రైల్వే మంత్రిత్వ శాఖ
ఏఐ/ఎంఎల్ ఆధారిత తనిఖీ వ్యవస్థ ద్వారా రైలు భద్రతను మెరుగుపరిచేందుకు
అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ రైల్వేలు, డీఎఫ్‌సీసీఐఎల్
రైలు భదత్రను మెరుగుపరిచేందుకు, మానవ తనిఖీని తగ్గించడానికి, సేవాపరమైన అంతరాయాలను నివారించేందుకు మెషిన్ విజన్ బేస్డ్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ (ఎంవీఐఎస్)
Posted On:
10 JUL 2025 7:08PM by PIB Hyderabad
సేవా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రైళ్ల నిర్వహణను యాంత్రీకరించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అవలంబించే దిశగా వేసిన ముఖ్యమైన అడుగులో భాగంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్)తో భారతీయ రైల్వే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రైళ్ల పనితీరును పర్యవేక్షించడానికి మెషిన్ విజన్ బేస్డ్ ఇన్స్ఫెక్షన్ సిస్టమ్ (ఎంవీఐఎస్)ను ఏర్పాటు చేస్తారు.
ఆధునిక, ఏఐ/ఎంఎల్ ఆధారిత సాంకేతిక పరిష్కారమే ఎంవీఐఎస్. ఇది కదులుతున్న రైళ్ల గేర్ వ్యవస్థను అధిక రిజల్యూషన్ చిత్రాలుగా సంగ్రహిస్తుంది. వేలాడుతున్న, వదులుగా ఉన్న లేదా ఊడిపోయిన భాగాలను ఈ కొత్త వ్యవస్థ వెంటనే గుర్తిస్తుంది. అనంతరం ప్రతిస్పందన, నివారణ చర్యలను సులభతరం చేయడానికి తక్షణమే హెచ్చరికను జారీ చేస్తుంది.
రైల్వే బోర్డు (ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్) డైరెక్టర్ శ్రీ సుమిత్ కుమార్, డీఎఫ్‌సీసీఐఎల్ (మెకానికల్) జీజీఎం శ్రీ జవహర్ లాల్ మధ్య న్యూఢిల్లోని రైల్వే భవన్లో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. సభ్యుడు (ట్రాక్షన్ అండ్ రోలింగ్ స్టాక్) శ్రీ బీఎం అగర్వాల్, డీఎఫ్‌సీసీఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్, రైల్వే బోర్డు, డీఎఫ్‌సీసీఐఎల్ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ అవగాహనా ఒప్పందం ద్వారా నాలుగు ఎంవీఐఎస్ యూనిట్ల సమీకరణ, సరఫరా, ఏర్పాటు, పరీక్ష, కార్యకలాపాల ప్రారంభానికి డీఎఫ్‌సీసీఐఎల్ బాధ్యత వహిస్తుంది. భారతీయ రైల్వేల్లో ఇదే మొదటి విప్లవాత్మక వ్యవస్థ. ఈ సాంకేతికత రైళ్ల కార్యాకలాపాల భద్రతను పెంపొందించి, మానవ తనిఖీ ప్రయత్నాలను తగ్గించడానికి, ప్రమాదాలు/సేవల్లో అంతరాయాలను నివారించడానికి సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు.
రైల్వేల్లో ఆధునికమైన, వివేకవంతమైన వ్యవస్థలను ప్రవేశపెట్టాలన్న ఐఆర్ విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఈ ఒప్పందం ఉంది. ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా రైల్వే భద్రతలో డిజిటల్ పరివర్తనకు, భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా రైలు మౌలిక సదుపాయాలను నిర్మించడంలో కొత్త అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది.
***
(Release ID: 2143938)