ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి
Posted On:
27 MAR 2025 2:33PM by PIB Hyderabad
శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. సమాజంలో దగాపడ్డ వర్గాల అభ్యున్నతితోపాటు సమానత్వం, కరుణ, న్యాయం.. వంటి విలువలను పెంపొందింపచేయడానికి శ్రీ ఠాకుర్ కృషి చేశారంటూ శ్రీ మోదీ ప్రశంసించారు. ఈ ఏడాది మతువా ధర్మ మహా మేళాకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో:
‘‘శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్‌కు ఆయన జయంతి సందర్భంగా నివాళులు. సేవ చేయడం, ఆధ్యాత్మికత.. వీటి ప్రాముఖ్యాన్ని ఆయన ఉద్బోధించి, అసంఖ్యాక ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు. సమాజంలో మోసానికి గురైన వర్గాల అభ్యున్నతికీ, సమానత్వం, కరుణ, న్యాయం.. ఈ విలువలను పెంపొందింపచేయడానికీ ఆయన తన జీవనాన్ని అంకితం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఠాకుర్‌నగర్‌ను, బంగ్లాదేశ్‌లో ఓరకాండీని నేను సందర్శించి, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాను. ఆ సందర్భాలను నేను ఎన్నటికీ మరచిపోను.
మతువా సముదాయ వైభవోపేత సంస్కతిని కళ్లెదుట నిలిపే మతువా ధర్మ మహా మేళా 2025 ( #MatuaDharmaMahaMela2025)కు నా శుభాకాంక్షలు. మతువా సముదాయం సంక్షేమానికి మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మరి మేం రాబోయే కాలంలో కూడా వారి శ్రేయం కోసం అలుపెరుగక పని చేస్తూనే ఉంటాం.
జై హరిబోల్. @aimms_org ” అని పేర్కొన్నారు.
"শ্রী শ্রী হরিচাঁদ ঠাকুরের জন্মজয়ন্তীতে শ্রদ্ধাঞ্জলি। তিনি সেবা ও আধ্যাত্মিকতার ওপর জোর দিয়েছিলেন। তাই, অগুণতি মানুষের হৃদয়ে তিনি বেঁচে আছেন। প্রান্তিক মানুষের উন্নয়ন এবং সাম্য, করুণা ও বিচার সুনিশ্চিত করার লক্ষ্যে তিনি জীবন উৎসর্গ করেছিলেন। তাঁর প্রতি শ্রদ্ধাজ্ঞাপনের উদ্দেশ্যে পশ্চিমবঙ্গের ঠাকুরনগর ও বাংলাদেশের ওড়াকান্দিতে আমার সফর আমি ভুলব না।
#MatuaDharmaMahaMela2025 এর প্রতি শুভেচ্ছা রইল। মতুয়া সংস্কৃতির গৌরবোজ্জ্বল দিক গুলিকে এই মেলা তুলে ধরবে। মতুয়া সমাজের কল্যানের লক্ষ্যে সরকার বিভিন্ন উদ্যোগ নিয়েছেন। আগামীতেও আমরা তাঁদের ভাল'র জন্যে অনলসভাবে কাজ করে যাব।
জয় হরিবোল!
@aimms_org"
***
MJPS/SR
(Release ID: 2115740)
Visitor Counter : 34
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam