ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ మంచి ఆరోగ్యంతో ఉండాలంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 22 JUL 2025 12:30PM by PIB Hyderabad

శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ మంచి ఆరోగ్యంతో ఉండాలంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మన దేశ ప్రజలకు సేవ చేయడానికి దేశ ఉపరాష్ట్రపతి పదవి సహా, వివిధ పదవుల రూపంలో అనేక అవకాశాలను శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌ గారు అందుకున్నారని శ్రీ మోదీ అన్నారు.  

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ:

‘‘మన దేశ ప్రజలకు సేవ చేయడానికి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ గారికి భారత్ ఉపరాష్ట్రపతి పదవి సహా వివిధ  పదవుల రూపంలో అనేక అవకాశాలు లభించాయి. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2146752) సందర్శకుల సూచీ సంఖ్య : : 19