ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో మృతులకు ప్రధాని సంతాపం
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియాను ప్రకటించిన ప్రధాని
प्रविष्टि तिथि:
30 APR 2025 9:36AM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో మరణించినవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.
ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం చేసిన పోస్టు:
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో ప్రాణ నష్టం దిగ్భ్రాంతికి గురి చేసింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్-గ్రేషియా అందిస్తాం: పీఎం @narendramodi’’
“ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో గోడ కూలి జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వబడుతుంది: PM @narendramodi”
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2125385)
आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam