సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఎక్స్టెండెడ్ రియాలిటీ రంగంలో కొత్త ఆలోచనలు, సహకార అంశాలను పరిచయం చేసిన పాట్నా వేవ్స్ 2025 – ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్

Posted On: 11 MAR 2025 5:19PM by PIB Hyderabad

మార్చి 8న పాట్నాలో ఏర్పాటైన   ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్    సాంకేతికత, సృజనల అద్భుత సమ్మేళనంగా నిలిచి, వివిధ రంగాల్లో ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ ఆర్) చూపగల పరివర్తన సామర్థ్యాన్ని  పరిచయం చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ప్రపంచ ఆడియో విజువల్, వినోదరంగ సదస్సు – వేవ్స్ 2025లో భాగంగా ‘క్రియేట్ ఇన్ ఛాలెంజ్’ కార్యక్రమం ఏర్పాటయ్యింది. ఎక్స్ ఆర్ సాంకేతికత పట్ల బీహార్ లో పెరుగుతున్న ఆసక్తి, నిపుణుల సంఖ్యను కార్యక్రమం తేటతెల్లం చేసింది. దేశవ్యాప్తంగా ఏర్పాటవుతున్న ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్...  ఎక్స్టెండెడ్ రియాలిటీ సాంకేతికతలో కొత్త ఆలోచనలకు ఊతమిస్తోంది. ఇప్పటికే 150 నగరాలకి చెందిన 2,200 మంది కార్యక్రమంలో భాగ్యమయ్యారు.  

వేవ్స్ ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ (ఎక్స్ సీహెచ్)... ఆగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీ రంగాల్లో నూతన ధోరణులను అన్వేషించేందుకు డెవలపర్లను ప్రోత్సహించే పోటీ.  ఎక్స్ సీహెచ్ ఏర్పాటు కోసం మంత్రిత్వశాఖ వేవ్ ల్యాప్స్, భారత్ ఎక్స్ ఆర్, ఎక్స్ డీజీ ల సహకారం తీసుకుంది.   సాంకేతికతతో మనిషి అనుసంధానమయ్యే పద్ధతిలో కొత్త విధానాలకి శ్రీకారం చుట్టే అత్యాధునిక పద్ధతుల ప్రారంభానికి  ఎక్స్ సీహెచ్ వేదికగా నిలుస్తోంది.

పాట్నా ఐఐటీలో విభాగాధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజీవ్ మిశ్రా, ఓప్లస్ కోవర్క్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ ప్రీతేష్ ఆనంద్, వేవ్ ల్యాప్స్ వ్యవస్థాపక సీఈఓ ఆశుతోష్ కుమార్, సోనిక్ రెండర్ వ్యవస్థాపక సీఈఓ సూరజ్ విశ్వకర్మ వంటి విశిష్ఠ వ్యక్తులు వ్యక్తలుగా హాజరయ్యారు. దేశ సాంకేతిక సామర్థ్యాల మెరుగుదల కోసం  పరిశ్రమ ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రభుత్వం సహకరించుకుంటున్న తీరును కార్యక్రమం తేటతెల్లం చేసింది.  



హ్యాకథాన్ మూడో దశ చివరి పోటీలో ఫైనలిస్ట్ గా నిలిచిన ‘నియర్’ జట్టు, భాగస్వామిగా కార్యక్రమానికి హాజరవడం అందరి ఆసక్తిని చూరగొంది. దేశ తొలి ‘సోషల్ ఏ ఆర్’ యాప్ తయారీ, దాని ప్రభావం గురించిన విశేషాలను పంచుకున్న జట్టు, హ్యాకథాన్ లో పాల్గొనడం వల్ల కలిగే లాభాలను కూడా తెలియజేసింది.    

ఇక, కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రాజీవ్ మిశ్రా నలందా విశ్వవిద్యాలయ పునర్నిర్మాణానికి సంబంధించిన ఇమ్మర్సివ్ ప్రాజెక్టును మిక్సెడ్ రియాలిటీ పద్ధతిలో ప్రదర్శించి, సంస్కృతి పరిరక్షణ, విద్యారంగాల్లో ఎక్స్ ఆర్ సాధించగలిగే అద్భుతాలను పరిచయం చేశారు. బీహార్ అంకుర పరిశ్రమ విధానకర్తల్లో ఒకరైన ప్రీతేష్ ఆనంద్, రాష్ట్ర అంకుర పరిశ్రమల స్థితిగతుల గురించి ఆసక్తికర ప్రసంగం చేశారు. రాష్ట్రంలో సృజనకి, పారిశ్రామిక స్ఫూర్తికి ఊతమివ్వ వలసిన ఆవశ్యకత గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. బీహార్ డిజిటల్ రంగంలో ఎక్స్ ఆర్ సాంకేతికతకు పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని ఈ కార్యక్రమం తెలియజేసింది.  

 


 వేవ్స్ 2025 నేపథ్యం:

మీడియా, వినోద రంగాల్లో మైలురాయి వంటి తొలి వేవ్స్ సదస్సు (ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమిట్) ను భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 1 నుంచి  4 వ తేదీ వరకూ ముంబయిలో నిర్వహిస్తారు.

మీరు పరిశ్రమలో సేవలందిస్తున్న నిపుణులైనా, సృజనకారులైనా, ఆవిష్కర్తలయినా, సదస్సు మీకు ప్రపంచ స్థాయి మీడియా, వినోద రంగాల్లో పని చేస్తున్న ఇతరులతో కలిసి పని చేసేందుకు, అనుసంధానమై మరింత తోడ్పాటును అందించేందుకు అవకాశాలని కల్పిస్తుంది.

 కంటెంట్ సృష్టి, మేధోపరమైన హక్కులు, సాంకేతిక సృజనలో అగ్రగామి దేశంగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు వేవ్స్ సదస్సు దోహదపడుతుంది. ప్రసార విభాగాలు, ప్రింట్ మీడియా, టెలివిజన్, రేడియో, సినిమాలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, శబ్ద గ్రహణ, సంగీత రంగాలు, అడ్వర్టైజింగ్, డిజిటల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, జెనరేటివ్ ఏఐ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఎక్స్టెండెడ్ రియాలిటీ తదితర రంగాల్లోని పరిశ్రమలపై సదస్సు దృష్టి కేంద్రీకరిస్తుంది.


మీ సందేహాలుప్రశ్నలకు జవాబులు ఇక్కడ


రండిమాతో ప్రయాణించండి! వేవ్స్  సదస్సు లో పాల్గొనేందుకు  ఇప్పుడే మీ పేర్లను నమోదు చేసుకోండి! (అతి త్వరలో మీ ముందుకు..!)  

 

***


(Release ID: 2110827) Visitor Counter : 4