ప్రధాన మంత్రి కార్యాలయం
భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి... నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
14 APR 2025 8:14AM by PIB Hyderabad
భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ సిద్ధాంతాలు, ఆదర్శాలు ‘వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్) ను, ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయంసమృద్ధ భారత్) ను సాకారం చేసే దిశగా సాగిస్తున్నకృషిని బలోపేతం చేసి, శరవేగంగా ముందుకు నడిపిస్తాయని ప్రధాని అన్నారు.
ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘భారత్ రత్న పూజ్య బాబాసాహెబ్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరి తరఫున ఆయనకు కోట్లాది వందనాలు. ఆయన అందించిన ప్రేరణతోనే సామాజిక న్యాయ స్వప్నాన్ని సాకారం చేయడానికి దేశం ప్రస్తుతం అంకితభావంతో కృషి చేస్తోంది. ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆదర్శాలు ఆత్మనిర్భర్ భారత్‌ను, వికసిత్ భారత్‌ను ఆవిష్కరించే దిశగా సాగుతున్న కృషిని బలోపేతం చేసి, శరవేగంగా ముందుకు నడిపిస్తాయి.’’
(रिलीज़ आईडी: 2121695)
आगंतुक पटल : 37
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam