ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ దరిపల్లి రామయ్య మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
Posted On:
12 APR 2025 1:09PM by PIB Hyderabad
శ్రీ దరిపల్లి రామయ్య మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు. లక్షలాది చెట్లను నాటి.. వాటి పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చిరస్మరణీయులని ప్రశంసించారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్ లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“దరిపల్లి రామయ్య గారు సుస్థిరత ప్రయత్నాలకు నాయకత్వం వహించిన మార్గదర్శిగా చిరస్మరణీయులు. ఆయన లక్షలాది మొక్కలు నాటి.. వాటి పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రకృతి పట్ల ఆయన చేసిన అవిశ్రాంత కృషి, తనకు గల మక్కువ.. భావి తరాల సంరక్షణ పట్ల ఆయన బాధ్యతకు నిదర్శనం. మన భూమిని పచ్చదనంతో నింపే ప్రయత్నంలో మన యువతకు సదా స్ఫూర్తినిస్తుంటారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. ఓం శాంతి”
(Release ID: 2121321)
Read this release in:
Odia
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada