మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని నివారించడానికి చేయికలిపిన ప్రభుత్వం, పౌల్ట్రీ పరిశ్రమ

బయోసెక్యూరిటీ చర్యలు, నిఘాను బలోపేతం చేయడం, పౌల్ట్రీ ఫారాలను తప్పనిసరిగా నమోదు చేయడం అనే త్రిముఖ వ్యూహాం అమలు

Posted On: 05 APR 2025 2:44PM by PIB Hyderabad

దేశంలో ఇటీవల వచ్చిన బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా)పై చర్చించడానికి మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని పశుసంవర్ధక, పాడిపరిశ్రమ విభాగం (డీఏహెచ్‌డీ) 2025 ఏప్రిల్ 4న దిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి, వ్యాధిని నియంత్రించేందుకు, దాని వ్యాప్తిని నిరోధించటానికి వ్యూహాలను తయారుచేసేందుకు జరిగిన ఈ భేటీకి డీఏహెచ్‌డీ కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ అధ్యక్షత వహించారు. ఇందులో శాస్త్రీయ నిపుణులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, విధాన నిర్ణేతలు పాల్గొన్నారు.

 

వివిధ భాగస్వాములతో సంప్రదింపులు జరిపి బర్డ్‌ఫ్లూను నివారించడానికి, నియంత్రించడానికి మూడంచెల వ్యూహాన్ని అనుసరించాలని డీఏహెచ్‌డీ నిర్ణయించింది. ఇందులో కఠినమైన బయోసెక్యూరిటీ చర్యలు ఉన్నాయి. దీనికోసం కోళ్ల ఫారాలు పరిశుభ్రత పద్ధతులను మెరుగుపరుచుకోవాలి. దీనితో పాటు వ్యాధి సంక్రమించే ప్రమాదాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు బయోసెక్యూరిటీ నిబంధనలు అనుసరించాలి. వ్యాధిని ట్రాక్ చేయటం, నియంత్రణను పెంచేందుకు పౌల్ట్రీ ఫారాలు నిఘాను బలోపేతం చేయాలి. వాటిని తప్పనిసరిగా నమోదు చేయాలి(అన్ని పౌల్ట్రీ ఫారాలు ఒక నెలలోపు రాష్ట్ర పశుసంవర్ధక శాఖల వద్ద నమోదు చేసుకోవాలి. ఈ ఆదేశాలను 100శాతం పాటించేలా చూడాలని పౌల్ట్రీ పరిశ్రమ భాగస్వాములను ప్రభుత్వం కోరింది.)

 

ఈ సమావేశంలో శ్రీమతి అల్కా ఉపాధ్యాయ మాట్లాడుతూ.. "ఆహార భద్రత, గ్రామీణ జీవనోపాధికి మన పౌల్ట్రీ రంగాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. బర్డ్ ఫ్లూపై పోరాటంలో కఠినమైన బయోసెక్యూరిటీ, శాస్త్రీయ నిఘా, బాధ్యతాయుతమైన పరిశ్రమ పద్ధతులు అనుసరించటం చాలా అవసరం” అని అన్నారు. ముందస్తు హెచ్చరిక, పర్యావరణ సంబంధిత నిఘా కోసం ఒక ముందస్తు నమూనా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్న్ని తెలియజేశారు. ఇది వ్యాధిని ముందస్తుగా గుర్తించటం, త్వరగా స్పందించటానికి వీలు కల్పిస్తుంది. తద్వారా వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించి పౌల్ట్రీ పరిశ్రమను కాపాడుతుంది. భోపాల్‌లోని ఐసీఏఆర్-ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ అభివృద్ధి చేసిన హెచ్9ఎన్‌2‌(లో పాథోజెనిక్ ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా-ఎల్‌పీఏఐ) టీకా వినియోగానికి డీఏహెచ్‌డీ అనుమతించింది. ఇది ఇప్పుడు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఒక జాతీయ అధ్యయనం ఆ టీకా ప్రభావాన్ని అంచనా వేయనుంది. భారత్‌లో హెచ్‌పీఏఐ(హై పాథోజెనిక్ ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా) విషయంలో టీకాను ఉపయోగించటాన్ని అనుమతించే అవకాశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ రంగంలో ఆర్థికంగా మరింత నష్టాన్ని నివారించేందుకు టీకాలు వేయటాన్ని ఒక వ్యూహంగా పరిగణించాలని పరిశ్రమ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెచ్‌పీఏఐ టీకాలు పూర్తి రోగనిరోధక శక్తిని అందించవని, వైరస్ వ్యాప్తిని మాత్రమే తగ్గిస్తాయని శాస్త్రీయ నిపుణులు పేర్కొన్నారు. ఈ సంక్లిష్టతల దృష్ట్యా విధాన నిర్ణయం తీసుకునే ముందు మరింత శాస్త్రీయ మూల్యాంకనం అవసరమని సమావేశం అంగీకరించింది. భారత్‌లో హెచ్‌పీఏఐ టీకా సాధ్యాసాధ్యాలను నిర్ణయించేందుకు విశ్లేషణాత్మక శాస్త్రీయ మదింపులను నిర్వహించాలని సమావేశం సిఫార్సు చేసింది. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అనుసరించి స్వదేశీ హెచ్‌పీఏఐ టీకాను అభివృద్ధి చేయడానికి పరిశోధన కూడా ప్రారంభమైంది.

గుర్తించనప్పటికీ వాటిని కూడా నిఘా పరిధిలోకి తీసుకొచ్చారు. అంటువ్యాధులను ఎదుర్కోవటానికి ప్రపంచం చేస్తున్న కృషికి తనవంతుగా హెచ్‌5‌ఎన్‌1 ఐసోలేట్‌లు, సంబంధిత నమూనాల సీక్వెన్సింగ్ డేటాను భారత్‌ అంతర్జాతీయ నెట్‌వర్క్‌లతో పంచుకుంది. వ్యాప్తిని నియంత్రించడానికి జాతీయ సంయుక్త వ్యాధి వ్యాప్తి ప్రతిస్పందన బృందం(నేషనల్ జాయింట్ అవుట్‌బ్రేక్‌ రెస్పాన్స్ టీం)తో పాటు కేంద్ర బృందాలను మోహరిస్తున్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖలు.. ఆరోగ్య, వన్యప్రాణి శాఖలతో సహా ఇతర సంబంధిత అధికారులతో క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏవియన్ ఇన్‌ఫ్లూ‌యెంజా వ్యాప్తిని అరికట్టేందుకు భారత్ ‌పరీక్షించు, చంపు(టెస్ట్ అండ్ కల్) విధానాన్ని అనుసరిస్తోంది. పశుసంవర్థక ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ పథకం(లైవ్‌స్టాక్ హెల్త్ అండ్ డిసీస్ కంట్రోల్ స్కీమ్) కింద బాధిత రైతులకు చంపిన పక్షులు, నాశనం చేసిన గుడ్లు, దాణా కోసం ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. ఇందులో ఖర్చులను కేంద్రం, రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో పంచుకుంటున్నాయి. 

 

 

 

 

 

 

 

 

 


(Release ID: 2119726) Visitor Counter : 20