ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేడు మహిళాశక్తి వికసిత్ భారత్ సంకల్పంలో చురుగ్గా పాల్గొంటూ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తోంది: ప్రధాన మంత్రి


గడచిన 11 ఏళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని పునర్నిర్వచించింది: ప్రధానమంత్రి

స్వచ్ఛ భారత్ ద్వారా గౌరవాన్ని కాపాడడం నుంచి జనధన్ ఖాతాల ద్వారా ఆర్థిక సమ్మిళితం సాధించడం వరకూ అనేక కార్యక్రమాల ద్వారా మహిళలను శక్తిమంతం చేయడంపైనే దృష్టి కేంద్రీకరించాం: ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 08 JUN 2025 11:14AM by PIB Hyderabad

అభివృద్ధి చెందిన భారత్ దిశగా సాగుతున్న ప్రయాణంలో మహిళలు మార్పుతో కూడిన పాత్రను పోషిస్తున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మహిళల నాయకత్వంలో అభివృద్ధికి గత 11 సంవత్సరాలుగా తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు.

మన తల్లులు, సోదరీమణులు, కూతుళ్లు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలను చూశారని ప్రధాని అన్నారు. కానీ నేడు వారు అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్ప సాధన దిశలో చురుకుగా పాల్గొనడమే కాకుండా, విద్య నుంచి వ్యాపారం వరకు ప్రతి రంగంలో ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రధాని అన్నారు. . గడచిన 11 ఏళ్లలో మహిళా శక్తి సాధించిన విజయాలు పౌరులందరికీ గర్వకారణమని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రభావవంతమైన కార్యక్రమాల ద్వారా మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని పునర్నిర్వచించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా గౌరవాన్ని అందించడం, జన్ ధన్ ఖాతాల ద్వారా ఆర్థిక సమ్మిళితం, క్షేత్రస్థాయిలో సాధికారత వంటివి ఇందులో ఉన్నాయి.

ఉజ్వల యోజనను అనేక గృహాలకు పొగ రహిత వంటగదులను తీసుకువచ్చిన మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ముద్రా రుణాలు లక్షలాది మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి, వారి కలలను స్వతంత్రంగా కొనసాగించడానికి ఎలా దోహదపడ్డాయో ఆయన వివరించారు. పీఎం ఆవాస్ యోజన కింద మహిళల పేరిట ఇళ్లు ఇవ్వడం కూడా వారి భద్రత, సాధికారతపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

బేటీ బచావో బేటీ పడావో ప్రచారాన్ని కూడా ప్రధాని గుర్తు చేస్తూ, వాటిని ఆడపిల్లల రక్షణ కోసం చేపట్టిన జాతీయ ఉద్యమంగా అభివర్ణించారు.

సైన్స్, విద్య, క్రీడలు, స్టార్టప్స్, సాయుధ దళాలు సహా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ ద్వారా వరస పోస్టుల్లో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు పంచుకున్నారు.

“అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులను మన తల్లులు, సోదరీమణులు, కూతుళ్లు చూశారు. కానీ నేడు వారు అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా, విద్య,  వ్యాపారం వరకు ప్రతి రంగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. గత 11 ఏళ్లలో మన నారీ శక్తి సాధించిన విజయాలు మన దేశ ప్రజలను గర్వపడేలా చేస్తాయి”

#11YearsOfSashaktNari"

గత 11 ఏళ్ల పైగా ఎన్డీయే ప్రభుత్వం మహిళల నేతృత్వంలో అభివృద్ధిని పునర్నిర్వచించింది.

స్వచ్ఛభారత్ ద్వారా గౌరవాన్ని నిలబెట్టడం నుంచి జన్ ధన్ ఖాతాల ద్వారా ఆర్థిక సమ్మిళితం వరకు వివిధ కార్యక్రమాలు మన మహిళా శక్తి సాధికారతపై దృష్టి సారించాయి. ఉజ్వల యోజన అనేక గృహాలకు పొగ రహిత వంటగదులను తీసుకువచ్చింది. ముద్రా రుణాలు లక్షలాది మంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సొంత కలలను సాకారం చేసుకునేందుకు దోహదపడ్డాయి. పీఎం ఆవాస్ యోజనలో మహిళల పేరుతో ఉన్న ఇళ్లు కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపాయి.

బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లల రక్షణ దిశగా క జాతీయ స్థాయిలో స్ఫూర్తిని రగిలించింది.

సైన్స్, విద్య, క్రీడలు, స్టార్టప్స్, సాయుధ దళాలు సహా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


 

***


(Release ID: 2135114)