శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అత్యుత్తమ పనితీరు కనబరిచే పర్యావరణహిత కందెనను అభివృద్ధి చేసిన పరిశోధకులు

Posted On: 09 MAY 2025 6:05PM by PIB Hyderabad

యంత్రాల అరుగుదలనూనిరోధకతనూ తగ్గించడంతోపాటు యంత్రాల పనితీరును గణనీయంగా మెరుగుపరిచే పర్యావరణ అనుకూలమైన కందెనను పరిశోధకులు అభివృద్ధి చేశారుఇది సంప్రదాయ కందెనలకు స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందిఅలాగే యంత్ర సామర్థ్యంపర్యావరణానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది.

కందెనలు యంత్రాల్లో ఘర్షణను తగ్గించి వాటి సామర్థ్యాన్నిజీవితకాలాన్ని పెంచుతాయిసంప్రదాయ ఖనిజ లేదా సింథటిక్ నూనె ఆధారిత కందెనలు పర్యావరణానికి హాని కలిగిస్తాయిఇదే పర్యారవరణ హితమైన ప్రత్యామ్నాయాల తయారీకి డిమాండును పెంచుతోంది.

గౌహతీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఏఎస్ఎస్‌టీపరిశోధకులు ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారుసైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన ఈ సంస్థ స్వయంప్రతిపత్తిని కలిగి ఉందిఈ సంస్థకు చెందిన పరిశోధకులు జీవాధారిత ఆముదంలో సర్ఫేస్ మాడిఫైడ్ గ్రాఫైటిక్ కార్బన్ నైట్రైడ్ (g-C3N4ను చేర్చడం ద్వారా లూబ్రికెంట్ ఫార్ములేషన్‌ను అభివృద్ధి చేశారు.

ఇన్స్‌పైర్ జేఆర్ఎఫ్ ఉజిబిత్ బారువాయూజీసీ-జేఆర్ఎఫ్ బితుపన్ మోహన్ఏఎస్‌టీయూకి చెందిన డాక్టర్ నబజిత్ దేవ్ చౌధరితో కూడిన బృందానికి ప్రొఫెసర్ దేవాశీష్ చౌధరి నాయకత్వం వహించారుఈ బృందం g-C3N4 నానో షీట్లను ఆక్టాడెసిల్ట్రిక్లోరోసిలేన్ (ఓటీసీఎస్ఉపయోగించి మార్పులకు గురిచేయడం ద్వారా కందెనల పనితీరును మెరుగుపరిచారుఫలితంగా విక్షేపణకు గురి కాకుండా చేసి యంత్ర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

సాపేక్ష కదలికలో ఘర్షణలూబ్రికేషన్ఉపరితలంపై కందెన జరిపే చర్యలపై అధ్యయనంలో (ట్రైబయోలాజికల్ ఇవాల్యూయేషన్స్మెరుగైన ఫలితాలు కనిపించాయిఆముదంతో పోల్చినప్పుడు ఘర్షణలో సుమారుగా 54 శాతంవినియోగంలో 60.02 శాతం తగ్గుదల కనిపించిందిఈ లూబ్రికెంట్ అధిక లోడ్ భారాన్ని మోసే సామర్థ్యాన్నిఎక్కువ ఉష్ణ స్థిరత్వాన్ని ప్రదర్శించిందిఆక్సీకరణ ప్రారంభ ఉష్ణోగ్రతలు 320 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 339 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగాయిఅలాగే తక్కువ మొత్తంలో ఫ్రీరాడికల్స్ ఉత్పత్తి అవుతున్నాయని (ఎక్కువ ఫ్రీరాడికల్స్ ఉత్పత్తి అయితే ప్రతిచర్యలకు దారితీస్తుందివిషపదార్థాలకు సంబంధించిన అధ్యయనాలు నిర్ధారించాయిఇది ఈ ఫార్ములేషన్ పర్యావరణపరంగా సురక్షితమైనదని తెలియజేస్తుంది.

 ‘‘ఈ సుస్థిరమైన కందెన ఫార్ములేషన్ యంత్రాల పనితీరును మెరుగుపరచడమే కాకుండా పర్యావరణ అనుకూలమైనసామర్థ్యమున్న లూబ్రికేషన్ టెక్నాలజీలను అభివృద్ధి  చేయాలన్న అంతర్జాతీయ ప్రయత్నాలకు అనుగుణంగా ఉంది’’ అని ప్రొఫెసర్ చౌధరి తెలిపారుఏసీఎస్ అప్లయిడ్ నానో మెటీరియల్స్‌ లో ఇటీవలే ఈ ఫలితాలు ప్రచురితమయ్యాయి.

 

***


(Release ID: 2128058)
Read this release in: Tamil , English , Urdu , Hindi