భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

అధికరణ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950, సంబంధిత సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం


ఎపిక్ ను ఆధార్ తో అనుసంధానించనున్న ఎన్నికల సంఘం

యూఐడీఏఐ, ఎన్నికల సంఘం నిపుణుల మధ్య త్వరలో సాంకేతిక సంప్రదింపులు

Posted On: 18 MAR 2025 5:47PM by PIB Hyderabad

ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో కమిషనర్లు డాక్టర్ సుఖ్ బీర్ సింగ్ సంధుడాక్టర్ వివేక్ జోషితో కూడిన భారత ఎన్నికల సంఘం కేంద్ర హోం శాఖ కార్యదర్శిశాసన శాఖ కార్యదర్శిఎలక్ట్రానిక్స్సమాచార సాంకేతికత శాఖ కార్యదర్శియూఐడీఏఐ సీఈవోభారత ఎన్నికల సంఘం సాంకేతిక నిపుణులతో న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్ లో సమావేశం నిర్వహించింది.

భారత రాజ్యాంగంలోని అధికరణ 326 ప్రకారంఓటు హక్కు భారత పౌరుడికి మాత్రమే లభిస్తుండగా.. ఆధార్ కార్డే పౌరుడి గుర్తింపును నిర్ధారిస్తుంది.

కాబట్టిరాజ్యాంగంలోని అధికరణ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 23(4), 23(5), 23(6) నిబంధనలతోపాటు రిట్ పిటిషన్ (సివిల్నం177/2023లో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఎపిక్ ను ఆధార్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు.

అందుకు అనుగుణంగా.. యూఐడీఏఐభారత ఎన్నికల సంఘం సాంకేతిక నిపుణుల మధ్య సాంకేతిక సంప్రదింపులు త్వరలోనే మొదలుకానున్నాయి.

 

***


(Release ID: 2112591) Visitor Counter : 25