బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శుద్ధి చేసిన గనుల నీటి సురక్షిత వినియోగం

Posted On: 10 MAR 2025 3:45PM by PIB Hyderabad

గనులలో నుంచి ఊటగా వచ్చేలేదా గనులలో మినరల్ శుద్ధి కోసం వినియోగించే నీటిని తాగడానికీసేద్యానికీపారిశ్రామిక ప్రయోజనాలకూ పునర్వినియోగాన్ని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోందిఈ విషయంలో సంబంధిత పర్యావరణ పరిరక్షణజల సంరక్షణ మార్గదర్శకాలను పాటిస్తోందిదీని కోసం బొగ్గు శాఖ తన పరిధిలోని బొగ్గులిగ్నైటు ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల సాయం తీసుకొంటోందిఈ పీఎస్‌యూలలో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఎన్ఎల్‌సీ  ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్)లతోపాటు సింగరేణి కాలరీస్ (ఎస్‌సీసీఎల్ఉన్నాయి. శుద్ధిపరిచిన గనినీటిని లాభసాటిగా ఎలా వినియోగించుకోవాలో పర్యావరణ పరిరక్షణ చట్టం1986, జల (నివారణకాలుష్య నియంత్రణచట్టం1974లలో ఉల్లేఖించిన నిబంధనలతోపాటు కేంద్రీయ కాలుష్య నివారణ మండలి (సీపీసీబీ), ఇంకా ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు (ఎస్‌పీసీబీజారీ చేసిన ఉత్తర్వులు సూచిస్తున్నాయిదీనికి అదనంగాశుద్ధి చేసిన అనంతరం గని నీటిని వేర్వేరు ప్రయోజనాలకు సురక్షితంగాసమర్థంగా వినియోగించుకోవడానికి బొగ్గు పీఎస్‌యూలులిగ్నైటు పీఎస్‌యూలు  తమ సొంత ప్రామాణిక ఆచరణాత్మక నిర్వహణ ప్రణాళిక (ఎస్‌ఓపీలను కూడా రూపొందించుకున్నాయి.

తాగునీరుగా వాడుకోవడానికి గని నీళ్లను శుద్ధి చేసి ఆ తరువాత  సరఫరా చేసేటప్పుడు ఆరోగ్య సంబంధి ప్రమాణాలకూసురక్ష సంబం ప్రమాణాలకూ తులతూగేటట్లు వివిధ నాణ్యత నియంత్రణ చర్యలు చేపడుతున్నారుఈ గని నీళ్లకు భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్ ఐఎస్ 10500:2012), కేంద్రీయ భూగర్భ జల ప్రాధికార సంస్థ (సీజీడబ్ల్యూఏ)లు నిర్దేశించిన ప్రమాణాలు, ఇతర ప్రమాణాల ప్రకారం ఆధికారిక గుర్తింపు ఉన్న ప్రయోగశాలలు నిర్ణీత కాలంలో పరీక్షలను నిర్వహిస్తున్నాయి. సెడిమెంటేషన్వడగట్టడంరోగ క్రిముల నిర్మూలన వంటి శుద్ధి ప్రక్రియలను అవసరమైన మేరకు పూర్తి చేసిన తరువాతనే నీటిని సరఫరా చేస్తున్నారు

గని నీళ్లు నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలను ఝార్ఖండ్ సహా అన్ని బొగ్గు గనుల తవ్వకాలతోపాటులిగ్నైట్ గని తవ్వకాలు జరుగుతున్న అన్ని రాష్ట్రాలలోనూ చేపట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయిగని నీళ్లను ప్రజోపయోగానికిసేద్యానికీపరిశ్రమలకూ- లాభదాయకంగా వాడుకోవడానికీ అవసరమైన ప్రాజెక్టులను బొగ్గు రంగ పీఎస్‌యూలులిగ్నైటు పీఎస్‌యూలు అమలు చేస్తున్నాయిగనినీళ్లను సెంట్రల్ కోల్‌ ఫీల్డ్‌స్ లిమిటెడ్ (సీసీఎల్), భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)లతోపాటు ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్‌స్ లిమిటెడ్ (సీసీఎల్)లకు చెందిన ఆయకట్టుల మధ్య ఉన్న పల్లెల్లో ఉపయోగించుకోవడానికి కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)కూఝార్ఖండ్ ప్రభుత్వానికీ మధ్య ఒక అవగాహన ఒప్పందం పత్రం (ఎంఓయూ)పై సంతకాలయ్యాయి.

ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ ‌రెడ్డి ఈ రోజు రాజ్య సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 2109928)