సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ విత్తనాల బ్రాండ్

Posted On: 25 MAR 2025 1:35PM by PIB Hyderabad

మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఎంఎస్సీఎస్చట్టం 2002 ప్రకారం భారతీయ బీజ శాకరీ సమితి లిమిటెడ్‌ (బీబీఎస్ఎస్ఎల్)ను సహకార మంత్రిత్వ శాఖ నెలకొల్పిందిపంటల దిగుబడి పెంచే ఉద్దేశంతో సహకార వ్యవస్థ ద్వారా ‘భారత్ బీజ్’ పేరుతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిసేకరణపంపిణీ ప్రక్రియలను ఈ సంస్థ చేపడుతుందిఇప్పటి వరకు 19,674 సహకార సంఘాలు బీబీఎస్ఎస్ఎల్‌లో సభ్యత్వం పొందాయివాటిలో 334 సహకార సంఘాలు జార్ఖండ్‌కు చెందినవే ఉన్నాయిబీబీఎస్ఎస్ఎన్ఎల్‌కు విత్తన లైసెన్స్‌ను జార్ఖండ్ ప్రభుత్వం జారీ చేసిందిఅధిక నాణ్యత కలిగిన విత్తనాలను జార్ఖండ్‌లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సకాలంలో చేరవేసేందుకు సమర్థవంతమైన రవాణా సదుపాయాలను బీబీఎస్ఎస్ఎల్ ఏర్పాటు చేసింది.

నాణ్యమైన విత్తనాలను ఉపయోగించడంపై రైతులకు అవగాహన కల్పించేందుకు వివిధ పథకాల కింద రాష్ట్ర వ్యవసాయ విభాగాలు తమ వ్యవసాయ విస్తరణ సేవల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయివాటిలో శిక్షణ కార్యక్రమాలువర్క్‌షాపులువ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలు (ఎఫ్‌ఎల్‌డీ), క్లస్టర్ స్థాయిలో వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలు (సీఎఫ్ఎల్‌డీ)తో సహా ఇతర ప్రదర్శనా కార్యక్రమాలురైతు శిక్షణరైతు క్షేత్ర పాఠశాలలను నిర్వహిస్తాయిఅలాగే దిగువ పేర్కొన్న పద్ధతుల ద్వారా నాణ్యమైన భారత్ బీజ్ బ్రాండ్ విత్తనాల వాడకాన్ని పెంచడంతో పాటు చిన్నసన్నకారు రైతులు వీటిని స్వీకరించేలా అవగాహన పెంచాలని బీబీఎస్ఎస్ఎల్ నిర్ణయించింది.

    1. సామాజిక మాధ్యమంబీబీఎస్ఎస్ఎల్ వెబ్సైట్ ద్వారా అవగాహనా కార్యక్రమం.

    2. వివిధ స్థాయుల్లో రైతు సమావేశాల నిర్వహణ.

    3. ప్రాంతీయంగా వర్క్‌షాపులుసెమినార్లుసదస్సుల నిర్వహణ.

    4. జాతీయరాష్ట్రప్రాంతీయ స్థాయుల్లో ప్రదర్శనలు నిర్వహించడంప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం.

మార్కెట్లో నాణ్యమైన విత్తనాల అమ్మకాలను క్రమబద్ధీకరించేందుకు విత్తన చట్టం-1996, విత్తన నియమాలు-1968, విత్తన (నియంత్రణఉత్తర్వులు-1983 లో సరిపడినన్ని నిబంధనలు ఉన్నాయిఈ చట్టాలు నాణ్యతను పరీక్షించి నాణ్యత లేని/నకిలీ విత్తనాల అమ్మకాలను అడ్డుకొనే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది.

ఏడాది కాలం ముందే సమర్పించిన బ్రీడర్ ఇండెంట్ ఆధారంగా రైతులకు పంపిణీ చేయడానికిధ్రువీకరించిన విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన బ్రీడర్ విత్తనాలను ప్రభుత్వప్రైవేటు విత్తన సంస్థలకు వ్యవసాయంరైతు సంక్షేమ మంత్రిత్వ విభాగంవ్యవసాయం రైతు సంక్షేమ శాఖ అందజేస్తాయి.

నకిలీ విత్తనాల పర్యవేక్షణ కోసంవ్యవసాయరైతు సంక్షేమ శాఖ- 2023 ఏప్రిల్ 19న సాధీ పోర్టల్ ను ప్రారంభించిందిదీని ద్వారా విత్తనాలకు సంబంధించిన పూర్తి పారదర్శకత సుసాధ్యం అయిందినూక్లియస్బ్రీడర్ఫౌండేషన్దశల్లో విత్తనాల జన్యు నాణ్యతను ప్రతిభావంతంగా పరీక్షిస్తున్నారుమొత్తం విత్తన సరఫరా వ్యవస్థలోని విత్తన డీలర్లుపంపిణీదారులతో సహా ప్రైవేటు ఏజెన్సీలను సాథీ పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(Release ID: 2114920) Visitor Counter : 24