హోం మంత్రిత్వ శాఖ
నేరాలు, నేరస్తులను గుర్తించే యంత్రాంగం, విధానం
Posted On:
01 APR 2025 3:47PM by PIB Hyderabad
నేరాలు, నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, పంచుకొనే ప్రక్రియను క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) సులభతరం చేస్తుంది. దీని వల్ల రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసులు, సెంట్రల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, దేశ పౌరులకు ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. వాటి వివరాలు:
పోలీసులు, సెంట్రల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ (సీఎల్ఈఏ)లకు కలిగే ప్రయోజనాలు:
ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్‌లు, దర్యాప్తు వివరాలు, చార్జిషీటు, కోర్టు తీర్పులు, అప్పీలు, చలాన్లు/రిజిస్టర్లు తదితర పోలీసు ప్రక్రియలను కంప్యూటరీకరించడం.
నేరం, నేరస్తులకు సంబంధించిన సమాచారాన్ని దేశ/రాష్ట్ర డేటాబేస్‌లో శోధించే సౌలభ్యం
న్యాయాన్ని సమర్థంగా అందించేందుకు పోలీసు, సెంట్రల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ (సీఎల్ఈఏ)లు, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్ మధ్య పరస్పరం సమచారాన్ని పంచుకొనే వీలు
డిజిటల్ పోలీస్ పోర్టల్, సెంట్రల్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా ప్రజలకు జాతీయ స్థాయిలో అందించే సేవలు:
తప్పిపోయిన వ్యక్తులను వెతకడం
వాహనాలకు ఎన్వోసీని రూపొందించడం
ప్రకటించిన నేరస్తుల సమాచారం
సమీప పోలీస్ స్టేషన్ సమాచారం
వీటికి అదనంగా దిగువ పేర్కొన్న 9 తప్పనిసరి సేవలను పౌరులకు రాష్ట్రాల సీసీటీఎన్ఎస్ సిటిజన్ పోర్టళ్లు అందిస్తాయి:
సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేయడం
ఫిర్యాదు ప్రస్తుత స్థితిని తెలుసుకోవడం
ఎఫ్ఐఆర్ కాపీలను పొందడం
అరెస్టయిన వ్యక్తులు/వాంటెడ్ నేరస్తుల వివరాలు
తప్పిపోయిన/అపహరణకు గురైన వ్యక్తుల వివరాలు
దొంగిలించిన/రికవరీ చేసిన వాహనాలు, ఆయుధాలు, ఇతర ఆస్తుల వివరాలు
వివిధ రకాల నిరభ్యంతర పత్రాల జారీ/పునరుద్ధరణ (ఊరేగింపు, ఉత్సవం/ప్రదర్శన, నిరసన/సమ్మె తదితరమైనవి)కు అనుమతి కోరడం
సేవకులు, ఉపాధి, పాస్‌పోర్టు, సీనియర్ సిటిజన్ రిజిస్ట్రేషన్ తదితర అంశాల్లో ధ్రువీకరణ కోరడం
సమాచారం పంచుకోవడానికి, అవసరమైన ఫారాలను పౌరులు డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం
(సి) ఈ ఏడాది ఫిబ్రవరి 1 నాటికి దేశవ్యాప్తంగా 17,171 పోలీసు స్టేషన్లు సీసీటీఎన్ఎస్‌కు అనుసంధానమయ్యాయి.
లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.
***
(Release ID: 2117366)
Visitor Counter : 15