సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం-లైబ్రరీ (పీఎమ్ఎమ్ఎల్) సొసైటీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి


“మ్యూజియం మ్యాప్ ఆఫ్ ఇండియా” దార్శనిక భావనను ప్రతిపాదించిన ప్రధానమంత్రి

దేశంలోని అన్ని మ్యూజియంల సమగ్ర జాతీయ డేటాబేస్‌ను అభివృద్ధి చేయాలని సూచన

ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో నాటి అన్ని న్యాయ పోరాటాల సంకలనం రూపొందించి.. భద్రపరచాలి

వృద్ధి, వారసత్వం, సుస్థిరతకు ప్రతీకగా తీన్ మూర్తి హౌస్ ఆవరణలో పచ్చ కర్పూరం (సినమోమమ్ కాంఫోరా) మొక్కను నాటిన ప్రధానమంత్రి

Posted On: 23 JUN 2025 9:35PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్‌లో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం-లైబ్రరీ (పీఎమ్ఎమ్ఎల్సొసైటీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంలు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయన్నారుఅవి మనకు చరిత్ర అనుభవాలను అందించే శక్తి గలవని పేర్కొన్నారుమ్యూజియంల పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించడానికిసమాజంలో వాటి ప్రతిష్ఠను మరింత మెరుగుపరిచేందుకు నిరంతర కృషి అవసమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా గల మ్యూజియంల ఏకీకృత సాంస్కృతికసమాచార దృశ్యాన్ని అందించే లక్ష్యంతో "మ్యూజియం మ్యాప్ ఆఫ్ ఇండియాపేరుతో సరికొత్త దార్శనిక భావనను ప్రధానమంత్రి ప్రతిపాదించారు.

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగ ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. దేశంలోని అన్ని మ్యూజియంల సమగ్ర జాతీయ డేటాబేస్‌ను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి సూచించారుసందర్శకుల సంఖ్యనాణ్యతా ప్రమాణాల వంటి కీలక కొలమానాలను ఈ డేటాబేస్‌లో పొందుపరచాలన్నారుమ్యూజియంల నిర్వహణకార్యాచరణ బాధ్యతలు గల సిబ్బంది సామర్థ్యాలను పెంపొందించడంవిజ్ఞానాన్ని పంచుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తూ కార్యశాలలు నిర్వహించాలని ఆయన సూచించారు.

దేశంలోని మ్యూజియంల అభివృద్ధి గురించిన కొత్త ఆలోచనలుదృక్పథాలను స్వాగతించడం కోసం ప్రతి రాష్ట్రం నుంచి 35 ఏళ్లలోపు వయస్సు గల ఐదుగురు సభ్యుల కమిటీలను ఏర్పాటు చేయడం వంటి కొత్త కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

అందరు ప్రధానమంత్రుల జీవన విశేషాలతో మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా భారత తొలి ప్రధాని శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ సహా ప్రధానులందరి వారసత్వానికి తగిన న్యాయం జరిగిందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2014కి ముందు ఇలాంటి ప్రయత్నాలేవీ జరగలేదన్నారు.

భారతీయ మ్యూజియంలలో భద్రపరచిన గొప్ప వారసత్వం గురించి అవగాహన పెంపొందించడం కోసం ప్రముఖ ప్రభావశీలురు మ్యూజియంలను సందర్శించేలా చర్యలు చేపట్టాలన్నారువివిధ రాయబార కార్యాలయాల అధికారులను భారతీయ మ్యూజియంలకు ఆహ్వానించాలని ప్రధానమంత్రి కోరారు.

ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆ కాలానికి సంబంధించిన అన్ని న్యాయ పోరాటాల వివరాలుపత్రాలను సంకలనం చేసిభద్రపరచాలని ప్రధానమంత్రి సూచించారు.

వర్తమానాన్ని ఒక క్రమపద్ధతిలో సంరక్షిస్తూ నమోదు చేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధానమంత్రి స్పష్టం చేశారుమన ప్రస్తుత వ్యవస్థలురికార్డులను బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్ తరాలు.. ముఖ్యంగా పరిశోధకులు ఈ కాలాన్ని సులభంగా అధ్యయనం చేసివీటి గురించి మెరుగ్గా అర్థం చేసుకోగలరని ఆయన పేర్కొన్నారు.

పీఎమ్ఎమ్ఎల్ సొసైటీలోని ఇతర సభ్యులు కూడా మ్యూజియంలైబ్రరీని మరింత మెరుగుపరచే విషయంగా తమ సూచనలుఅభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి తీన్ మూర్తి హౌస్ ఆవరణలో వృద్ధివారసత్వంసుస్థిరతకు ప్రతీకగా పచ్చ కర్పూరం (సినమోమమ్ కాంఫోరామొక్కను నాటారు.

 

***


(Release ID: 2139130) Visitor Counter : 3