలాజ ఇంధన ఆధారిత రవాణాతో పోలిస్తే కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి.

ఆర్థిక వృద్ధి: ప్రయాణ సమయం తగ్గుదలతోపాటు నగర పరిధిలోని విమానాశ్రయంరైల్వే స్టేషన్లుస్సు డిపోల వంటి వివిధ ప్రాంతాలకు రవాణా సౌలభ్యం మెరుగుపడుతుందిఉద్యోగులుకార్మికులు తమ కార్యాలయాలకుపని ప్రదేశాలకు స్వల్ప వ్యయంతో సకాలంలో చేరుకోగలరు కాబట్టి ఉత్పాదకత కూడా ఇనుమడిస్తుందిఅనుసంధానం మెరుగుదల వల్ల స్థానిక వ్యాపారాలకు... ముఖ్యంగా కొత్త మెట్రో స్టేషన్ల సామీప్య ప్రాంతాల్లో ఊపు లభిస్తుందిఅలాగే లోగడ సౌలభ్య లోపంగల ప్రాంతాల్లో పెట్టుబడులకుప్రగతికి అవకాశం ఉంటుంది.

సామాజిక ప్రభావం: లక్నోలో ఫేజ్-1బి’ మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ వల్ల ప్రజా రవాణా  ప్రజలందరికీ సమానంగా అందుబాటులోకి వస్తుందితద్వారా విభిన్న సామాజిక-ఆర్థిక వర్గాలకు ప్రయోజనం కలుగుతుందిరవాణా సౌలభ్యంలో అసమానతలు తగ్గిప్రయాణ సమయం ఆదా కావడం ద్వారా నిత్యావసర సేవల లభ్యత మెరుగుపడి జనజీవన నాణ్యత ఇనుమడిస్తుంది.

లక్నో మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-1బి’ నగర పరిణామాత్మక ప్రగతికి ఇతోధికంగా తోడ్పడుతుందిఅనుసంధానం పెరుగుదలవాహన రద్దీ తగ్గుదలపర్యావరణ ప్రయోజనాలుఆర్థిక వృద్ధిజనజీవన నాణ్యత మెరుగుదల వగైరాలకు భరోసా ఇస్తుందిపట్టణ ప్రాంతాల్లో కీలక సమస్యలకు పరిష్కారం చూపడంభవిష్యత్‌ విస్తరణకు పునాది వేయడం ద్వారా నగర పురోగమనంసుస్థిరత సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది.


***


(Release ID: 2155603)