సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

సింఫనీ ఆఫ్ ఇండియా

Posted On: 11 MAR 2025 3:32PM by PIB Hyderabad

వేవ్స్ సమ్మేళనంలో అత్యుత్తమ సంగీత పోటీలు

పరిచయం

 

వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)లో భాగంగా సింఫనీ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ పేరుతో అసాధారణమైన సంగీత ప్రయాణానికి సర్వం సిద్ధమైందిదేశవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రతిభను ఈ కార్యక్రమం వెలికితీయనుందిఈ పోటీల్లో పాల్గొనేందుకు 212 మంది సంగీత కళాకారులు నమోదు చేసుకున్నారుసూక్ష్మ పరిశీలన అనంతరం 80 మంది ఉత్తమ శాస్త్రీయజానపద సంగీత కళాకారులను ఎంపిక చేశారువీరంతా ఇప్పుడు గళా రౌండ్‌లో పోటీ పడుతున్నారు.

పాత్రికేయవినోద (ఎం అండ్ ఈరంగం మొత్తాన్ని సమన్వయం చేసే ప్రత్యేకమైన వేదికే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్మొదటి సంచికఅంతర్జాతీయ ఎం అండ్ ఈ రంగాన్ని భారత్‌కు తీసుకొచ్చి ఇక్కడి ఎం అండ్ ఈ రంగంతోదాని ప్రతిభతో అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.

ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్జియో వరల్డ్ గార్డెన్స్‌లో మే నుంచి వరకు ఈ కార్యక్రమం జరుగుతుందిబ్రాడ్‌కాస్టింగ్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ఏవీజీసీ-ఎక్స్ఆర్డిజిటల్ మీడియా ఆవిష్కరణలుచలనచిత్రాలు అనే నాలుగు ప్రధానాంశాలపై వేవ్స్ దృష్టి సారిస్తుందిఅలాగే భారతీయ వినోద పరిశ్రమ భవిష్యత్తును ప్రదర్శిస్తూ ఈ రంగాల్లో దిగ్గజాలురూపకర్తలుసాంకేతిక నిపుణులను ఒక్కచోటకు చేరుస్తుంది.

బ్రాడ్‌కాస్టింగ్ఇన్ఫోటైన్మెంట్‌కు సంబంధించిన మొదటి ప్రధానాంశం కిందకు ఈ సింఫనీ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ వస్తుందిఈ కార్యక్రమం ప్రజలకు ఉత్సాహవంతమైన అనుభూతిని ఇస్తుందివారికి భిన్న రకాల శైలికి సంబంధించిన సంగీత ప్రదర్శనలను ఆస్వాదించే అవకాశం అందిస్తుందిఇది విభిన్న సంగీత ప్రియుల అభిరుచులకు అనుగుణంగా ఉండే కార్యక్రమంగా ఇది మారనుంది.

అర్హతలు:


 

సింఫనీ ఆఫ్ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు ఈ దిగువ పేర్కొన్న అర్హతలను కలిగి ఉండాలి:

వయసు: ఈ పోటీల్లో పాల్గొనే వారి వయస్సు 18 ఏళ్లకు పైబడి ఉండాలి.

పౌరసత్వం: భారతీయ పౌరులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు.

విభాగాలు: వ్యక్తిగతబృంద విభాగాల్లో గాయకులువ్యక్తిగత విభాగంలో సంగీత వాయిద్య విద్వాంసులు పాల్గొనవచ్చు.

దరఖాస్తులను సమర్పించేందుకు మార్గదర్శకాలు:

అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించేందుకు దిగువ పేర్కొన్న నిబంధలను పాటించాల్సి ఉంటుంది:

1.      ఆడిషన్ మెటీరియల్:

·         ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు తమకే ప్రత్యేకమైన శైలిసంగీత నైపుణ్యంసంక్లిష్టమైన సంగీత బాణీలను సైతం పాడగలిగే సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా రికార్డు చేసి సమర్పించాలిఇవి కాపీరైట్‌ను ఉల్లంఘించకుండాసొంత కూర్పులై ఉండాలి.

2.      ప్రదర్శన నిడివి:

·         ప్రతి సంగీత భాగం గరిష్ఠంగా రెండు నిమిషాల నిడివితో ఉండాలి.

3.      వైవిధ్యం:

·         సమర్పించిన సంగీత కూర్పు వైవిధ్యంగాకళాకారుడి ప్రతిభను తెలియజెప్పేట్లు ఉండేలా చూసుకోవాలి.

4.      ఫార్మాట్

·         రికార్డింగ్ ఎంపీఫార్మాట్లో ఉండాలి.

·         ఇవి తప్పనిసరిగా 48 కిలో హెర్ట్జ్, 16-బిట్ ఫార్మాట్‌కు అనుగుణంగా ఉండాలి.

నమోదు ప్రక్రియ:

  • ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు: అన్ని రిజిస్ట్రేషన్లను ఆన్‌లైన్ ద్వారానే స్వీకరిస్తారురిజిస్ట్రేషన్ లింక్ వెబ్‌సైట్లో ఉంది.

  • ఆడియో మెటీరియల్ సమర్పణ: పైన పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరించి అదే వెబ్సైట్లో ఆడిషన్ మెటీరియల్ సమర్పించాలి.

పోటీల విధానం:

  • ప్రాథమిక రౌండ్:

ఆన్ ద్వారా సమర్పించిన రికార్డింగుల నుంచి సూక్ష్మపరిశీలన అనంతరం తదుపరి రౌండ్లలో పాల్గొనేవారిని ఎంపిక చేస్తారు. 40 నుంచి 50 మంది సంగీత కళాకారులను ఎంపిక చేసివారిని నాలుగు లైన్ విభజిస్తారుఅనంతరం వారు బృందాలుగా ఏర్పడి సింఫనీలో పోటీ పడతారు.

  • సెమీ-ఫైనల్ఫైనల్ రౌండ్లు:

అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సింఫనీ బృందాలను సెమీ ఫైనల్స్‌కు ఎంపిక చేస్తారువాటిలో విజేతలుగా ముగ్గురురన్నరప్‌లుగా ఇద్దరిని ఎంపిక చేస్తారు.

  • తుది విజేతలు:

తుది పోటీల్లో పాల్గొన్నవారిలో ముగ్గురు విజేతలను ఎంపిక చేస్తారుఅయిదుగురు అగ్రశ్రేణి విజేతలను కూడా ఎంపిక చేస్తారు.

  • ప్రసారం:

ప్రదర్శనలుఫలితాలతో సహా మొత్తం పోటీలను దూరదర్శన్దాని ప్రాంతీయ ఛానళ్లలో 26 – ధారావాహికలుగా ప్రసారం చేస్తారు.

  • ప్రాంతీయ స్థాయి ప్రదర్శనలు:

వీటికి అర్హత సాధించిన వారు ప్రాంతీయ కేంద్రాల స్థాయిలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారుఇక్కడ అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు.

  • గ్రాండ్ ఫినాలే:

ప్రాంతీయ స్థాయి ప్రదర్శనల నుంచి ఎంపిక చేసిన అగ్రశ్రేణి కళాకారులు గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటారు.

ఓవైపు సృజనాత్మకతసంగీత సరిహద్దులును చెరిపేస్తూనే మరోవైపు సామాజిక స్ఫూర్తిఆవిష్కరణవృద్ధిని పెంపొందించడమే సింఫనీ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుందియువ ప్రతిభను ప్రోత్సహిస్తూప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు తాజా సంగీత అనుభూతిని ఇచ్చే వేదికగా మారేందుకు వేవ్స్ సిద్ధంగా ఉంది.

మహావీర్ జైన్ ఫిలింస్‌తో కలసి దూరదర్శన్ ఈ పోటీలకు నిర్మాతగా వ్యవహరిస్తోందిఈ కార్యక్రమానికి ప్రఖ్యాత కార్యక్రమ దర్శకురాలు శ్రుతి అనిందిత వర్మ దర్శకత్వం వహిస్తున్నారుగౌరవ్ దూబే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నఈ కార్యక్రమానికి పద్మశ్రీ సోమా ఘోష్గాయని శ్రుతి పథక్జానపద గాయకుడు స్వరూప్ ఖాన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారుఅంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ సంగీత కళాకారులైన పెర్కషన్ విద్వాంసుడు తౌఫిక్ ఖురేషీపద్మశ్రీ పురస్కార గ్రహీతవేణుగాణ విద్వాంసుడు రోణు మజుందార్వయోలిన్ విద్వాంసురాలు సునీతా భూయాన్పెర్కసన్ విద్వాంసుడు పండిట్ దినేష్శ్రీ తన్మోయ్ బోస్లెస్లీ లూయిస్వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా తదితరులు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వస్తారు.

 

 

 

వ్యక్తిగత ప్రదర్శనతో మొదలుపెట్టి నాలుగు గ్రూపులుగాఅనంతరం బృందాలుగా పోటీపడతారువారిలో చివరిగా సొంత బాణీలను స్వరపరిచినపాత జానపదాలను పున:సృష్టించిన 10 మంది ప్రతిభావంతులైన సంగీత కళాకారులను ఎంపిక చేస్తారుఈ పది మందిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచినవారు ఒక్కొక్కరూ మెగా సింఫనీ ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠాత్మక వేవ్స్ వేదికపై ప్రదర్శించే అవకాశం పొందుతారుఈ సిరీస్లో విజేతలుగా నిలిచిన మూడు బృందాలు ఉత్సాహవంతులైన ప్రేక్షకుల ముందు తమ ప్రతిభను ప్రదర్శిస్తారుపోటీపడేందుకు వేదికను అందిచడం మాత్రమే కాకుండా కొత్త శైలులుసంగీత పద్ధతులను పరిచయం చేసే అవకాశాన్నివారికి వేవ్స్ కల్పిస్తోంది.

సాధారణ నియమాలు:

  1. జ్యూరీ నిర్ణయాలుసెలబ్రిటీ జ్యూరీతో పాటు ప్రాంతీయ న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయంపోటీల్లో పాల్గొనేవారు దీనికి కట్టుబడి ఉండాలి.

  2. అనుమతులుతమ ప్రదర్శనను సమర్పించడం ద్వారా దాన్ని ప్రచార నిమిత్తం ప్రసారభారతికిఆ సంస్థ నిర్వహిస్తున్న అన్ని వేదికల్లోనూ వినియోగించుకొనే హక్కును ఇస్తారు.

  3. ఖర్చులురాష్ట్ర స్థాయి ఆడిషన్లుఅనంతరం జరిగే రౌండ్లలో పాల్గొనేవారు తమ ప్రయాణవసతి ఖర్చులను వారే భరించాల్సి ఉంటుంది.

ముగింపు

భారతీయ సంగీత సంప్రదాయాలుసమకాలీన వివరణపై ప్రధాన దృష్టి సారించిన సింఫనీ ఆఫ్ ఇండియాసంగీత కళాకారులకు తమ కళను ప్రదర్శించేందుకు పెద్ద వేదికను అందిస్తుందిభారతీయ శాస్త్రీయ సంగీత వారసత్వాన్ని ఆధునిక ఆవిష్కరణలతో మేళవించికొత్త తరం సంగీత కళాకారులను ప్రోత్సహించడానికిభారతీయ సంగీత వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంది.

 

****

(Release ID: 2110650) Visitor Counter : 5