ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

క్రియాశీలకంగా లేని పీఎం జన్ ధన్ యోజన ఖాతాలను మూసివేయాలంటూ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు: ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఆర్థిక సేవల విభాగం స్పష్టీకరణ

Posted On: 08 JUL 2025 4:17PM by PIB Hyderabad

 

కేంద్ర ఆర్థికశాఖలోని ఆర్థిక సేవల విభాగం(డీఎఫ్ఎస్), క్రియాశీలకంగా లేని పీఎం జన్ ధన్ యోజన ఖాతాలను మూసివేయాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిందంటూ మీడియాలో వెలువడుతున్న వార్తల దృష్ట్యా, అటువంటి ఆదేశాలు ఏవీ జారీ చేయలేదని ఆర్థిక సేవల విభాగం స్పష్టం చేసింది.

 జన్ ధన్ యోజన ఖాతాలు, జీవన్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో డీఎఫ్ఎస్ జులై 1 నుంచి మూడు నెలల పాటు  ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదే సమయంలో బకాయిలు చెల్లించవలసిన ఖాతాలకు సంబంధించి, బ్యాంకులు తిరిగి కేవైసీ ప్రక్రియను చేపడతాయి.   లావాదేవీలు స్తంభించిపోయిన పీఎంజేడీవై ఖాతాల సంఖ్యను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే డీఎఫ్ఎస్ సంబంధిత ఖాతాదారులతో సంభాషించి వారి అకౌంట్లు తిరిగి పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించింది.    పీఎంజేడీవై ఖాతాల సంఖ్యలో క్రమేపీ పెరుగుదల కనిపిస్తోంది. లావాదేవీలు నిలిచిపోయిన పీఎంజేడీవై  ఖాతాల మూకుమ్మడి మూసివేత ఏదీ  డీఎఫ్ఎస్. దృష్టికి రాలేదు.

 

***


(Release ID: 2143174)