గనుల మంత్రిత్వ శాఖ
పర్యావరణ హిత తయారీ, వనరుల భద్రతను పెంపొందించేందుకు
అల్యూమినియం విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసిన కేంద్ర మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి
प्रविष्टि तिथि:
04 JUL 2025 3:44PM by PIB Hyderabad
ది వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ కి చెందిన భారత జాతీయ కమిటీ ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి అల్యూమినియం విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఉత్తమమైన గనుల మూసివేత పద్ధతుల ద్వారా సుస్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి ప్రసంగించారు. స్వయం సమృద్ధి, వనరుల భద్రత సాధించిన భారత్‌ను నిర్మించడంలో ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని అల్యూమినియం విజన్ డాక్యుమెంట్ ప్రతిబింబిస్తుందన్నారు. స్వచ్ఛ ఇంధన వ్యవస్థలు, విద్యుత్ వాహన రంగం, ఆధునిక మౌలిక వసతుల కల్పనలో అల్యూమినియం రంగం పోషిస్తున్న వ్యూహాత్మక పాత్రను ఆయన తెలియజేశారు. నేషనల్ అల్యూమినియ కంపెనీ (ఎన్ఏఎల్‌సీవో), హిందాల్కో ఇండస్ట్రీస్, వేదాంత, జవహర్ లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చి డెవలప్‌మెట్ అండ్ డిజైన్ సెంటర్ (జేఎన్ఏఆర్డీడీసీ) లాంటి సంస్థలు, అల్యూమినియం అసోషియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ), అల్యూమినియం సెకండరీ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏఎస్ఎంఏ), మెటల్ రీసైక్లింగ్ అసోసియన్ ఆఫ్ ఇండియా (ఎంఆర్ఏఐ) లాంటి ప్రధాన సంఘాలతో విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ దార్శనిక పత్రాన్ని రూపొందించారు.
అల్యూమినియం ఉత్పత్తిని 2047 నాటికి ఆరు రెట్లు పెంచేందుకు వ్యూహాత్మక ప్రణాళికను ఈ డాక్యుమెంట్ అందిస్తుంది. అలాగే లక్ష్య ఆధారిత విధాన సంస్కరణలు, సంస్థాగత వ్యవస్థల ద్వారా 150 ఎంటీపీఏలకు బాక్సైట్ ఉత్పత్తిని పెంచడం, దేశంలో అల్యూమినియం రీసైక్లింగ్ రేటును రెట్టింపు చేయడం, తక్కువ కర్బన ఉద్ఘారాలున్న సాంకేతికతల స్వీకరణను ప్రోత్సహించడం, ముడి ఖనిజాల భద్రతను బలోపేతం చేయడమే దీని లక్ష్యం.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా అల్యూమినియం విజన్ డాక్యుమెంట్ ఉంది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే, పర్యావరణం పట్ల బాధ్యతాయుతంగా ఉండే అల్యూమినియం పరిశ్రమకు పునాది వేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2142280)
आगंतुक पटल : 10