ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

కౌటిల్యుని సిద్ధాంతాన్ని మన ప్రధాని ఆచరణలో చూపించారు: ఉపరాష్ట్రపతి


* మన ప్రధాని గొప్ప దార్శనికుడు, పెద్ద ఎత్తున తీసుకొచ్చే సానుకూల మార్పులపై విశ్వాసమున్న వ్యక్తి: ఉపరాష్ట్రపతి

* ‘‘పొరుగు రాజ్యం మన శత్రువు, శత్రువుకి శత్రువు మన మిత్రుడు’’: కౌటిల్యుని సూక్తిని ఉటంకించిన ఉపరాష్ట్రపతి

* ‘ప్రజల సంతోషంలోనే రాజు ఆనందం ఉంటుందనేది కౌటిల్యుడి భావన, ఇదే పరిపాలనలో ముఖ్యమైన అంశం : ఉపరాష్ట్రపతి

* ప్రజాస్వామ్యం రాజ్యాంగంతో మొదలు కాలేదు, ఇది వ్యక్తీకరణ, చర్చల్లో పాతుకుపోయింది – వేద సంస్కృతిలోని అనంత్‌వాద్ దీన్నితెలియజేస్తుంది: ఉపరాష్ట్రపతి

* ఇండియా ఫౌండేషన్‌కు చెందిన కౌటిల్య పరిశోధకులతో న్యూఢిల్లీలో ముచ్చటించిన ఉపరాష్ట్రపతి

Posted On: 08 MAY 2025 2:33PM by PIB Hyderabad

‘‘కౌటిల్యుని సిద్ధాంతాన్ని మన ప్రధానమంత్రి ఆచరణలో చేసి చూపించారు. పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశంలోనూ కౌటిల్యుని ఆలోచనా విధానం ఓ ప్రామాణిక గ్రంథం. రాజనీతి, రక్షణ, రాజు – ఇప్పుడు ఎన్నికవుతున్న వారి పాత్ర గురించి వివరించే ఎన్‌సైక్లోపీడియా. పొత్తులు మారుతున్న, భిన్న ధ్రువాలున్న ప్రపంచంలో... ఓ సిద్ధాంతం ఉంది – అదే అస్థిరత. పొత్తుల్లోనూ మనం దీన్ని గమనించవచ్చు. ఈ అస్థిరత ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతుందని కౌటిల్యుడు ఏనాడో ఊహించారు. ఇక్కడ కౌటిల్యుని సూక్తిని నేను చెప్పదలుచుకున్నాను: ‘పొరుగు రాజ్యం మన శత్రువు. ఆ శత్రువుకి శత్రువు మన మిత్రుడు’. ఈ విషయం భారత్ కంటే ఏ దేశానికి బాగా తెలుసు? మనం ఎల్లప్పుడూ ప్రపంచ శాంతిని, సోదరభావాన్ని, సంక్షేమాన్ని విశ్వసిస్తాం’’ అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు.  

ఇండియా ఫౌండేషన్‌కు చెందిన కౌటిల్య పరిశోధకులతో న్యూఢిల్లీలో ఈ రోజు ఉపరాష్ట్రపతి ముచ్చటించారు. ‘‘మన ప్రధానమంత్రి గొప దార్శనికుడు. గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి. భారీ స్థాయిలో సానుకూల మార్పులు తీసుకురావడంలో ఆయన నమ్మకం కనబరుస్తారు. దశాబ్దం కాలం పాటు సాగించిన పరిపాలనలో ప్రభుత్వ నిర్ణయాలు చెరగని ముద్ర వేశాయి. కొన్ని దశాబ్దాల అనంతరం మరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మనకు ఉన్నారు. అదే ఈ మార్పులన్నింటికీ కారణం’’

కౌటిల్యుడు ఒక అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని ఉపరాష్ట్రపతి తెలిపారు. ‘‘ప్రజాస్వామ్యం భాగస్వామ్య విధానంలో ఉండాలి. అభివృద్ధిలోనూ సమాన స్థాయిలో భాగస్వామ్యం ఉండాలి. జాతీయ సంక్షేమంలో పౌరులు పోషించాల్సిన పాత్రకు ఆయన అధిక ప్రాధాన్యమిచ్చారు. ఒక దేశాన్ని మర్యాద, క్రమశిక్షణ కలిగినదిగా నిర్వచిస్తే – అది ఆ దేశంలోని పౌరుల స్వభావంగా పరిగణించాలి. అదే విధంగా కౌటిల్యుని మరో సూక్తిని ప్రస్తావిస్తున్నాను: ‘ఒక చక్రంతో బండి ముందుకు కదలనట్లే’.. ఒంటి చేత్తో  పరిపాలనను సాగించలేం’’ అని ధన్కడ్ పేర్కొన్నారు.  

సమకాలీన పాలనా వ్యవహారాల్లో ఈ సూత్రాలు ఎలా ప్రతిబింబిస్తాయో ఉపరాష్ట్రపతి వివరించారు. ‘‘ఈ దేశంలో వినూత్నమైన పరిపాలనా విధానం అమలవుతోంది. మన దేశంలో వెనుకబడిన జిల్లాలు కొన్ని ఉండేవి. అక్కడి వెళ్లి విధులు నిర్వర్తించడానికి అధికారులు ముందుకు వచ్చేవారు కాదు. అలాంటి జిల్లాలకు ‘ఆకాంక్షాత్మక జిల్లాలు’గా ప్రధానమంత్రి నామకరణం చేశారు. ఇప్పుడు ఆ ‘ఆకాంక్షాత్మక జిల్లాలు’ అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ప్రజలు మెట్రో నగరాలకు ఎక్కువ వలస వెళుతున్నారని గుర్తించిన ప్రధానమంత్రి, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగా మార్చాలని భావించారు. స్మార్ట్ నగరాలు అనే భావనకు రూపకల్పన చేశారు. స్మార్ట్‌సిటీలు అంటే మౌలికసదుపాయాల కల్పనకు లేదా సుందరీకరణకు సంబంధించినవి కాదు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేవి.’’ అని ధన్కడ్  తెలిపారు.

అధికారం, పరిపాలనకు సంబంధించిన ప్రాథమిక సూత్రాల గురించి ఉపరాష్ట్రపతి వివరిస్తూ.. ‘‘అధికారానికి పరిమితులుంటాయి. ఆ అధికార పరిమితులను దృష్టిలో ఉంచుకున్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. కౌటిల్యుడి  తత్వశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఇవన్నీ ఒకే అంశానికి, పాలనా విధానానికి – ప్రజల సంక్షేమానికి దారి చూపిస్తాయి’’.

కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని ఉటంకిస్తూ ‘‘రాజు ఆనందం ప్రజల సంతోషంలోనే ఉందని కౌటిల్యుడు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్న ఏ దేశ రాజ్యాంగంలోనైనా ఇదే సారాంశం ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజాస్వామ్య విలువల స్ఫూర్తిగా అంతర్లీనంగా కనిపిస్తుంది’’ అని శ్రీ ధన్కడ్ అన్నారు.

భారతదేశ నాగరిక విలువల గురించి మాట్లాడుతూ ‘‘ఆలోచలను వ్యక్తం చేసే విధానం, సంభాషణ ఒకరినొకకరు మెచ్చుకొనేలా ఉంటే ప్రజాస్వామ్యం విస్తరిస్తుంది. అదే ఇతర పాలనా విధానాల నుంచి ప్రజాస్వామ్యాన్ని వేరు చేస్తుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత లేదా పరాయి పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రారంభం కాలేదు. వేల ఏళ్లుగా మన దేశం ప్రజాస్వామ్యాన్ని అనుసరించింది. ఈ వ్యక్తీకరణ, చర్చలను అభివ్యక్తి, వాద్ వివాద్‌గా – సంస్కృతంలో వేద సంస్కృతిలో అనంత వాద్‌గా పిలుస్తారు’’ అంటూ తన ప్రసంగాన్ని ఉపరాష్ట్రపతి ముగించారు.

 

***


(Release ID: 2127838)