రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆత్మనిర్భర్ భారత్: తొలి మేక్-ఇన్-ఇండియా కృత్రిమపాదం


ఖర్చు తక్కువ... అధునాతన కార్బన్ ఫైబర్ వినియోగం
సంయుక్తంగా ఆవిష్కరించిన డీఆర్డీఓ, బీబీనగర్ ఎయిమ్స్

Posted On: 15 JUL 2025 12:40PM by PIB Hyderabad

డీఆర్డీఓకి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్  డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డీఆర్డీఎల్)బీబీనగర్‌ఎయిమ్స్ సంస్థలు దేశీయ పరిజ్ఞానంతో కృత్రిమ పాదాన్ని తయారు చేశాయికార్బన్ ఫైబర్ మెటీరియల్ తో కృత్రిమ కాలును అభివృద్ధి చేసిన తొలి మేక్-ఇన్-ఇండియా ఉత్పత్తి ఇదే. చౌక ధరకే అందుబాటులో ఉండే ఈ అధునాతన కార్బన్ ఫైబర్ కృత్రిమ కాలును జూలై 14న తెలంగాణ- బీబీనగర్‌ లోని ఎయిమ్స్ ప్రాంగణంలో ఆవిష్కరించారుఎయిమ్స్ బీబీనగర్ డీఆర్డీఎల్డీఆర్డీఓ దేశీయంగా అభివృద్ధి చేసిన ఆప్టిమైజ్డ్ కార్బన్ ఫుట్ ప్రొస్థెసిస్ (ఏడీఐడీఓసిను...ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా సాధించిన విజయంగా- డీఆర్డీఎల్ విశిష్ట శాస్త్రవేత్తడైరెక్టర్ డాక్టర్ జీఏ శ్రీనివాసమూర్తిబీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంథమ్ శాంతా సింగ్ సంయుక్తంగా పరిచయం చేశారు.

125 కిలోల వరకూ బరువును సురక్షితంగా మోసే సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఏడీఐడీఓసీపై బయోమెకానికల్‌ తరహా పరీక్షలు నిర్వహించారువివిధ బరువుల్లో…రోగులకు అనుగుణంగా ఇది మూడు శ్రేణుల్లో అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉన్న అంతర్జాతీయ నమూనాలతో సరితూగే పనితీరుతక్కువ ఖర్చుఅధిక సంఖ్యాక జనాభాకు అందుబాటులోఉత్తమ నాణ్యతతో కూడిన ఉత్పత్తిని అందించాలనే లక్ష్యంతో ఈ కృత్రిమ పాదాన్ని తయారు చేశారు.

దిగుమతి చేసుకుంటున్న ఈ తరహా ఉత్పత్తుల ధర సుమారు రూలక్షలు వరకు ఉండగానూతన ఉత్పత్తి తయారీకి రూ20,000 మాత్రమే ఖర్చు అవుతుండడంతోఅవసరమైన వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయిదాంతోమన దేశంలోని అల్పాదాయ వర్గాల వికలాంగులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తిని సులభంగా అందించవచ్చు. అదే సమయంలో దిగుమతులపై ఆధారపడటం తగ్గడం సహాదివ్యాంగుల మెరుగైన ఆర్ధికసామాజిక సమ్మిళితానికి అవకాశం ఏర్పడుతుంది.

 

***


(Release ID: 2145111) Visitor Counter : 4