సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియా ఆడియో సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2025లో ఆకాశవాణికి ఆరు అవార్డులు సిరీస్ ఆఫ్ ది ఇయర్ గా ‘నయీ సోచ్ నయీ కహానీ - ఎ రేడియో జర్నీ విత్ స్మృతి ఇరానీ'


హెల్త్ అండ్ ఫిట్ నెస్ విభాగంలో ఉత్తమ ఆడియో స్ట్రీమింగ్ ప్రోగ్రామ్ గా అవార్డు పొందిన 'పబ్లిక్ స్పీక్'

Posted On: 26 APR 2025 5:42PM by PIB Hyderabad

ఇండియా ఆడియో సమ్మిట్ అండ్ అవార్డ్స్, ఐఏఎస్ఏ 2025లో ఆకాశవాణి వివిధ కేటగిరీల్లో మొత్తం ఆరు అవార్డులను గెలుచుకుంది. రేడియో, ఆడియో కంటెంట్ ప్రొడక్షన్ లో ప్రతిభను గుర్తించే ఈ అవార్డుల మూడో ఎడిషన్ 2025, ఏప్రిల్ 25న ముంబయిలో జరిగింది.

 ఇండియా ఆడియో సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రగ్యా పాలివాల్ గౌర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడియో రంగంలో వచ్చిన విప్లవాన్ని, భారత పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టర్ గా ఆకాశవాణి దేశ ప్రజల అభిరుచులకు అనుగుణంగా 'సమాచారం, అవగాహన, వినోదం' అనే లక్ష్యానికి ఎలా కట్టుబడి ఉందో డాక్టర్ గౌర్ వివరించారు. ఆకాశవాణి విశ్వసనీయత కోసం గట్టిగా నిలబడుతుందని, శబ్ద ప్రపంచంలో దిక్సూచిలా పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.


కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ప్రోగ్రామ్ 'నయీ సోచ్ నయీ కహానీ- ఎ రేడియో జర్నీ విత్ స్మృతి ఇరానీ' సీరియల్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది. 13 ఎపిసోడ్ల ఈ సిరీస్ ముఖ్యంగా మహిళల ధైర్యసాహసాలు, దృఢ సంకల్పం గురించి గొప్పగా చాటి చెప్పింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గత సంవత్సరం రాష్ట్రపతి భవనంలో రికార్డ్ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూతో ఈ సిరీస్ ముగిసింది.


న్యూస్ సర్వీసెస్ డివిజన్ ప్రసిద్ధ వీక్లీ ఫోన్-ఇన్ షో ‘ పబ్లిక్ స్పీక్‘ కు హెల్త్ అండ్ ఫిట్నెస్ విభాగంలో ఉత్తమ ఆడియో స్ట్రీమింగ్ ప్రోగ్రామ్ గా గుర్తింపు పొందింది. ఉత్తమ లేట్ నైట్ షో కేటగిరీలో ఛాయగీత్,  ఉత్తమ సెలబ్రిటీ షోగా ఉజాలే ఉంకీ యాడోన్ కే, ఉత్తమ ట్రావెల్ షోగా సఫర్ కాస్ట్ అవార్డులను గెలుచుకున్నాయి. తక్కువ వ్యవధి ఆడియో కంటెంట్‌లో తన సృజనాత్మక ప్రతిభను ప్రదర్శిస్తూ, ఆకాశవాణి ఉత్తమ ఇంటర్‌స్టీషియల్ అవార్డును కూడా గెలుచుకుంది.


ఇండియా ఆడియో సమ్మిట్, అవార్డుల గురించి…

ఇండియా ఆడియో సమ్మిట్ అండ్ అవార్డ్స్ అనేది భారత ప్రకాశవంతమైన విభాగంలో అసాధారణ ఆడియో ప్రతిభను గుర్తించి గౌరవించేందుకు చేపట్టిన మార్గదర్శక కార్యక్రమం.ఈ వేదిక, ఆడియో పుస్తకాల నుంచి పోడ్కాస్టులు, రేడియో, ఆడియో ప్రకటనలు, ఆధునిక సాంకేతికత వరకు విస్తరించిన విభిన్న వేదికలపై ప్రదర్శించిన అత్యంత ఆకర్షణీయమైన, సృజనాత్మక ఆడియో కంటెంట్‌ను గుర్తించి జరిపే వేడుక.  ఈ వేడుక కఠినమైన ఎంపిక ప్రక్రియను అనుసరిస్తూ, మార్గదర్శక విజయాలను న్యాయంగా, పక్షపాతరహితంగా గుర్తించే నమ్మదగిన వేదికను అందిస్తుంది.

 

***


(Release ID: 2124772) Visitor Counter : 8