రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత సైన్యం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ 26వ వార్షికోత్సవం

Posted On: 26 JUL 2025 3:05PM by PIB Hyderabad

దేశ వ్యాప్తంగా అందరూ 26వ కార్గిల్ విజయ్ దివస్ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారుకార్గిల్ యుద్ధంలో సైనికుల శౌర్యంఅత్యున్నత త్యాగాలను గౌరవిస్తూ భారత సైన్యం దేశవ్యాప్త భాగస్వామ్యంతో సగర్వంగా కార్గిల్ విజయ దివస్ వేడుకలను నిర్వహించిందిరెండు రోజుల పాటు ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద జరిగిన ప్రధాన కార్యక్రమానికి కార్మిక ఉపాధియువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయరక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తాఆర్మీ స్టాఫ్ చీఫ్ (సీఓఏఎస్జనరల్ ఉపేంద్ర ద్వివేది హాజరయ్యారుసైనిక దళాల సీనియర్లుపౌర ప్రముఖులు ఈ సందర్భంగా నివాళులు అర్పించారుఅమరవీరుల జ్ఞాపకార్థం 545 దీపాలను వెలిగించారువీర నారులుప్రాణ త్యాగం చేసిన చేసిన వారి బంధువులను సత్కరించారుభారత్నేపాల్ వ్యాప్తంగా ఉన్న 545 మంది అమరవీరుల కుటుంబాలను సైన్యం కలిసిందిఇండస్ వ్యూపాయింట్-శ్రద్ధాంజలి పోర్టల్క్యూఆర్ ఆధారిత ఆడియో గేట్‌వే వంటి సాంస్కృతిక ప్రాజెక్టులను సీఓఏఎస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారుఆధునికీకరణస్వావలంబన దిశగా మొబిలిటీనిఘాఆయుధ శక్తిలో అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ప్రదర్శన నిర్వహించారుఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలుమతపరమైన ప్రార్థనలుచర్చాపూర్వక కార్యక్రమాలు దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులతో ఉన్న లోతైన భావోద్వేగ సంబంధాన్ని తెలియజేశాయి

25 జూలై 2025 - యుద్ధ జ్ఞాపకాలుశౌర్య సంధ్య

ద్రాస్‌లోని లామోచెన్ వ్యూపాయింట్‌లో యుద్ధ వివరాలను గుర్తు చేసుకోవటంతో కార్యక్రమం ప్రారంభమైందికార్గిల్ వివాదం జరిగిన అదే పర్వత శిఖరాలను చూస్తూ మాజీ సైనికులుప్రస్తుతం విధుల్లో ఉన్న వారు తమ అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారుత్యాగంధైర్యంమనోధైర్యానికి సంబంధించిన కథకు జీవం పోస్తూ ఉత్తేజకరమైన దృశ్య శ్రవణ ప్రదర్శనను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు

ఆ తర్వాత రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ సమక్షంలో గౌరవ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కార్గిల్ యుద్ధ వీరుల బంధువులను సత్కరించారుఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వారి అచంచల ధైర్యసాహసాలుత్యాగాలను గుర్తు చేశారుఐక్యతకృతజ్ఞతా భావాన్ని తెలియజేసేలా విజయ్ భోజ్ అనే స్మారక సంయుక్త భోజనం కార్యక్రమంలో ప్రముఖులంతా పాల్గొన్నారుసైనికులుఎన్‌సీసీ కేడెట్లుఆర్మీ గుడ్‌విల్ పాఠశాలల విద్యార్థుల ఉత్సాహభరితమైన ప్రాంతీయ సాంస్కృతిక ప్రదర్శనల్లో దేశభక్తిని ప్రదర్శించారుకార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ… స్వార్మ్ డ్రోన్‌లురవాణా డ్రోన్‌లుఎఫ్‌పీవీ డ్రోన్‌లు వంటి వాటితో సాంకేతిక ప్రదర్శనలు జరిగాయిఎత్తైన భూబాగాల్లో అత్యాధునిక సాంకేతిక ఆయుధాలనుపరిష్కారాలను ఉపయోగిస్తూ సైన్యం సంసిద్ధంగా ఉండటాన్ని ఇది తెలియజేసింది

సాయంత్రం కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరులైన వారికి హృదయపూర్వక నివాళిగా 'శౌర్య సంధ్యకార్యక్రమం జరిగిందిసంగీతంతో వీరత్వ గాథలను తెలియజేస్తూ ఆర్మీ బ్యాండ్ చేపట్టిన 'గౌరవ గాథప్రదర్శనతో ఈ కార్యక్రమం ప్రారంభమైందిజాతి ఐక్యతను ప్రతిబింబిస్తూ అన్ని ప్రధాన మత విశ్వాసాలకు చెందిన ఐదుగురు గురువులు.. అమరవీరుల కోసం ప్రార్థనలు చేశారుఆపరేషన్ విజయ్‌లో తన ప్రాణాలను అర్పించిన సైనికులను సూచించేలా మొత్తం 545 దీపాలను వెలిగించారు.

ప్రాణాలు త్యాగం చేసిన తొమ్మిది మంది వీరుల దగ్గరి బంధువులను తూర్పు కమాండ్ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ ఇన్ ఛీప్లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ సత్కరించారుఇది ఈ సాయంత్రానికి అత్యంత కృతజ్ఞతాపూర్వక క్షణంగా నిలిచిందిపౌరసైనిక ప్రముఖులు.. వీర నారులువీర మాతలుస్థానిక ప్రజలు సహా 400 మందికి పైగా విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

2025 జూలై 26 - కార్గిల్ విజయ్ దివస్

కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలను సమర్పించటంతో ప్రధాన కార్యక్రమం ప్రారంభమైందిగౌరవ కార్మిక ఉపాధియువజన వ్యవహారాల క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ.. గౌరవ రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్.. గౌరవ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా.. సీఓఏఎస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మొదట అమరులకు నివాళులు అర్పించారుఅనంతరం సీనియర్ సైనిక అధికారులుశౌర్య అవార్డు గ్రహీతలువీర నారులుయుద్ధంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారుభావోద్వేగాలను రేకెత్తిస్తూజ్ఞాపకాలను గుర్తు చేస్తూ "లాస్ట్ పోస్ట్ధ్వని లోయ అంతటా ప్రతిధ్వనించింది.

సీఓఏఎస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలకోవన్యాసం చేశారుకార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారువారి అచంచల ధైర్యాన్ని త్యాగాన్ని కొనియాడారు. 1999లో భారత సైన్యం సాధించిన చరిత్రాత్మక విజయంఇటీవలి ఆపరేషన్ సిందూర్ సందర్భంగా దేశ సార్వభౌమత్వాన్ని ధృడంగా కాపాడిన తీరును ఆయన గుర్తు చేశారుభారత్ శాంతిని కోరుకుంటుందనిఅయితే రెచ్చగొట్టే చర్యలకు నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని ప్రధానంగా చెబుతూ.. ప్రజలకు ఎలాంటి హాని కలిగించకుండా ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై సైన్యం ఖచ్చితత్వంతో విజయవంతంగా దాడి చేసిందని అన్నారు. 'రుద్రఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్‌లు, 'భైరవ్తేలికపాటి కమాండో బెటాలియన్లు, 'శక్తిబాన్శతఘ్ని రెజిమెంట్లు, 'దివ్యాస్త్రబ్యాటరీలుడ్రోన్లతో ఉన్న పదాతిదళ బెటాలియన్లుస్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శక్తిగా సైన్యం రూపాంతరం చెందడాన్ని సీఓఏఎస్ వివరించారుజాతి నిర్మాణంలో ముఖ్యంగా సరిహద్దు మౌలిక సదుపాయాలుపర్యాటకంఆర్థిక వ్యవస్థమాజీ సైనికుల సంక్షేమంలో సైన్యం పోషిస్తోన్న పాత్రను ఆయన ప్రశంసించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను తయారు చేయటంలో సైనికుల పాత్ర ఎప్పటికీ ఉంటుందని అన్నారునిజాయితీఅంకితభావంతో దేశానికి సేవ చేయాలని యువతకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారుదేశ ఐక్యతసార్వభౌమాధికారంగౌరవాన్ని కాపాడటానికి దృఢమైన నిబద్ధతతో ఉన్నట్లు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు

సీఓఏఎస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించిన ప్రాజెక్టులు:

సింధు వ్యూ పాయింట్బటాలిక్ సెక్టార్‌లో ఇది ఉందిపాకిస్తాన్ ఆక్రమిత బాల్టిస్తాన్‌లోకి ప్రవేశించే సింధు నదిని ఇక్కడి నుంచి చూడొచ్చుఇది యుద్ధ ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది

-శ్రధాంజలి పోర్టల్కార్గిల్ అమరవీరులకు ప్రజలు వర్చువల్‌గా నివాళులు అర్పించడానికి ఉద్దేశించిన వె‌బ్‌సైట్ ఇదిఇది దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుంది.

క్యూఆర్ ఆధారిత ఆడియో గేట్‌వేయుద్ధ స్మారకం వద్ద ఉన్న దీనితో డిజిటల్ పరికరాలను ఉపయోగించి చారిత్రక వివరాలను కథన రూపంలో తెలియజేసే సౌకర్యం

సీఓఏఎస్’ ప్రశంసా కార్డులనుఅర్హులయిన వారికి ప్రదానం చేశారుసైనికులువీరు నారులుఅమరవీరుల కుటుంబాలతో సంభాషించారువారి సంక్షేమం పట్ల సైన్యానికి ఉన్న నిరంతర నిబద్ధతను మరోసారి వ్యక్తం చేశారు

వారసత్వాన్ని కొనసాగించటం:

ఈ సంవత్సరం అనేక కీలక కార్యక్రమాలను చేపట్టారు

అమరుల కుటుంబాలను చేరుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం: 27 రాష్ట్రాలురెండు కేంద్రపాలిత ప్రాంతాలునేపాల్‌లోని 545 మంది అమరవీరుల బంధువులను 37 భారత ఆర్మీ బృందాలు సందర్శించాయిఇది వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చిందివారిలో గర్వాన్ని నింపింది

చరిత్రలో ఈ రోజుఆన్‌దిస్‌డేకార్యక్రమంయువతలో అవగాహనను వ్యాప్తి చేయడానికి డిజిటల్ వేదికల ద్వారా కథలు చెప్పే కార్యక్రమంతో కార్గిల్ యుద్ధాన్ని కళ్ల ముందు ఉంచారు

సాంస్కృతికసాహాస కార్యక్రమాలుకార్గిల్ద్రాస్బటాలిక్ ప్రాంతాల్లో నిర్వహించారుస్థానికులువిద్యార్థులుమాజీ సైనికులుప్రజలు ఉత్సహంగా పాల్గొన్నారు

సామర్థ్య ప్రదర్శనసాంకేతికత ఆధారిత పరివర్తన 

ఆధునికీకరణకార్యాచరణ సంసిద్ధతతో పాటు ముఖ్యంగా ఎత్తయిన ప్రాంతాల్లో యుద్ధానికి సంబంధించిన సామర్థ్య ప్రదర్శన కార్యక్రమాన్ని భారత సైన్యం నిర్వహించింది. “సాంకేతిక సౌలభ్యంగ్రహించుఆవిష్కరించుఏకీకృతం’’

అనే ఇతివృత్తం కింద జరిగిన ఈ ప్రదర్శన చలనశీలతనిఘాఆయుధ సామర్థ్యంపదాతిదళ వ్యవస్థలలో పురోగతిని ప్రధానంగా తెలియజేసింది

ద్రాస్ ‌పర్వత శిఖరాల వెనుక సూర్యుడు అస్తమిస్తుండగా దేశ గౌరవాన్నిత్యాగానికి చిహ్నంగా కార్గిల్ యుద్ధ స్మారకం.. త్రివర్ణ పతాక రంగుల్లో ప్రకాశించింది. 26వ కార్గిల్ విజయ్ దివాస్ కేవలం చరిత్రకు సంబంధించినది మాత్రమే కాదుసైనికులు ఎప్పటికి దేశ ఆత్మలో శాశ్వతంగా ఉంటారని తెలియజేయటమే.

గొప్ప దేశం తన వీరులను స్మారకాల్లో మాత్రమే కాకుండా పొందుపరుస్తుంది”

‘‘కృతజ్ఞతాపూర్వక దేశం… తన వీరుల్ని కేవలం శిలారూపంలోనే కాదుజ్ఞాపకాల్లో భద్రం చేసుకుంటుంది’’

 

***


(Release ID: 2148933)