సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఎన్ఎంఎం ద్వారా రాతప్రతుల డిజిటలీకరణ
Posted On:
04 AUG 2025 5:08PM by PIB Hyderabad
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జ్ఞాన భారతం మిషన్ అనే ప్రధాన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. విద్యాసంస్థలు, మ్యూజియంలు, గ్రంథాలయాలు, ప్రైవేటు సేకరణలో ఉన్న కోటికి పైగా రాతప్రతులను సర్వే, డాక్యుమెంట్, పరిరక్షణ, డిజిటలీకరణ చేసి అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యం.
పురాతన భారతీయ తాళపత్ర వారసత్వాన్ని పరిరక్షించేందుకు విద్యాసంస్థలు, మ్యూజియంలు, గ్రంథాలయాలు, ప్రైవేటు సేకరణలో ఉన్న కోటికి పైగా రాతప్రతులను సర్వే, డాక్యుమెంటేషన్ చేసి, పరిరక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది.
డిజిటలీకరణ చేయడమే జ్ఞాన భారతం మిషన్ ముఖ్యోద్దేశం. ‘‘డిజిటలైజేషన్: రాతప్రతులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చేలా జాతీయ డిజిటల్ భాండాగారాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున డిజిటైజేషన్ చేపట్టడం’’ను ఈ మిషన్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా చేర్చారు. వచ్చే అయిదేళ్ల కాలంలో ఒక కోటి పురాతన రాత ప్రతులను డిజిటలైజ్ చేయాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సమాచారాన్ని లిఖిత పూర్వకంగా అందించారు.
***
(Release ID: 2152347)