పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెట్రోలియం వ్యూహాత్మక నిల్వలను పెంచనున్న ప్రభుత్వ

Posted On: 20 MAR 2025 3:36PM by PIB Hyderabad

 ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వు లిమిటెడ్ (ఐఎస్‌పీఆర్ఎల్పేరుతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సంస్థను నెలకొల్పిఈ సంస్థ ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల్లో 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపెట్రోలియం వ్యూహాత్మక నిల్వల (ఎస్‌పీఆర్)ను ఏర్పాటు చేసిందిఆ మూడు ప్రాంతాలు.. విశాఖపట్నంమంగళూరుపాదుర్విశాఖపట్నంలో ఎస్‌పీఆర్ సామర్థ్యం 1.33 ఎంఎంటీమంగళూరులో ఎస్‌పీఆర్ సామర్థ్యం 1.5 ఎంఎంటీ కాగాపాదుర్‌లో ఎస్‌పీఆర్ సామర్థ్యం 2.5 ఎంఎంటీగా ఉంది.   

ఎస్‌పీఆర్ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి, 2021 జూలైలో ఒడిశాలోని చాందీఖోల్ లో (4 ఎంఎంటీ), కర్నాటకలోని పాదుర్‌లో (2.5 ఎంఎంటీ).. ఈ రెండు చోట్ల కలిపి 6.5 ఎంఎంటీ నిల్వ సామర్థ్యంతో రెండు అదనపు వాణిజ్యవ్యూహాత్మక పెట్రోలియం రిజర్వు కేంద్రాలను ప్రభుత్వప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  సాంకేతికంగానువాణిజ్యం రీత్యా ఎంతవరకు సాధ్యమన్న ప్రాతిపదికను ఆధారం చేసుకొని ఈ నిల్వ సామర్థ్యాలను పెంచేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వంచమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలుఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటాయిఅదనంగా పెట్రోలియం నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కొత్త స్థలాలను నిర్ధారించడం నిరంతరంగా సాగే ప్రక్రియ.

ముడి చమురు సరఫరా సురక్షితంగా ఉండేలాగా, అంతేకాక ఒకే చోటు నుంచి ముడి చమురు లభ్యతపై ఆధారపడడంలో ఉన్న నష్టభయాన్ని (రిస్క్తగ్గించడానికి దేశ ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలువాటి ముడి చమురు కొనుగోళ్లలో వైవిధ్యానికి ప్రాముఖ్యాన్నిచ్చాయిఅవి మధ్య ప్రాచ్యంఆఫ్రికాఉత్తర అమెరికాదక్షిణ అమెరికా వంటి విభిన్న భౌగోళిక ప్రాంతాల నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నాయిదీనికి అదనంగాప్రభుత్వం ఆస్ట్రేలియాఅమెరికాయూఏఈ నుంచి కూడా ఎల్ఎన్‌జీని దిగుమతి చేసుకోవడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసిందిఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడడానికిధరలలో ఒడుదొడుకుల బారిన పడకుండా తప్పించుకోవడానికి ఎల్ఎన్‌జీ కొనుగోళ్ల విషయంలో వేర్వేరు దీర్ఘకాలిక ఒప్పందాలను కూడా భారత్ కుదుర్చుకుంది.

శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం స్వచ్ఛ, పర్యావరణానుకూల ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ వ్యూహంలో ఇతర అంశాలతోపాటు ఈ కింది విషయాలు  కూడా భాగంగా ఉన్నాయి:

· దేశవ్యాప్తంగా ఇంధనం, ఫీడ్‌స్టాక్ రూపంలో సహజవాయువు ఉపయోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యామ్నాయ గిరాకీని పెంచడంతద్వారా ఆర్థిక వ్యవస్థలో సహజవాయువు వాటాను పెంచి, గ్యాస్ ఆధారిత ఆర్థికవ్యవస్థ దిశగా పయనించడం.  

· ఇథనాల్, రెండో తరం ఇథనాల్కంప్రెస్‌డ్ బయో గ్యాస్బయోడీజిల్గ్రీన్ హైడ్రోజన్ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీవంటి పునరుత్పాదక, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం.

· రిఫైనరీ ప్రక్రియలో మెరుగుదల, ఇంధన దక్షతను, సంరక్షణను ప్రోత్సహించడం.

· వివిధ విధాన కార్యక్రమాల అమలు మాధ్యమం ద్వారా చమురుసహజ వాయువు ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు సాగుతున్నాయిఆటోమోటివ్ ఇంధనం రూపంలో కంప్రెస్‌డ్ బయోగ్యాస్ (సీబీజీవినియోగాన్ని పెంచడానికి సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్ టువార్డ్స్ అఫర్డబుల్ ట్రాన్స్‌పోర్టేషన్ (ఎస్ఏటీఏటీకార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.

·  దేశవ్యాప్తంగా బయోఫ్యూయల్స్ వినియోగాన్ని పెంచడానికి ఇథనాల్ కలిపిన పెట్రోలు (ఈబీపీకార్యక్రమం వంటి వేర్వేరు కార్యక్రమాలను మొదలుపెట్టారుదీనిలో భాగంగా ఓఎంసీలు ఇథనాల్‌ కలిపిన పెట్రోలును విక్రయిస్తున్నాయి.  బయోడీజిల్ బ్లెండింగ్ ప్రోగ్రాంలో భాగంగా బయోడీజిల్‌ను డీజిల్‌తో కలిపే పనిని కూడా చేపట్టారు. 

 

***


(Release ID: 2113473) Visitor Counter : 42


Read this release in: English , Urdu , Hindi , Tamil