జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

తమిళనాడు తిరునల్వేలిలో ప్రాణభయంతో చేసిన ఫిర్యాదుని పట్టించుకోకపోవడంతో హత్యకు గురైన వ్యక్తి కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్.హెచ్.ఆర్.సీ


స్థానిక వక్ఫ్ భూములకి వ్యతిరేకంగా సాగుతున్న కేసులకు ఆ వ్యక్తి మద్దతు ఉన్నట్లు నివేదికల వెల్లడి
కేసుకు సంబంధించిన అన్ని వివరాలతో నివేదికను నాలుగు వారాల్లోగా సమర్పించాలని రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్లకు కమిషన్ ఆదేశాలు

Posted On: 25 MAR 2025 10:58AM by PIB Hyderabad

తమిళనాడు తిరుల్వేలి జిల్లాలో పట్టపగలు విశ్రాంత పోలీసు సబ్ ఇస్పెక్టర్ హత్య జరిగిందన్న మీడియా నివేదికని జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటో విచారణకు స్వీకరించిందిస్థానిక వక్ఫ్ భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న అతడిని హత్య చేస్తామంటూ కొందరు బెదిరించినట్లు సమాచారంకుట్రదారులతో కుమ్మక్కైన పోలీసులు వారికి వ్యతిరేకంగా ఎటువంటి చర్య తీసుకోవడం లేదని కూడా మాజీ ఎస్పీ గతంలో ఆరోపించారు.  

నివేదికలోని విషయాలు నిజమని తేలితేబాధితుడి మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగినట్లేనని కమిషన్ వ్యాఖ్యానించిందిదరిమిలాకేసుకు సంబంధించి అన్ని వివరాలతో నాలుగు వారాల్లోగా తనకు నివేదిక సమర్పించాలని తిరునల్వేలి జిల్లా కలెక్టర్డీజీపీలకు కమిషన్ ఆదేశించింది.

బాధితుడు చేసిన ఫిర్యాదు పట్ల పోలీసుల ఉదాసీనతనిర్లక్ష్యాలే అతడి హత్యకు దారితీశాయని బాధితుడి కుటుంబం ఆరోపిస్తున్నట్లు మార్చి 19న వెలువడిన మీడియా కథనాల సమాచారం.

 

***


(Release ID: 2114811) Visitor Counter : 24