ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మెక్సికో అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ

प्रविष्टि तिथि: 17 JUN 2025 11:54PM by PIB Hyderabad

కెనడాలో కననాస్కిస్‌లో జీశిఖరాగ్ర సదస్సు సందర్భంగా మెక్సికో అధ్యక్షురాలు డాక్టర్ క్లౌడియా షైన్‌బామ్ పార్డోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారుఈ నేతలు ఇద్దరూ సమావేశం కావడం ఇదే మొదటి సారిమెక్సికో అధ్యక్షురాలి చరిత్రాత్మక గెలుపును దృష్టిలో పెట్టుకొనిప్రధానమంత్రి ఆమెకు అభినందనలు తెలిపారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మెక్సికో మద్దతు తెలిపినందుకు ఆ దేశ అధ్యక్షురాలు షైన్‌బామ్‌కు ప్రధానమంత్రి ధన్యవాదాలు పలికారుభారత్మెక్సికోల మధ్య ఎప్పటి నుంచో మైత్రి కొనసాగుతోందని నేతలు ఇద్దరూ ప్రధానంగా ప్రస్తావించారువాణిజ్యంపెట్టుబడిఅంకుర సంస్థలునవకల్పనసైన్స్-టెక్నాలజీలతో పాటు ఆటోమోటివ్ రంగాలలో సంబంధాలను మరింత విస్తరించేప్రజల మధ్య పరస్పర సంబంధాలను ప్రోత్సహించే దిశగా కృషిచేద్దామంటూ ఉభయులూ అంగీకారాన్ని వ్యక్తం చేశారుఉభయ దేశాల మధ్య వాణిజ్యంపెట్టుబడి ప్రధాన సహకారం అంతకంతకు వృద్ధి చెందుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. ‘నియర్-షోరింగ్’ విషయంలో మెక్సికో అందజేయగల అవకాశాలను నేతలిరువురూ చర్చించారుఔషధ తయారీ రంగంలో అవకాశాలు రోజు రోజుకూ పెరుగుతుండగాభారత్ తక్కువ ధరలలో నాణ్యమైన మందులతో పాటు ఇతర ఔషధ ఉత్పత్తులను తయారు చేయడంలోసరఫరా చేయడంలో ప్రధాన పాత్రను పోషించగల స్థితిలో ఉంది.  వ్యవసాయంసంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చాయి.

సాంకేతికతనవకల్పనప్రజలకు వివిధ సేవలను అందించడంలో డిజిటల్ మాధ్యమం పోషిస్తున్న భూమిక.. ఈ రంగాల్లో భారత్ సాధించిన వృద్ధిని అధ్యక్షరాలు షైన్‌బామ్ ప్రశంసిస్తూఈ రంగాల్లో భారత్ సహకారాన్ని అందించాలని కోరుకున్నారుసెమీకండక్టర్లుకృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్‌కీలక ఖనిజాల రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలను రెండు దేశాలూ గుర్తించాలని ప్రధానమంత్రి అన్నారుఇరు పక్షాల మేధావులు రాబోయే కాలంలో అనుబంధాన్ని పెంచుకోవడంతో పాటుపర్యటన రంగానికి ఊతాన్ని అందించగల  ఉభయ దేశాల చైతన్యభరిత సాంస్కృతిక సంబంధాల పైనప్రజల మధ్య సంబంధాల పైన కూడా నేతలు దృష్టి సారించారు.

భాగస్వామ్య దేశాల నేతలుగా వారు ప్రస్తుతం తెర మీదకు వచ్చిన ప్రపంచప్రాంతీయ అంశాల పైనాగ్లోబల్ సౌత్ ప్రాధాన్యాల పైనా అభిప్రాయాలను ఒకరికొకరు పంచుకున్నారు. 2016లో మెక్సికోలో తాను పర్యటించిన సంగతిని ప్రధానమంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారుభారత్‌ను సందర్శించవలసిందిగా అధ్యక్షురాలు షైన్‌‌బామ్‌ను ఆహ్వానించారు.

 

***


(रिलीज़ आईडी: 2137220) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Malayalam , Gujarati , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Tamil