భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ
Posted On:
01 APR 2025 4:20PM by PIB Hyderabad
ఫేమ్ - II పథకం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల (ఈవీపీసీఎస్) ఏర్పాటుకు రూ.839 కోట్లు కేటాయించారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంత్రాల్లో ఈవీపీసీఎస్‌లను ఏర్పాటు చేసేందుకు రూ. 2,000 కోట్ల నిధులు కేటాయించారు.
విద్యుత్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ మార్గదర్శకాలు - 2024ను గతేడాది సెప్టెంబర్ 17న విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణలో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం పాత్రను ఈ మార్గనిర్దేశకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటును లైసెన్స్ అవసరం లేని ప్రక్రియగా గుర్తించి వ్యాపారాన్ని సులభతరం చేశారు.
విద్యుత్ వాహనాలకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)ని దిగువ పేర్కొన్న విధానంలో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది:
-
ఇంజనీరింగ్ పరిశోధన-అభివృద్ధి, వస్తు రూపకల్పన-అభివృద్ధికి చేసే వ్యయాన్ని పీఎల్ఐ ఏసీసీ పథకం కింద అర్హత కలిగిన పెట్టుబడిగా గుర్తిస్తారు.
-
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన యంత్ర పరికరాల పథకం ద్వారా ఈవీలకు సంబంధించిన వాటితో సహా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 80 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ఐఐటీలు, ఐఐఎస్సీలు లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. మిగిలిన 20 శాతం మొత్తాన్ని ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యులుగా ఉన్న పరిశ్రమలు భరిస్తాయి.
లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ లిఖితపూర్వకంగా ఈ రోజు అందించారు.
***
(Release ID: 2117496)
Visitor Counter : 15