సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ద్వారకలో సముద్రజలం అడుగు భాగంలో అన్వేషణ

Posted On: 27 MAR 2025 4:11PM by PIB Hyderabad

ద్వారకలోనూ, బేట్ ద్వారకలోనూ సముద్ర తీరానికి దూరంగా జలం అట్టడుగు భాగంలో కొనసాగిస్తున్న అన్వేషణ కార్యకలాపాల ముఖ్యోద్దేశం జలంలో మునిగిన పురావస్తు శిథిల వస్తు సముదాయాన్ని వెతకడం, అక్షరబద్ధం చేయడం, అధ్యయనం నిర్వహించడంతోపాటు పురావస్తు శాస్త్రజ్ఞులకు శిక్షణను ఇవ్వడం. తిరిగి రాబట్టిన వస్తువులు ఎంత పురాతనమైనవన్న విషయాన్ని నీటి అడుగున పేరుకున్న పురావస్తువులు, సముద్ర నిక్షేపాలను శాస్త్రీయ పద్దతిలో విశ్లేషించి మరీ రూఢిపరుచుకోవడం సైతం ఈ అన్వేషణ కార్యకలాపాల ఉద్దేశమే.
పురావస్తు సంబంధిత పరిశోధన, క్షేత్రీయ కార్యక్రమాలకంటూ ప్రత్యేకంగా నిధిని భారతీయ పురావస్తు సంబంధ సర్వే సంస్థకు చెందిన వేర్వేరు శాఖలు, క్షేత్ర కార్యాలయాలకు, అండర్‌వాటర్ ఆర్కియాలజీ వింగ్ (యూఏడబ్ల్యూ)కు కేటాయిస్తారు.యూఏడబ్ల్యూ కూడా ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెటును ఉపయోగించుకొని, క్షేత్రీయ కార్యక్రమాలు, పరిశోధనతోపాటు వేర్వేరు కార్యకలాపాల్ని నిర్వహిస్తూ ఉంటుంది. క్షేత్రీయ కార్యక్రమాల కోసం మొదట రూ.10 లక్షలను  ప్రస్తుతానికి కేటాయించారు.
అవసరాలను బట్టి రిమోట్ సెన్సింగ్ పరికరాలు సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని  యూఏడబ్ల్యూ  ఉపయోగిస్తూ పురావస్తు సంబంధ అన్వేషణను, పరిశోధనలను  ఒక క్రమపద్ధతిలో నిర్వహిస్తూ ఉంటుంది. సముద్రంలో మునిగి అడుగు భాగానికి పోవడానికీ, అన్వేషించడానికీ, కనుగొన్న విషయాలను అక్షరబద్ధం చేయడానికీ ఇప్పుడు కొనసాగిస్తున్న క్షేత్రీయ కార్యక్రమాలలో ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక , పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ రాజ్య సభలో ఈ రోజు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.

 

***


(Release ID: 2116063) Visitor Counter : 13