భారత ఎన్నికల సంఘం
పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు మొబైల్ డిపాజిట్ సౌకర్యాన్ని కల్పించనున్న కేంద్ర ఎన్నికల సంఘం
ప్రచార నిబంధనల క్రమబద్ధీకరణ
Posted On:
23 MAY 2025 6:05PM by PIB Hyderabad
ఓటర్లకు సౌకర్యాలను, ఓటింగ్ రోజు ఏర్పాట్లను మెరుగుపరచేందుకు తీసుకొంటున్న చర్యల్లో భాగంగా పోలింగ్ స్టేషన్ల దగ్గరే మొబైల్ డిపాజిట్ సౌకర్యాన్ని కల్పించేందుకు, ప్రచార నిబంధనలను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు మారస్తూ ప్రజా ప్రాతినిధ్య చట్టం- 1951, ఎన్నికల నిర్వహణ నిబంధనలు -1961కు అనుగుణంగా ఎన్నికల సంఘం రెండు ఆదేశాలను జారీ చేసింది.
దేశంలో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం కవరేజీ, మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద సగట ఓటరు మొబైల్ ఫోన్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల అయితే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. దీనితో మొబైల్ డిపాజిట్ సౌకర్యాన్ని పోలింగ్ కేంద్రాల వద్దే కల్పించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కేవలం మొబైల్ ఫోన్లను, అది కూడా స్విచ్ఛాప్ చేసిన వాటినే డిపాజిట్‌కు అనుమతించనున్నారు. మొబైల్ డిపాజిట్ సౌకర్యం పోలింగ్ స్టేషన్ నుంచి 100 మీటర్ల లోపలే ఉండనుంది. తమ మొబైల్ ఫోన్లను ఉంచేందుకు పోలింగ్ స్టేషన్ ద్వారం వద్దే సులభమైన పించ్ బాక్సులను, జనపనార బ్యాగులను ఓటర్లకు ఇవ్వనున్నారు. ఓటరు పోలింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అయితే ప్రతికూల పరిస్థితులున్నట్లయితే కొన్ని పోలింగ్ కేంద్రాలకు ఈ నిబంధన నుంచి రిటర్నింగ్ అధికారి మినహాయింపు ఇవ్వొచ్చు. పోలింగ్ కేంద్రంలో గోప్యత ఉండాలన్న ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని 49ఎం నియమాన్ని యధావిధిగా కఠినంగా అమలుచేయనున్నారు.
పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారానికి సంబంధించిన నిబంధనలను కూడా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సవరించింది. నూతన నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్ర ద్వారం నుంచి 100 మీటర్ల ఆవల ప్రచారానికి అనుమతిస్తారు. పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల వ్యాసంలో ప్రచారానికి మాత్రం అనుమతి లేదు. అధికారిక ఓటరు స్లిప్(వీఐఎస్) లేని ఓటర్లకు అనధికార గుర్తింపు స్లిప్‌లను ఇచ్చేందుకు అభ్యర్థులు పెట్టే బూత్‌లను ఇప్పుడు 100 మీటర్ల ఆవల ఏర్పాటు చేసుకోవచ్చు.
ఎన్నికల కమిషనర్‌లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సందు, డాక్టర్ వివేక్ జోషీలతో సహా ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ గ్యానేశ్ కుమార్ నాయకత్వంలోని ఎన్నికల సంఘం.. చట్టపరంగా నియమ నిబంధనలకు లోబడి ఓటర్లకు కావాల్సిన సదుపాయాలను మెరుగుపరుస్తూ పకడ్బందీగా ఎన్నికల నిర్వహించేందుకు కట్టుబడి ఉంది.
***
(Release ID: 2130904)