బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు దిగుమతుల పర్యవేక్షణ (సీఐఎంఎస్) పోర్టల్ లో రిజిస్ట్రేషన్ ఫీజును హేతుబద్ధీకరించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
ఇతర దిగుమతి వ్యవస్థలకు అనుగుణంగా కొత్త ఫ్లాట్ ఫీజు నమూనా
ఏప్రిల్ 15 నుంచి కొత్త రుసుము నమూనా అమలు
प्रविष्टि तिथि:
17 APR 2025 3:15PM by PIB Hyderabad
బొగ్గు దిగుమతుల పర్యవేక్షణలో మరింత పారదర్శకత, సామర్థ్యాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ బొగ్గు దిగుమతి పర్యవేక్షణ పోర్టల్ (సీఐఎంఎస్) ను ప్రారంభించింది. బొగ్గు దిగుమతుల ప్రత్యామ్నాయాలకు సంబంధించిన నిర్ణయాలను ఆచితూచి తీసుకోవడంలో.. వాస్తవాధారిత పర్యవేక్షణల ద్వారా.. ప్రభుత్వ ఆత్మనిర్భర్ ఆశయ సాకార లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ పథకం కీలకం కాగలదు.
బొగ్గు దిగుమతి నివేదికల క్రమబద్ధీకరణ కోసం అభివృద్ధిపరచిన డిజిటల్ వేదిక సీఐఎంఎస్, విధాన రూపకల్పన, వివిధ రంగాల విశ్లేషణల కోసం అవసరమైన సమాచారాన్ని సకాలంలో, కచ్చితత్వంతో అందిస్తుంది. ఇకపై దేశ తీరాన్ని చేరే సరుకుల సమాచారాన్ని బొగ్గు దిగుమతిదార్లు సరుకు చేరిన వెంటనే, లేదా ముందస్తుగానే సీఐఎంఎస్ పోర్టల్ పై నమోదు చేయవలసి ఉంటుంది.
వ్యాపార సౌలభ్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు, దిగుమతి పర్యవేక్షణ ప్లాట్‌ఫాంలలో ఏకరూపత కోసం బొగ్గు మంత్రిత్వశాఖ సీఐఎంఎస్ పోర్టల్ రిజిస్ట్రేషన్ రుసుమును హేతుబద్ధీకరించింది.
15 ఏప్రిల్ నుండి అమలయ్యే నూతన రుసుము వ్యవస్థలో భాగంగా సరుకు పరిమాణంతో సంబంధం లేకుండా, ప్రతి లావాదేవీకి రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ. 500 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. గతంలో సరుకు పరిమాణాన్ని బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 500 నుంచి రూ. 1,00,000 వరకూ వసూలు చేసేవారు. రిజిస్ట్రేషన్ ఫీజులో చేపట్టిన ఈ హేతుబద్ధీకరణ, స్టీల్ దిగుమతి పర్యవేక్షణ వ్యవస్థ (ఎస్ఐఎంఎస్), నాన్-ఫెర్రస్ దిగుమతి పర్యవేక్షణ వ్యవస్థ (ఎన్ఎఫ్ఐఎంఎస్), కాగితం దిగుమతి పర్యవేక్షణ వ్యవస్థ (పీఐఎంఎస్) వంటి ఇతర పర్యవేక్షణ వ్యవవస్థలు అనుసరిస్తున్న ఫ్లాట్ ఫీజు నమూనాలకు అనుగుణంగా ఉంది.
కొత్త పద్ధతిలో దిగుమతిదారులు సీఐఎంఎస్ పోర్టల్ నుంచి ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ నెంబరును పొందవలసి ఉంటుంది. కస్టమ్స్ క్లియరెన్స్ సమయంలో ఆ నెంబరును బిల్ ఆఫ్ ఎంట్రీగా చూపవలసి ఉంటుంది. పెరుగుతున్న దేశ పారిశ్రామిక, ఇంధన అవసరాలకు అనుగుణంగా వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు, పారదర్శకతను పెంపొందించేందుకు, నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 2122592)
आगंतुक पटल : 39