ప్రధాన మంత్రి కార్యాలయం
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి మృతికి సంతాపం ప్రకటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 MAR 2025 7:56PM by PIB Hyderabad
ప్రముఖ సంగీతజ్ఞులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తమ సంతాపం వ్యక్తం చేశారు. తమ అద్వితీయ గానం ద్వారా అనేకుల హృదయాలను స్పృశించిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, ఘనమైన భారతీయ సంగీత, ఆధ్యాత్మిక వారసత్వాలని కొనసాగించారన్నారు .
ఎక్స్ వేదికపై ప్రధానమంత్రి కార్యాలయం పోస్ట్ చేస్తూ..
"గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి మృతి పట్ల ఎంతగానో విచారిస్తున్నాను. ఆయన ఆలపించిన అద్భుతమైన కీర్తనలు ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక, సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూ లెక్కకు మించిన హృదయాలను స్పృశించాయి. ప్రతిభావంతుడైన సంగీతకారునిగా, స్వరకర్తగా ఆయన మనకు ఎల్లకాలం గుర్తుంటారు. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులకూ, అభిమానులకూ నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. ఓం శాంతి: ప్రధాని
@narendramodi", అని పేర్కొంది.
'
***
MJPS/VJ
(रिलीज़ आईडी: 2110043)
आगंतुक पटल : 69
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam