సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఈస్పోర్ట్స్ టోర్నమెంట్ గేమర్ల అత్యున్నత కదనసీమ
Posted On:
11 MAR 2025 6:51PM
|
Location:
PIB Hyderabad
గేమర్ల అత్యున్నత కదనసీమ
పరిచయం
అగ్రశ్రేణి క్రీడాకారులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి అత్యున్నత స్థాయిలో పోటీలు నిర్వహించడం ద్వారా.. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఈస్పోర్ట్స్ రంగంలో ‘ఈస్పోర్ట్స్ చాంపియన్ షిప్’ కీలక పాత్ర పోషిస్తోంది. ఈస్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈఎస్ఎఫ్ఐ) నిర్వహిస్తున్న ఈస్పోర్ట్స్ చాంపియన్ షిప్ 2025 ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)లో ముఖ్యమైన అంశం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీ సృజనాత్మకతను ప్రదర్శించడానికి, ప్రతిభను ప్రోత్సహించడానికి, దేశంలో ఈస్పోర్ట్స్ భవిష్యతను తీర్చిదిద్దడానికి అసాధారణ వేదికగా నిలుస్తుంది.
మొత్తం మీడియా, వినోద రంగాలను ఏకీకృతం చేసే విశిష్ట కూడలిగా, అనుసంధాన వేదికగా ప్రపంచ దృశ్య, శ్రవ్య వినోద సదస్సు (వేవ్స్) తొలి ఎడిషన్ నిలవబోతోంది. ప్రపంచవ్యాప్త మీడియా, వినోద రంగాన్ని భారత్ వైపు మళ్లించి.. ఇక్కడి మీడియా, వినోద రంగంతోనూ దేశంలోని కళాకారులతోనూ అనుసంధానించే ముఖ్య అంతర్జాతీయ కార్యక్రమమిది.
ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ , జియో వరల్డ్ గార్డెన్స్ లో మే 1 నుంచి 4 వరకు ఈ సదస్సు జరగనుంది. సమాచార ప్రసారం- టీవీ కార్యక్రమాలు, ఏవీసజీ-ఎక్స్ఆర్, డిజిటల్ మీడియా- ఆవిష్కరణ, సినిమాలు- వేవ్స్ అనే నాలుగు అంశాలు కార్యక్రమానికి నాలుగు ముఖ్య ప్రాతిపదికలుగా ఉన్నాయి. ఈ రంగానికి నేతృత్వం వహిస్తున్న ప్రముఖులు, సృజనకారులు, సాంకేతిక నిపుణులను ఒకే వేదికపైకి చేర్చి భారత వినోద పరిశ్రమ భవితను వేవ్స్ ఘనంగా చాటబోతోంది.
వేవ్స్ లో రెండో కీలక ప్రాతిపదిక అయిన ఏవీజీసీ-ఎక్స్ ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ – ఎక్స్టెండెడ్ రియాల్టీ)లో ఈస్పోర్ట్స్ ముఖ్యమైన అంశం. ఫిబ్రవరి 15 నాటికి మొత్తం 35,008 మంది టోర్నమెంట్ లో పాల్గొన్నారు. ఈస్పోర్ట్స్ పోటీల్లో ఈ ఫుట్ బాల్, వరల్డ్ క్రికెట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూసీసీ) ఉంటాయి. బ్యాచ్ ల వారీగా వీటిని నిర్వహిస్తారు. ఉత్కంఠభరితమైన మ్యాచ్ లలో అవి తలపడతాయి. అంతిమ విజేతలకు వేవ్స్ లో సత్కారం పొందుతారు.
కార్యక్రమాల వివరాలు
వేవ్స్ ఈస్పోర్ట్స్ చాంపియన్ షిప్ 2025 (డబ్ల్యూఈఎస్సీ-2025)లో నాలుగు ఆన్లైన్ అర్హత దశలుంటాయి. ఈ ఫుట్ బాల్, వరల్డ్ క్రికెట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూసీసీ) దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రతీ దశలోని విజేతలు గ్రాండ్ ఫినాలెలో తలపడతారు. ఈఎస్ఎఫ్ఐ నిర్ణయం మేరకు ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో వీటిని నిర్వహించే అవకాశముంది. ముఖ్యంగా ఈ ఫుట్ బాల్ మొదటి దశలో పవన్ కాంపెల్లి (‘మిస్టర్ టాంబాయ్’ అని కూడా పిలుస్తారు) విజయం ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ఆసియా ఈస్పోర్ట్స్ గేమ్స్ 2024 (ఏఈజీ 2024)లో ఈ- ఫుట్ బాల్ విభాగంలో భారత్ కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ గ్రాండ్ ఫినాలే ద్వారానే తుది విజేతలను నిర్ణయిస్తారు.
* టోర్నమెంట్ విధానాన్ని అవసరమైన విధంగా మార్చే విచక్షణాధికారం ఈఎస్ఎఫ్ఐకి ఉంది.
మార్గదర్శకాలు
అభ్యర్థులు నమోదు సమయంతోపాటు టోర్నమెంట్ మొత్తం మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి:
బహుమతులు
ప్రపంచ ఈస్పోర్ట్స్ చాంపియన్ షిప్-2025 టోర్నమెంట్ ప్రతీ దశ విజేతలూ ప్రధాన కార్యక్రమంలో పోటీపడతారు. బహుమతులు, పోటీలో పాల్గొనడానికి సంబంధించి కీలకమైన అంశాలు కింది విధంగా ఉన్నాయి:
1. ప్రధాన కార్యక్రమానికి అర్హత: ప్రతీ దశలోని విజేతలు ఈఎస్ఎఫ్ఐ నిర్దేశించిన తేదీలోగా తాము అందుబాటులో ఉండే వివరాలను, అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈఎస్ఎఫ్ఐ నిర్దేశించిన ప్రక్రియలను వారు అనుసరించాలి. ఒకవేళ విజేతలు పాల్గొనలేకపోతే.. తర్వాతి ఉత్తమ ర్యాంకు సాధించిన జట్టు లేదా అభ్యర్థులు వారి స్థానంలోకి వస్తారు.
2. డబ్ల్యూఈఎస్సీతోపాటు ఇతర అవకాశాలు: విజేతలుగా నిలిచిన జట్లు లేదా అభ్యర్థి(లు) అర్హులని భావిస్తే.. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈస్పోర్ట్స్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని వారికి ఈఎస్ఎఫ్ఐ అందిస్తుంది.
3. బోధన, శిక్షణ: విజేతలుగా నిలిచిన అభ్యర్థులు లేదా బృందాలు ఈఎస్ఎప్ఐ ఏర్పాటు చేసే బోధన లేదా శిక్షణ సదస్సులకు తప్పక అందుబాటులో ఉండాలి.
4. అదనపు అవకాశాలు: గెలుపొందిన బృందాలు లేదా అభ్యర్థులకు ఈఎస్ఎఫ్ఐ నిర్ణయానుసారం.. భారత్ లోను, అంతర్జాతీయ స్థాయిలోను ఇతర ఈ స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొనడానికి ఆహ్వానం లభించవచ్చు.
డబ్ల్యూఈఎస్సీలో ప్రధాన పోటీకి అర్హత సాధించిన ప్రతి దశలోని విజేతలకు దీని కోసం విమాన టిక్కెట్లు, విడిది, బస ఖర్చులను అందిస్తారు.
ముగింపు
దేశంలో విస్తరిస్తున్న ఈస్పోర్ట్స్ రంగంలో ‘ఈస్పోర్ట్స్ చాంపియన్ షిప్’ ఒక ముఖ్యమైన దశ. సృజనాత్మకత, ప్రతిభతోపాటు పోటీతత్వాన్నీ మేళవిస్తోంది. ప్రపంచ దృశ్య, శ్రవణ వినోద సదస్సు (వేవ్స్)లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రపంచ ఈస్పోర్ట్స్ రంగంలో భారత్ పాత్రను చాటుతుంది. పోటీదారులకు విశేష అవకాశాలను అందిస్తూ... ఈస్పోర్ట్స్ చాంపియన్లను ప్రోత్సహించడానికి, భారత్ లో వినోద రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ‘ప్రపంచ ఈ స్పోర్ట్స్ చాంపియన్ షిప్-2025’ సిద్ధమవుతోంది.
రిఫరెన్సులు:
· https://wavesindia.org/challenges-2025
· https://wesc2025.esportsfederation.in/
· https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2050194
· Guidelines and Regulations for the Tournament
పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
***
Release ID:
(Release ID: 2111141)
| Visitor Counter:
30