గనుల మంత్రిత్వ శాఖ
గనుల అక్రమ త్రవ్వకాన్ని నిరోధించేందుకు జియో ట్యాగింగ్
Posted On:
02 APR 2025 2:20PM by PIB Hyderabad
Release ID: 2117703 final-bsr
గనుల మంత్రిత్వశాఖ
గనుల అక్రమ త్రవ్వకాన్ని నిరోధించేందుకు జియో ట్యాగింగ్
Posted On: 02 APR 2025 2:20PM by PIB Delhi
గనుల అక్రమ తవ్వకం (మైనింగ్) కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, నిరోధించడానికి ప్రభుత్వం జీఐఎస్, శాటిలైట్ ఇమేజరీ వంటి జియో-స్పేషియల్ టెక్నాలజీలను ఉపయోగించడం ప్రారంభించింది. గనుల మంత్రిత్వ శాఖ 2016 అక్టోబరులో మైనింగ్ సర్వైలెన్స్ సిస్టమ్ (ఎంఎస్ఎస్) ను ప్రారంభించింది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ మైనింగ్ కార్యకలాపాలను గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేయడం, అక్రమ మైనింగ్ సంఘటనలను తనిఖీ చేయడానికి లీజు సరిహద్దు వెలుపల 500 మీటర్ల వరకు ప్రాంతాన్ని పర్యవేక్షించడం దీని లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), గాంధీనగర్ లోని భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ (బీఐఎస్ఏజీ) సహకారంతో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) ద్వారా ఎంఎస్ఎస్ ను అభివృద్ధి చేశారు. 2016-17లో ఎంఎస్ఎస్ ప్రారంభమైనప్పటి నుంచి ఒడిశా సహా ప్రధాన ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేశారు. మైనింగ్ లీజులకు 500 మీటర్ల పరిధిలో భూమి నమూనా మార్పులను ఎంఎస్ఎస్ విశ్లేషిస్తుంది. తేడాలు కనిపిస్తే హెచ్చరికలు జారీ చేసి క్షేత్రస్థాయి పరిశీలన కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు.
ఒడిశా రాష్ట్రంలో కీలక ఖనిజాల నిల్వల వివరాలను అనుబంధం 1 లో చూడవచ్చు.
కీలక, వ్యూహాత్మక ఖనిజాల కోసం దేశీయ ఉత్పత్తిని పెంచడానికి అవకాశమున్న గనుల ప్రదేశాలను గుర్తించే అన్వేషణ కార్యక్రమాన్ని పెంచడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) 2024-25 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 195 ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులను చేపట్టింది. నేషనల్ మినరల్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్ ఎంఈటీ) ద్వారా ఖనిజ అన్వేషణకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. 2024-25 లో కీలకమైన, వ్యూహాత్మక ఖనిజ అన్వేషణ కోసం ఇప్పటివరకు 72 ప్రాజెక్టులకు ఎన్ఎంఈటీ నిధులు సమకూర్చింది. అన్వేషణలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి గనుల మంత్రిత్వ శాఖ 32 ప్రైవేట్ అన్వేషణ ఏజెన్సీలను (ఎన్పీఈఏ ) నోటిఫై చేసింది. ఈ సంస్థలు ఎన్ఎంఈటీ నిధులతో అన్వేషణ ప్రాజెక్టులను చేపడుతున్నాయి.
గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం - 1957ను 2015లో సవరించి ప్రధాన ఖనిజాలకు సంబంధించి ఖనిజ రాయితీల మంజూరు కోసం పారదర్శకమైన, వివక్ష లేని ఈ-వేలం పద్ధతిని ప్రవేశపెట్టారు. ఒడిశా ప్రభుత్వం ఇప్పటివరకు 48 ఖనిజ బ్లాక్ లను వేలం వేయగా, ఒడిశాలోని కీలక, వ్యూహాత్మక ఖనిజాలకు చెందిన 3 మినరల్ బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది.
ఖనిజ సంరక్షణ, ఖనిజాల క్రమబద్ధమైన అభివృద్ధి, ప్రాస్పెక్టింగ్ లేదా మైనింగ్ కార్యకలాపాల వల్ల సంభవించే ఏదైనా కాలుష్యాన్ని నివారించడం లేదా నియంత్రించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం ఎంఎండీఆర్ చట్టం - 1957 సెక్షన్ -18 కింద ఖనిజ సంరక్షణ, అభివృద్ధి నిబంధనలను (ఎంసీడీఆర్- 2017) రూపొందించారు. ఎంసీడీఆర్ (సవరణ) 2017లోని రూల్ 12(1) ప్రకారం ఖనిజ నిక్షేపాల క్రమబద్ధమైన అభివృద్ధి, ఖనిజాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణకు వీలుగా ప్రాస్పెక్టింగ్, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించాలి. సుస్థిర మైనింగ్ కోసం ఎంసీడీఆర్ 2017లోని చాప్టర్ 5 కింద రూల్ 35 నుంచి 44 వరకు పొందుపరిచారు. జాతీయ ఖనిజ విధానం - 2019లో గనుల త్రవ్వకం ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాకుండా, సుస్థిర అభివృద్ధి ప్రణాళిక (ఎస్డిఎఫ్) ను అమలు చేయడానికి, మంత్రిత్వ శాఖ గనులకు స్టార్ రేటింగ్ వ్యవస్థను రూపొందించింది.
***
(Release ID: 2117922)
Visitor Counter : 6