ప్రధాన మంత్రి కార్యాలయం
వీర్ సావర్కర్ జీకి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
28 MAY 2025 9:33AM by PIB Hyderabad
వీర్ సావర్కర్ జీ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ‘‘స్వాతంత్య్ర ఉద్యమంలో వీర్ సావర్కర్ జీ కనబరచిన అజేయ ధైర్య-సాహసాలు, సంఘర్షణలతో నిండిన గాథను కృతజ్ఞతాభరిత దేశం ఎన్నటికీ మరువజాలదు. దేశం కోసం ఆయన చేసిన త్యాగం, ఆయన ప్రదర్శించిన అంకితభావం మన దేశాన్ని ‘అభివృద్ధి చెందిన భారత్‘గా తీర్చిదిద్దడంలో మార్గదర్శకంగా నిలుస్తుంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో :
‘‘భరత మాత ముద్దుబిడ్డ వీర్ సావర్కర్ జీకి ఆయన జయంతి సందర్భంగా గౌరవపూర్వక శ్రద్ధాంజలి. విదేశీ పాలనలో కఠోరాతి కఠోర యాతనలకు గురి చేసినప్పటికీ మాతృభూమి పట్ల ఆయన అంకితభావాన్ని చెదరనీయలేకపోయింది. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన కనబరచిన అజేయ ధైర్య-సాహసాలు, సంఘర్షణలతో నిండిన గాథను కృతజ్ఞతాభరిత దేశం ఎన్నటికీ మరువజాలదు. దేశం కోసం ఆయన చేసిన త్యాగం, ప్రదర్శించిన అంకితభావం మన దేశాన్ని ‘అభివృద్ధి చెందిన భారత్‘గా తీర్చిదిద్దడంలో మార్గదర్శకంగా నిలుస్తుంటాయి’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2131913)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam