కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
మోదీ ప్రభుత్వానికి 11 ఏళ్లు: కార్మిక మంత్రిత్వశాఖ నేతృత్వాన సామాజిక భద్రత.. సంక్షేమం రూపాంతరీకరణ
· మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన హైదరాబాద్‌లోని మూడు ప్రసిద్ధ సంస్థలు సాధించిన విజయాలపై నేటి నుంచి ‘ప్రెస్ టూర్’ ప్రారంభం... 14 వరకూ కొనసాగింపు
Posted On:
11 JUN 2025 6:04PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ల సమ్మిళిత, సంస్కరణ-ఆధారిత పాలన వేడుకలు నిర్వహించుకుంటోంది. ఇందులో భాగంగా కార్మిక సంక్షేమం, సామాజిక భద్రత, ప్రజారోగ్య సంరక్షణలో తాను సాధించిన విజయాలను కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ప్రముఖంగా ప్రదర్శిస్తోంది.
ఈ రూపాంతరీకరణకు నిదర్శనాలుగా నిలిచే హైదరాబాద్‌లోని మూడు ప్రముఖ సంస్థలలో బర్కత్‌పురాలోని ‘ఇపిఎఫ్‌ఒ’ ప్రాంతీయ కార్యాలయం ఒకటి. డిజిటల్ ఆవిష్కరణల ద్వారా అభ్యర్థనలతోపాటు ఫిర్యాదుల సత్వర, ప్రభావశీల పరిష్కారాలు చూపడం ద్వారా సేవా ప్రదానంలో ఈ కార్యాలయం కొత్త ప్రమాణాలను సృష్టించింది. తదనుగుణంగా దీని పరిధిలో 27 లక్షలకుపైగా ఖాతాలను నిర్వహిస్తుండగా, అధిక వేతనాలపై 98 శాతం పెన్షన్ అభ్యర్థనలను పరిష్కరించింది. ఈ సామర్థ్యం జాతీయ స్థాయిలో ఒక ఆదర్శంగా నిలుస్తోంది.
ఇక మంత్రిత్వ శాఖ పరిధిలోగల సనత్‌నగర్‌లోని ‘ఇఎస్‌ఐసి’ వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యవిద్యలో, ప్రజారోగ్య పరిరక్షణలో అగ్రస్థాయిలో నిలిచాయి. ఈ ఆస్పత్రిలో 1,000కిపైగా పడకలు, అత్యాధునిక రోగనిర్ధార సౌకర్యాలు ఉన్నాయి. ఈ ప్రాంగణం ద్వారా ఐటీ ఆధారిత, రోగి-కేంద్రక సేవలతో 72 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు సేవలు అందుతున్నాయి.
మరోవైపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ (డిజిఎల్‌డబ్ల్యు) 50 లక్షల మందికిపైగా అసంఘటిత కార్మికుల అభ్యున్నతికి అవిరళ కృషి చేస్తోంది. ఈ మేరకు విద్యా స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్య సంరక్షణ, సామాజిక రక్షణ ద్వారా... ముఖ్యంగా బీడీ, సినీ, మైనింగ్ రంగాల కార్మికుల జీవితాల మెరుగులో తనవంతు పాత్ర పోషిస్తోంది.
ఈ సంస్థలు సాధించిన విజయగాథలపై లోతైన, క్షేత్రస్థాయి అవగాహన కల్పన లక్ష్యంగా మంత్రిత్వ శాఖ 2025 జూన్ 11 నుంచి హైదరాబాద్‌లో ‘ప్రెస్ టూర్’ నిర్వహిస్తోంది. ఈ నెల 14 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా పథకాల లబ్ధిదారులు, అగ్రశ్రేణి సేవా ప్రదాతలతో పలువురు పాత్రికేయులు నేరుగా సంభాషిస్తారు. ‘గైడెడ్ వాక్‌త్రూ, ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్రెజెంటేషన్ల’ ద్వారా 11 ఏళ్ల కేంద్రీకృత పాలనతో కార్మిక రంగం సాధించిన విస్పష్ట, ప్రజా-కేంద్రక ఫలితాల గురించి మీడియా ప్రతినిధులు ప్రత్యక్షంగా తెలుసుకుంటారు.
***
(Release ID: 2135851)
|