ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 07 JUN 2025 2:59PM by PIB Hyderabad

అత్యంత ప్రముఖులు,

గౌరవ ప్రతినిధులు,

ప్రియమైన మిత్రులు,

నమస్కారం.

విపత్తు నిరోధక సుస్థిర మౌలిక సదుపాయాల (డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్పై అంతర్జాతీయ సదస్సు 2025 కు స్వాగతంయూరప్ లో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారుఈ సదస్సు నిర్వహణకు మద్దతు అందించిన నా మిత్రుడుఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ కుఫ్రాన్స్ ప్రభుత్వానికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానుఅలాగే సముద్రాలపై త్వరలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సదస్సు (యునైటెడ్ నేషన్స్ ఓషన్స్ కాన్ఫరెన్స్సందర్భంగా కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ సదస్సు ఇతివృత్తం -   'తీరప్రాంతాలకు సుస్థిర భవిష్యత్తును రూపొందించడం'. ప్రకృతి వైపరీత్యాలువాతావరణ మార్పుల కారణంగా తీరప్రాంతాలుద్వీపాలు చాలా ప్రమాదంలో ఉన్నాయిఇటీవలి కాలంలో భారత్బంగ్లాదేశ్ లలో రెమల్ తుపానుకరేబియన్ లో బెరిల్ హరికేన్ఆగ్నేయాసియాలో యాగి తుపానుఅమెరికాలో హెలెన్ హరికేన్ఫిలిప్పీన్స్ లో ఉసాగి తుపానుఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో చిడో తుపాన్లు పెద్ద ఎత్తున ప్రాణఆస్తి నష్టాన్ని కలిగించాయి.

మిత్రులారా,

1999 సూపర్ సైక్లోన్, 2004 సునామీ సమయంలో భారత్ కూడా ఈ బాధను అనుభవించిందిఅయితే ఆ విపత్తుల నుంచి మేం ఎంతో నేర్చుకున్నాంతట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటూ నిబ్బరంతో పునర్నిర్మాణాన్ని చేపట్టాంఅత్యంత ప్రభావిత ప్రాంతాల్లో సైక్లోన్ షెల్టర్లను నిర్మించాంఅలాగే, 29 దేశాలకు ఉపయోగపడేలా సునామీ హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటులో సహాయపడ్డాం

మిత్రులారా,

విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి 25 అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలతో కలిసి పనిచేస్తోందిఇళ్లుఆసుపత్రులుపాఠశాలలుఇంధనంనీటి భద్రతముందస్తు హెచ్చరిక వ్యవస్థలను నిర్మిస్తున్నారుఈ సదస్సు ఇతివృత్తం దృష్ట్యాపసిఫిక్హిందూ మహాసముద్రంకరేబియన్ దేశాలకు చెందిన స్నేహితులను ఇక్కడ చూడటం నాకు సంతోషంగా ఉందిఇంకాఆఫ్రికన్ యూనియన్ కూడా సిడిఆర్ ఐలో చేరడం నాకు సంతోషంగా ఉంది.

మిత్రులారా,

కొన్ని ముఖ్యమైన ప్రపంచ ప్రాధాన్యతల గురించి నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను.

మొదటిదివిపత్తుల నివారణపై కోర్సులుమాడ్యూళ్లుస్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు ఉన్నత విద్యలో భాగం కావాలిభవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని ఇది సిద్ధం చేస్తుంది

రెండోదిఅనేక దేశాలు విపత్తులను ఎదుర్కొని సహనంతో పునర్నిర్మాణం చేస్తుంటాయిఈ దేశాల అనుభవాలు,  ఉత్తమ ఆచరణ పద్ధతులను ఒక గ్లోబల్ డిజిటల్ భాండాగారంగా సమీకరించడం ప్రపంచానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మూడోదివిపత్తులను తట్టుకునే శక్తి కోసం వినూత్న ఆర్థిక సహాయ పథకాలు అవసరంఅభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా చూడటంఅమలు చేయకలిగిన కార్యక్రమాలను రూపొందించడం చాలా అవసరం.

నాలుగోదిఅభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలను మేం పెద్ద సముద్ర దేశాలుగా పరిగణిస్తాంవారి బలహీనత కారణంగావాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

ఐదవదిముందస్తు హెచ్చరిక వ్యవస్థలనుసమన్వయాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యంఇది సకాలంలో నిర్ణయాలు తీసుకోవడానికిచివరి మైలు వరకు ప్రభావవంతమైన సమాచార వినిమయానికీ సహాయపడుతుందిఈ సదస్సులో జరిగే చర్చలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయని నేను కచ్చితంగా అనుకుంటున్నాను.

మిత్రులారా,

కాలానికీఆటుపోట్లకు దీటుగా నిలబడే మౌలిక సదుపాయాలను నిర్మిద్దాంప్రపంచానికి దృఢమైనసుస్థిరమైన భవిష్యత్తును అందిద్దాం.

ధన్యవాదాలు....

 

***


(Release ID: 2134939)