ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో మే 1 నుంచి ఎగుమతి, దిగుమతులకు సంబంధించి ప్రయాణికుల వ్యక్తిగత సామానుల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ ను ప్రవేశపెట్టనున్న సీబీఐసీ


ఢిల్లీ, ముంబయి, కోల్ కతా, చెన్నై, కొచ్చి, కోయంబత్తూరు, బెంగళూరు, హైదరాబాదు, జైపూర్ నగరాల్లోని తొమ్మిది విమానాశ్రయాల్లో విలువైన రాళ్ళు, ఆభరణాలను తీసుకువెళ్ళేందుకు ప్రయాణికులకు అనుమతి

ఢిల్లీ, ముంబయి, కోల్ కత్తా , చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, జైపూర్ నగరాల్లోని ఏడు విమానాశ్రయాల్లో విదేశాల నుంచి విలువైన రాళ్ళు, ఆభరణాలను తెచ్చుకునేందుకు ప్రయాణికులకు అనుమతి

ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాల్లోని నాలుగు విమానాశ్రయాల్లో యంత్ర పరికరాలకు సంబంధించి నమూనాలను తీసుకువెళ్ళేందుకు ప్రయాణికులకు అనుమతి

Posted On: 01 APR 2025 6:06PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖరెవెన్యూ విభాగంలోని కేంద్ర పరోక్ష పన్నులుకస్టమ్స్ విభాగాలు 01.05.2025 నుంచి ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో విమాన ప్రయాణికుల వ్యక్తిగత లగేజీ విధానంలో రత్నాలుఆభరణాల (నమూనాలబిల్ ఆఫ్ ఎంట్రీ లేదా షిప్పింగ్ బిల్లుల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్‌ను ప్రవేశపెడుతోంది.

వ్యక్తిగత సమాన్ల కేటగిరీలో విదేశీ వాణిజ్య విధానం-2023 (ఎఫ్టీపీ),  హ్యాండ్‌బుక్ ఆఫ్ ప్రొసీజర్స్-2023 (హెచ్బీపీనిబంధనలకు లోబడి ఈ ఎగుమతి/దిగుమతులు ఉంటాయి.

తొమ్మిది విమానాశ్రయాల్లో (ఢిల్లీముంబయికోల్‌కతాచెన్నైకొచ్చికోయంబత్తూర్బెంగళూరుహైదరాబాద్జైపూర్ఎగుమతుల విషయంలో హెచ్బీపీ పేరా 4.87లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగానూదిగుమతుల విషయమై

పేరా 4.88 నిబంధనలకు అనుగుణంగానూప్రయాణికులను అనుమతిస్తారుయంత్ర నమూనాలు లేదా ప్రోటోటైపులు విషయంలో తొలుత బెంగళూరుచెన్నైఢిల్లీ,  ముంబయి విమానాశ్రయాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ తో కూడుకున్న క్రమబద్ధమైన విధానం ఇటువంటి లావాదేవీల పద్ధతినిప్రత్యేకించి రత్నాలుఆభరణాలుఉన్నత శ్రేణి ఉత్పత్తుల తయారీకి సంబంధించి సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

 

***


(Release ID: 2117642) Visitor Counter : 11