ఉక్కు మంత్రిత్వ శాఖ
ఆర్ఐఎన్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికకు ఆమోదం
Posted On:
21 MAR 2025 1:54PM by PIB Hyderabad
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) కార్యకలాపాలను కొనసాగించడానికి, ఆ సంస్థను మనుగడలో ఉంచడానికి ఆర్ఐఎన్ఎల్‌లో ఈక్విటీ/ ప్రిఫరెన్షియల్ మూలధనం రూపాల్లో రూ.11,440 కోట్లను పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కంపెనీ కూడా నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సాంకేతిక, ఆర్థిక పనితీరును మెరుగుపరచడం, సామర్థ్యాన్ని మెరుగైన రీతులలో ఉపయోగించుకోవడం, స్థిర వ్యయాలను క్రమబద్ధీకరించడం వంటి చర్యలపై దృష్టిని కేంద్రీకరించింది. ఇది 2017 సంవత్సరంలో రూపొందించిన జాతీయ ఉక్కు విధానం లక్ష్యాలకు అనుగుణంగా ఉంది.
ఈ సమాచారాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ రాజ్య సభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2113742)
Visitor Counter : 27